Share News

Shubman Gill: ఎవరితోనైనా లవ్‌లో ఉన్నారా.. గిల్ నుంచి ఊహించని ఆన్సర్

ABN , Publish Date - Apr 26 , 2025 | 06:41 PM

Indian Premier League: టీమిండియా యంగ్ బ్యాటర్ శుబ్‌మన్ గిల్ ఐపీఎల్‌లో అదరగొడుతున్నాడు. రెచ్చిపోయి బ్యాటింగ్ చేస్తున్న గిల్.. కెప్టెన్సీలోనూ తన మార్క్ చూపిస్తున్నాడు. అలాంటోడు తాజాగా ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. పర్సనల్ లైఫ్‌తో పాటు ప్రొఫెషనల్ లైఫ్ గురించీ పలు విషయాలు షేర్ చేశాడు.

Shubman Gill: ఎవరితోనైనా లవ్‌లో ఉన్నారా.. గిల్ నుంచి ఊహించని ఆన్సర్
Shubman Gill

టీమిండియాలోకి చాలా మంది ప్లేయర్లు వచ్చీ పోతుంటారు. డొమెస్టిక్ క్రికెట్, ఐపీఎల్‌లో అదరగొట్టి భారత జట్టులోకి ఎంట్రీ ఇచ్చినా తమదైన ముద్ర వేయడంలో ఫెయిల్ అవుతుంటారు. కొందరు మాత్రమే జట్టులో సెటిల్ అవుతారు. అలాంటి అరుదైన ప్లేయర్లలో యంగ్ బ్యాటర్ శుబ్‌మన్ గిల్ ఒకడు. తక్కువ వ్యవధిలోనే మూడు ఫార్మాట్లలోనూ కీలక ఆటగాడిగా ఎదిగాడతను. ఐపీఎల్‌లోనూ రఫ్ఫాడిస్తూ గుజరాత్ టైటాన్స్ కెప్టెన్‌గా ఎంపికయ్యాడీ ఫ్యూచర్ స్టార్. ప్రొఫెషనల్‌ కెరీర్‌తో పాటు పర్సనల్ లైఫ్‌లో రిలేషన్‌షిప్స్ రూమర్స్‌తో ఎక్కువగా వార్తల్లో నిలుస్తున్నాడు. అయితే ఎట్టకేలకు వాటిపై అతడు క్లారిటీ ఇచ్చాడు.


అస్సలు నమ్మొద్దు..

సారా టెండూల్కర్, సారా అలీ ఖాన్ నుంచి.. మరియా అరోయోగ్, రిధిమా పండిట్ వరకు చాలా మంది సెలెబ్రిటీస్‌తో గిల్ లవ్‌లో ఉన్నట్లు పుకార్లు వచ్చాయి. మొత్తానికి ఈ విషయంపై అతడు తేల్చేశాడు. తాజాగా ఓ ప్రముఖ మ్యాగజీన్‌కు ఇంటర్వ్యూ ఇచ్చిన గిల్.. తాను ఎవరితోనూ ప్రేమలో లేనని స్పష్టం చేశాడు. 3 ఏళ్లుగా సింగిల్‌గా ఉంటున్నానని చెప్పుకొచ్చాడు భారత స్టార్. ఫలానా అమ్మాయితో తాను డేటంగ్ చేస్తున్నానని చాలా రూమర్లు వచ్చాయని.. వాటిని అస్సలు నమ్మొద్దన్నాడు గిల్. తాను ఏ అమ్మాయినీ ప్రేమించడం లేదని క్లారిటీ ఇచ్చాడు. ఇప్పుడు తన ఫోకస్ మొత్తం ప్రొఫెషనల్ లైఫ్ మీదే ఉందని.. క్రికెట్‌లో మరింతగా రాణించడంపై దృష్టి పెట్టానని గిల్ వివరించాడు. రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ, గౌతం గంభీర్, ఆశిష్ నెహ్రా, యువరాజ్ సింగ్ లాంటి దిగ్గజాలతో ట్రావెల్ చేయడం సంతోషంగా ఉందన్నాడు. కెరీర్‌కు సంబంధించిన ప్రతి విషయంలోనూ వాళ్లు తనకు అండగా ఉంటున్నారని వ్యాఖ్యానించాడు.


ఇవీ చదవండి:

ఎస్‌ఆర్‌హెచ్ ప్లేఆఫ్స్ బెర్త్ పక్కా.. ఎలాగంటే

ధోనీని బద్నాం చేస్తే ఊరుకోను

విరాట్ వెనుక హనుమయ్య

మరిన్ని క్రీడా, తెలుగు వార్తల కోసం క్లిక్ చేయండి

Updated Date - Apr 26 , 2025 | 06:41 PM