ENG vs ZIM: ఒకే మ్యాచ్‌లో 9 వికెట్లు.. ఈ రాక్షసుడ్ని మనోళ్లు ఆపగలరా!
ABN , Publish Date - May 25 , 2025 | 05:08 PM
జింబాబ్వేతో జరిగిన ఏకైక టెస్ట్‌లో ఇంగ్లండ్ భారీ విజయం సాధించింది. ఏకంగా ఇన్నింగ్స్ 45 పరుగుల తేడాతో ప్రత్యర్థిని చిత్తు చేసింది స్టోక్స్ సేన. ఈ ఘన విజయానికి ఓ బౌలర్ ప్రధాన కారణమని చెప్పాలి. ఏకంగా 9 వికెట్లతో రెచ్చిపోయిన ఆ స్పిన్నర్ ఎవరో ఇప్పుడు చూద్దాం..

జింబాబ్వేతో జరిగిన ఏకైక టెస్ట్‌లో ఇంగ్లండ్ జట్టు ఇన్నింగ్స్ 45 పరుగుల భారీ తేడాతో విజయం సాధించింది. ఈ మ్యాచ్‌లో మొదట బ్యాటింగ్ చేసిన ఆతిథ్య జట్టు తొలి ఇన్నింగ్స్‌లో 565 పరుగులు చేసింది. ఆ తర్వాత బ్యాటింగ్‌కు దిగిన జింబాబ్వే 265 పరుగులకు ఆలౌట్ అయింది. అనంతరం ఫాలో ఆన్‌కు దిగిన పర్యాటక జట్టు.. ఈసారి 255 పరుగులకే పరిమితమైంది. దీంతో ఇన్నింగ్స్ తేడాతో విక్టరీ కొట్టింది ఇంగ్లండ్. రెండు ఇన్నింగ్స్‌ల్లో కలిపి 9 వికెట్లతో రెచ్చిపోయాడు ఇంగ్లీష్ స్పిన్నర్ షోయబ్ బషీర్. తొలి ఇన్నింగ్స్‌లో 3 వికెట్లు తీసిన పొడగరి బౌలర్.. రెండో ఇన్నింగ్స్‌లో మరో 6 వికెట్లు తీసి వార్ వన్ సైడ్ చేసేశాడు. దీంతో అతడికి ప్లేఆఫ్ ది మ్యాచ్ అవార్డు దక్కింది.
పెవిలియన్‌కు క్యూ..
షోయబ్ బషీర్ దెబ్బకు మూడ్రోజుల్లో మ్యాచ్ ముగిసింది. ఆటను నాలుగో రోజుకు తీసుకెళ్దామని భావించింది జింబాబ్వే. కానీ బెన్ కర్రన్ (37), సీన్ విలియమ్స్ (88), సికందర్ రజా (60) వికెట్లు తీసి మ్యాచ్‌పై ఇంగ్లండ్ పట్టు పెరిగేలా చేశాడీ స్పిన్నర్. సిగా (4), ముజర్బానీ (0), తెనక చివాంగా (10)ని వెనక్కి పంపించి మ్యాచ్‌ను ఊహించిన దాని కంటే త్వరగానే ముగించాడు. జింబాబ్వే బ్యాటర్లు పోరాడతారని అనుకుంటే బషీర్ ముందు సరెండర్ అయిపోయారు. కాగా, బషీర్ బౌలింగ్ చూసిన నెటిజన్స్.. రాబోయే ఇంగ్లండ్-భారత్ సిరీస్ మరింత రసవత్తరంగా సాగడం ఖాయమని అంటున్నారు. ఈ స్పిన్ రాక్షసుడితో టీమిండియాకు డేంజరే అని చెబుతున్నారు. కేఎల్ రాహుల్-గిల్ సహా ఇతర బ్యాటర్లు ఇతడ్ని సమర్థంగా ఎదుర్కోవాలని.. తక్కువ అంచనా వేస్తే మూల్యం చెల్లించుకోక తప్పదని హెచ్చరిస్తున్నారు.
ఇవీ చదవండి:
మరిన్ని క్రీడా, తెలుగు వార్తల కోసం క్లిక్ చేయండి