Share News

Shikhar Dhawan: ఆ రోజే నా కెరీర్ క్లోజ్.. ధవన్ షాకింగ్ కామెంట్స్!

ABN , Publish Date - Jul 02 , 2025 | 09:04 AM

టీమిండియా వెటరన్ ఓపెనర్ శిఖర్ ధవన్ తన రిటైర్‌మెంట్ గురించి ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. అతడు కొట్టిన డబుల్ సెంచరీతో తన కెరీర్ క్లోజ్ అయిందన్నాడు.

Shikhar Dhawan: ఆ రోజే నా కెరీర్ క్లోజ్.. ధవన్ షాకింగ్ కామెంట్స్!
Shikhar Dhawan

భారత జట్టులో స్థానాన్ని పదిలం చేసుకోవడం అంత సులువు కాదు. ఎంతటి ప్రతిభావంతుడైన ప్లేయర్ అయినా నిలకడగా రాణిస్తూ, జట్టు అవసరాలకు తగ్గట్లు పెర్ఫార్మ్ చేస్తూ పోతే తప్ప బెర్త్ పక్కా అని చెప్పలేం. సీనియర్లకూ ఇదే సూత్రం వర్తిస్తుంది. అయితే అనుభవజ్ఞులైన ఆటగాళ్లకు విఫలమైనా ఎక్కువ అవకాశాలు వస్తాయి. కానీ ప్రత్యామ్నాయాలు ఉంటే వాళ్లనూ కొన్నాళ్లకు పక్కనబెట్టేస్తారు. టీమిండియా వెటరన్ ఓపెనర్ శిఖర్ ధవన్ విషయంలోనూ ఇదే జరిగింది. దాదాపు దశాబ్ద కాలం పాటు భారత జట్టులో ఓపెనర్‌గా అదరగొట్టిన ధవన్.. ఒక్క డబుల్ సెంచరీ దెబ్బకు టీమ్‌కు దూరమయ్యాడు. ఈ విషయాన్ని స్వయంగా అతడే రివీల్ చేశాడు. ఇంతకీ ధవన్ ఏమన్నాడంటే..


ఇన్నర్ వాయిస్ వినిపించడంతో..

టీమిండియా తరఫున ఓపెనర్‌గా ఎన్నో బ్యూటిఫుల్ ఇన్నింగ్స్‌లు ఆడిన ధవన్.. ఒక దశలో తీవ్ర ఒడిదొడుకులు ఎదుర్కొన్నాడు. అదే సమయంలో యంగ్ బ్యాటర్ ఇషాన్ కిషన్ సూపర్బ్ నాక్స్‌తో ఆకట్టుకున్నాడు. ఇదే క్రమంలో అతడు డబుల్ సెంచరీ కొట్టాడు. ఈ ఇన్నింగ్స్‌తో తన కెరీర్ ముగింపు దశకు చేరుకుందని భావించానని తన ఆత్మకథ ది వన్‌లో ధవన్ ప్రకటించాడు. ఇషాన్ ఇన్నింగ్స్ చూసి నీ కెరీర్ ఆఖరి స్టేజ్‌కు వచ్చేసిందని తన అంతరాత్మ నుంచి ఒక ఇన్నర్ వాయిస్ వినిపించిందన్నాడు.


ద్రవిడ్ మాటతో..

కెరీర్ చివరి దశలో తాను కుంగిపోతానని చాలా మంది అనుకున్నారని ధవన్ తెలిపాడు. అయితే అలా జరగలేదన్నాడు. కీలకమైన ఆ సమయంలో స్నేహితులు, శ్రేయోభిలాషులు మద్దతుగా నిలవడం మర్చిపోలేనన్నాడు. ఇప్పటికీ అలాంటిది జరగలేదని.. ఆటను ఇంకా ఆస్వాదిస్తున్నానని ధవన్ చెప్పుకొచ్చాడు. టీమ్‌లో ప్లేస్ కోల్పోయిన సమయంలో రాహుల్ ద్రవిడ్‌తో మాట్లాడనని.. ఆయన తనకు మెసేజ్ చేశాడని తెలిపాడు ధవన్. నీదైన తోవలో ప్రయాణం చేయాలని ఆయన సూచించాడని పేర్కొన్నాడు.


ఇవీ చదవండి:

బుమ్రా ఆడేనా

క్రీడలకు కొత్త జోష్‌

నిఖత్‌కు రజతం

మరిన్ని క్రీడా వార్తల కోసం క్లిక్ చేయండి

Updated Date - Jul 02 , 2025 | 09:08 AM