WTC Final 2025: సౌతాఫ్రికాకు కప్పు.. భారత్‌లో సంబురాలు.. ఈ లాజిక్ అర్థమైందా?
ABN , Publish Date - Jun 15 , 2025 | 11:30 AM
సౌతాఫ్రికా జట్టు తమ చిరకాల స్వప్నాన్ని నెరవేర్చుకుంది. 27 ఏళ్లుగా అందని ద్రాక్షగా ఉన్న ఐసీసీ ట్రోఫీని ఎట్టకేలకు కైవసం చేసుకుంది ప్రొటీస్.

సౌతాఫ్రికా.. ప్రపంచ క్రికెట్‌లో ఈ జట్టు చాలా స్పెషల్. గత రెండు దశాబ్దాలుగా బిగ్ టీమ్స్‌లో ఒకటిగా హవా చలాయిస్తూ వస్తోంది ప్రొటీస్. వన్డేలు, టెస్టులు, టీ20లు.. ఇలా అన్ని ఫార్మాట్లలోనూ చెలరేగి ఆడుతూ వస్తోంది. షాన్ పొలాక్, జాక్వెస్ కలిస్ నుంచి ఏబీ డివిలియర్స్, డేల్ స్టెయిన్, ఎయిడెన్ మార్క్రమ్ వరకు.. ఎందరో స్టార్లను క్రికెట్‌కు అందించింది సౌతాఫ్రికా. అయితే ఇంత చేసినా ఒక్క మేజర్ ఐసీసీ టైటిల్ కూడా అందుకోకపోవడం వారిని ఎప్పుడూ బాధిస్తూనే వచ్చింది. అయితే ఎట్టకేలకు ఆ ఎదురుచూపులకు తెరపడింది. ఆస్ట్రేలియాను ఓడించి వరల్డ్ టెస్ట్ చాంపియన్‌షిప్-2025 కప్పును కైవసం చేసుకున్నారు సఫారీలు. అయితే ఆ జట్టు ట్రోఫీ గెలిస్తే భారత అభిమానులు సెలబ్రేట్ చేసుకుంటున్నారు. దీని వెనుక లాజిక్ ఏంటో ఇప్పుడు చూద్దాం..
కంగారూలను ఓడించడంతో..
డబ్ల్యూటీసీ-2025 ఫైనల్‌లో ఆస్ట్రేలియాను 5 వికెట్ల తేడాతో చిత్తు చేసింది సౌతాఫ్రికా. తద్వారా 27 ఏళ్లుగా అందని ద్రాక్షగా ఉన్న ఐసీసీ టైటిల్‌ను సగర్వంగా అందుకుంది బవుమా సేన. దీంతో ఆ జట్టు అభిమానులు ఫుల్‌గా సెలబ్రేట్ చేసుకుంటున్నారు. ప్రొటీస్ ఫ్యాన్స్‌తో పాటు భారత అభిమానులూ సౌతాఫ్రికా సక్సెస్‌ను ఎంజాయ్ చేస్తున్నారు. దీనికి ఒక కారణం ఆస్ట్రేలియా అయితే మరో కారణం బవుమా సేన మీద ఉన్న ఇష్టమనే చెప్పాలి. వరల్డ్ క్రికెట్‌ను దశాబ్దాలుగా శాసిస్తూ వస్తున్న కంగారూల వల్ల టీమిండియా ఎన్నో కప్పులు మిస్ అయింది. అందుకే ఆ టీమ్‌ను ఓడించి సఫారీలు ట్రోఫీ అందుకోవడంతో ఇది మన విజయంగా ఇక్కడి ఫ్యాన్స్ భావిస్తున్నారని తెలుస్తోంది.
భారీ అభిమానగణం..
డివిలియర్స్, స్టెయిన్, క్లాసెన్, మార్క్రమ్.. ఇలా సౌతాఫ్రికా స్టార్లకు భారత్‌లో భారీ అభిమానగణం ఉంది. వివాదాలు, స్లెడ్జింగ్ లాంటి వాటికి దూరంగా ఉండే సఫారీ ఆటగాళ్లకు భారత స్టార్లతో సత్సంబంధాలు ఉన్నాయి. దీనికి తోడు ఐపీఎల్‌లో ఆడుతూ వాళ్లు మరింత క్రేజ్ సంపాదించుకున్నారు. భారత్‌తో మ్యాచుల సమయంలో సౌతాఫ్రికా ప్లేయర్లు ఓవరాక్షన్ చేసిన సందర్భాలు దాదాపుగా లేవు. అందుకే ఆ టీమ్ విజయాన్ని మన అభిమానులు సెలబ్రేట్ చేసుకుంటున్నారని ఎక్స్‌పర్ట్స్ చెబుతున్నారు.
ఇవీ చదవండి:
17 ఏళ్ల తర్వాత రాక్షసుడి రీఎంట్రీ
బన్నీ హాప్స్ క్యాచ్‌లు కుదరవు
మరిన్ని క్రీడా వార్తల కోసం క్లిక్ చేయండి