Shubman Gill: గిల్‌కు మరో ప్రమోషన్.. అదృష్టం అంటే ఇదేనేమో!
ABN , Publish Date - Jun 10 , 2025 | 01:03 PM
భారత టెస్ట్ జట్టు నయా సారథి శుబ్‌మన్ గిల్‌కు మరో ప్రమోషన్ దక్కినట్లు తెలుస్తోంది. ఆ బాధ్యతల్ని కూడా ఈ యంగ్ బ్యాటర్‌కే అప్పగించాలని బీసీసీఐ పెద్దలు ఫిక్స్ అయినట్లు సమాచారం.

టీమిండియాకు ఆడటం చాలా మంది యువ క్రికెటర్ల కల. అలాంటిది భారత జట్టుకు సారథ్యం వహించే అవకాశం దక్కితే.. దాన్ని మించిన అదృష్టం ఉండదనే చెప్పాలి. అలాంటి లక్కే యంగ్ బ్యాటర్ శుబ్‌మన్ గిల్‌కు దక్కింది. మెన్ ఇన్ బ్లూలోకి ఎంట్రీ ఇచ్చిన కొద్ది కాలంలోనే తన స్థానాన్ని పదిలం చేసుకున్న గిల్.. ఇప్పుడు భారత టెస్ట్ టీమ్‌కు కెప్టెన్సీ వహించే స్థాయికి ఎదిగాడు. ఇంగ్లండ్‌తో జరిగే 5 టెస్టుల సిరీసే సారథిగా అతడికి మొదటి సవాల్ కానుంది. ఈ చాలెంజ్ కోసం గిల్ గట్టిగా రెడీ అవుతున్నాడు. ఇంగ్లీష్ జట్టును చిత్తు చేయాలని వ్యూహాలు పన్నుతున్నాడు. ఈ తరుణంలో అతడికి మరో జాక్‌పాట్ దక్కిందని తెలుస్తోంది. అదేంటో ఇప్పుడు చూద్దాం..
పక్కా ప్లానింగ్‌తో..
భారత టెస్ట్ టీమ్‌కు సారథిగా ఎంపికైన గిల్‌ను వన్డేలకూ కెప్టెన్ చేయాలని బీసీసీఐ అనుకుంటోందట. 50 ఓవర్ల ఫార్మాట్‌కు ప్రస్తుతం రోహిత్ శర్మ సారథిగా ఉన్నాడు. 2027 వన్డే వరల్డ్ కప్‌లో పక్కా ఆడాలని హిట్‌మ్యాన్ భావిస్తున్నాడట. అయితే అప్పటికి అతడికి 40 ఏళ్లు నిండుతాయి. ఫామ్, ఫిట్‌నెస్ ఎంతవరకు సహకరిస్తాయో చెప్పలేం. కాబట్టి వన్డే పగ్గాలు గిల్‌కు అప్పగించాలని బోర్డు పెద్దలు భావిస్తున్నారట. మూడు ఫార్మాట్లకు మూడు వేర్వేరు సారథులు కాకుండా ఒకే కెప్టెన్ ఉండాలని సమాలోచనలు చేస్తున్నారట. టీ20 సారథిగా ఉన్న సూర్యకుమార్‌ను పొట్టి ప్రపంచ కప్-2026 పూర్తయ్యే వరకు కొనసాగించి.. ఆ తర్వాత గిల్‌ను నయా కెప్టెన్‌గా ప్రకటించాలని చూస్తున్నారట. ముందుగా వన్డే సారథ్యం, ఆ తర్వాత టీ20 పగ్గాల మార్పు చేయాలనేది బోర్డు ప్లాన్ అని సమాచారం.
ఇవీ చదవండి:
మరిన్ని క్రీడా వార్తల కోసం క్లిక్ చేయండి