Siraj-Stokes: స్టోక్స్‌కు దిమ్మతిరిగేలా చేసిన సిరాజ్.. దెబ్బకు గాల్లోకి బ్యాట్..!
ABN , Publish Date - Jun 22 , 2025 | 07:14 PM
లీడ్స్ టెస్ట్ ఊహించిన దాని కంటే ఆసక్తికరంగా సాగుతోంది. ఆతిథ్య జట్టు బ్యాటర్లు పోరాడుతుండటంతో మ్యాచ్ రసకందాయంలో పడింది.

ఇంగ్లండ్ కెప్టెన్ బెన్ స్టోక్స్ బౌలింగ్‌తో పాటు బ్యాటింగ్‌లోనూ అదరగొడుతుంటాడు. డిఫెన్స్‌తో పాటు అటాకింగ్ పరంగానూ అతడికి ఢోకా లేదు. పేసర్లు, స్పిన్నర్లు ఇలా ఎవరు బౌలింగ్‌కు దిగినా బంతి మెరిట్‌ను బట్టి ఆడుతూ పోతుంటాడు స్టోక్స్. మంచి టెక్నిక్‌తో బౌలర్లను ఓ ఆటాడుకుంటాడు. అతడి వికెట్ తీయడం అంత ఈజీ కాదు. అలాంటోడ్ని హైదరాబాదీ మహ్మద్ సిరాజ్ మరోమారు బోల్తా కొట్టించాడు. ఆఫ్ సైడ్ ఊరించే బంతిని వేసి.. ఆడేలా చేసి అతడ్ని వలలో వేసుకున్నాడు. మియా మ్యాజిక్ దెబ్బకు స్టోక్స్ బిత్తరపోయాడు. అసలు ఎలా ఔట్ అయ్యానా అంటూ షాక్ అయ్యాడు.
కోపం తట్టుకోలేక..
సిరాజ్ దెబ్బకు స్టోక్స్‌కు మైండ్ బ్లాంక్ అయింది. అసలు అతడి వలలో ఎలా పడ్డానా? అంటూ ఆలోచనల్లో పడ్డాడు. ఔట్ అయ్యాననే ఫ్రస్ట్రేషన్‌లో బ్యాట్‌ను గాల్లోకి విసిరేశాడు స్టోక్స్. ఆ తర్వాత దాన్ని పట్టుకొని మెడ కింద పెట్టుకొని పెవిలియన్ వైపు నడక సాగించాడు. డ్రెస్సింగ్ రూమ్‌కు వెళ్తున్నప్పుడు చాలా కోపంగా కనిపించాడు స్టోక్స్. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఇది చూసిన నెటిజన్స్.. సిరాజ్‌తో పెట్టుకుంటే ఇట్లుంటది అని కామెంట్స్ చేస్తున్నారు. మియా మ్యాజిక్ మామూలుగా ఉండదని హెచ్చరిస్తున్నారు. లీడ్స్‌లోనే కాదు.. ఇతర టెస్టుల్లోనూ స్టోక్స్‌కు ప్రమాదం తప్పదని వార్నింగ్ ఇస్తున్నారు.
అలవాటు చేసుకో..
స్టోక్స్ బ్యాట్ విసిరేయడం ఇక అలవాటు చేసుకో అని నెటిజన్స్ సెటైర్స్ వేస్తున్నారు. ఈసారి సిరాజ్ ఔట్ చేశాడు, నెక్స్ట్ టైమ్ బుమ్రా చేతిలో బలవడం ఖాయమని హెచ్చరిస్తున్నారు. కాగా, ప్రస్తుతం ఈ మ్యాచ్‌లో తొలి ఇన్నింగ్స్‌లో 6 వికెట్లకు 352 పరుగులతో బ్యాటింగ్ చేస్తోంది ఇంగ్లండ్. హ్యారీ బ్రూక్ (70 నాటౌట్), క్రిస్ వోక్స్ (1 నాటౌట్) క్రీజులో ఉన్నారు. బ్రూక్‌ను త్వరగా ఔట్ చేస్తే భారత్‌కు 100 పరుగుల వరకు ఆధిక్యం దక్కే అవకాశాలు ఉన్నాయి.
ఇవీ చదవండి:
నల్లరిబ్బన్లు ఎందుకు కట్టుకున్నారంటే..
మరిన్ని క్రీడా వార్తల కోసం క్లిక్ చేయండి