Share News

Shubman Gill: గిల్‌కు బీసీసీఐ ప్రమోషన్.. కెప్టెన్-వైస్ కెప్టెన్‌ను ప్రకటించిన బోర్డు!

ABN , Publish Date - May 24 , 2025 | 01:53 PM

యంగ్ బ్యాటర్ శుబ్‌మన్ గిల్‌కు ఊహించని రీతిలో ప్రమోషన్ ఇచ్చింది భారత క్రికెట్ బోర్డు. అతడితో పాటు వికెట్ కీపర్, బ్యాటర్ రిషబ్ పంత్‌కు సర్‌ప్రైజ్ గిఫ్ట్ ఇచ్చింది బోర్డు.

Shubman Gill: గిల్‌కు బీసీసీఐ ప్రమోషన్.. కెప్టెన్-వైస్ కెప్టెన్‌ను ప్రకటించిన బోర్డు!
Shubman Gill

టీమిండియా యంగ్ బ్యాటర్ శుబ్‌మన్ గిల్ ప్రమోషన్ కొట్టేశాడు. భారత టెస్ట్ జట్టు కొత్త సారథిగా అతడ్ని నియమించింది బీసీసీఐ. గిల్‌కు డిప్యూటీగా, వైస్ కెప్టెన్‌గా వికెట్ కీపర్ రిషబ్ పంత్‌ను ఎంపిక చేసింది. ఇంగ్లండ్‌ టూర్‌కు వెళ్లే భారత జట్టును తాజాగా ప్రకటించింది బీసీసీఐ. జూన్ 20 నుంచి జరిగే 5 టెస్టుల ఈ సిరీస్ కోసం 18 మందితో కూడిన భారీ బృందాన్ని ఎంపిక చేసింది బోర్డు. ఈ జట్టులో కెప్టెన్ గిల్, వైస్ కెప్టెన్ పంత్‌తో పాటు యశస్వి జైస్వాల్, కేఎల్ రాహుల్, సాయి సుదర్శన్, అభిమన్యు ఈశ్వరన్, కరుణ్ నాయర్, నితీష్ కుమార్ రెడ్డి, రవీంద్ర జడేజా, ధృవ్ జురెల్, వాషింగ్టన్ సుందర్ ఎంపికయ్యారు. అలాగే శార్దూల్ ఠాకూర్, జస్‌ప్రీత్ బుమ్రా, మహ్మద్ సిరాజ్, ప్రసిద్ధ్ కృష్ణ, ఆకాశ్‌దీప్, అర్ష్‌దీప్ సింగ్, కుల్దీప్ యాదవ్ కూడా ఇంగ్లండ్‌ ఫ్లైట్ ఎక్కనున్నారు.


భారత జట్టు ఇదే:

  • శుబ్‌మన్ గిల్ (కెప్టెన్)

  • రిషబ్ పంత్ (వైస్ కెప్టెన్/వికెట్ కీపర్)

  • యశస్వి జైస్వాల్

  • కేఎల్ రాహుల్

  • సాయి సుదర్శన్

  • అభిమన్యు ఈశ్వరన్

  • కరుణ్ నాయర్

  • నితీష్ కుమార్ రెడ్డి

  • రవీంద్ర జడేజా

  • ధృవ్ జురెల్ (వికెట్ కీపర్)

  • వాషింగ్టన్ సుందర్

  • శార్దూల్ ఠాకూర్

  • జస్‌ప్రీత్ బుమ్రా

  • మహ్మద్ సిరాజ్

  • ప్రసిద్ధ్ కృష్ణ

  • ఆకాశ్‌దీప్

  • అర్ష్‌దీప్ సింగ్

  • కుల్దీప్ యాదవ్.


ఆ ఒక్కటే లోటు!

టెస్ట్ జట్టులో దాదాపుగా అందరికీ న్యాయం జరిగిందనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. దేశవాళీల్లో అదరగొడుతున్న కరుణ్ నాయర్, అభిమన్యు ఈశ్వరన్, శార్దూల్ ఠాకూర్‌‌ను టీమ్‌లోకి తీసుకోవడమే దీనికి ఉదాహరణ అని సోషల్ మీడియాలో నెటిజన్స్ అంటున్నారు. అటు బ్యాటింగ్, ఇటు బౌలింగ్‌లో జట్టు దుర్భేద్యంగా ఉందని చెబుతున్నారు. అయితే సీనియర్ పేసర్ మహ్మద్ షమి ఉండి ఉంటే ఇంకా బాగుండేదని నెటిజన్స్ కామెంట్స్ చెబుతున్నారు. కాగా, వెన్ను గాయం కోలుకొని నుంచి ఇటీవలే రీఎంట్రీ ఇచ్చాడు షమి. అయితే ఇంకా పూర్తిగా కోలుకోకపోవడం, ఇంత త్వరగా టెస్టుల్లో ఆడించడం అతడి కెరీర్‌కు ప్రమాదమని వైద్యులు హెచ్చరించడంతో ఈ టూర్‌కు ఎంపిక చేయలేదని వినిపిస్తోంది.


ఇవీ చదవండి:

ఫైనల్ టెన్షన్.. ఆర్సీబీ ఎన్ని గెలవాలంటే..

నీరజ్‌కు రెండోస్థానం

మరిన్ని క్రీడా, తెలుగు వార్తల కోసం క్లిక్ చేయండి

Updated Date - May 24 , 2025 | 02:18 PM