Shardul Thakur: బీజీటీ హీరోకు బంపర్ చాన్స్.. బీసీసీఐని మెచ్చుకోవాల్సిందే
ABN , Publish Date - May 12 , 2025 | 11:19 AM
Team India: కష్టపడేతత్వం ఉన్నవారికి అదృష్టం కూడా కలిసొస్తుందని పెద్దలు అంటుంటారు. ఇప్పుడో పేస్ ఆల్‌రౌండర్ విషయంలో అదే జరుగుతోంది. టీమిండియాలో ప్లేస్ పోయినా బాధపడకుండా కష్టపడుతూ వచ్చిన ఆ ఆటగాడు.. ఏడాదిన్నర గ్యాప్ తర్వాత రీఎంట్రీకి సిద్ధమవుతున్నాడు. అతడు ఎవరనేది ఇప్పుడు చూద్దాం..

టీమిండియాలో చోటు దక్కించుకోవడం అంత ఈజీ కాదు. రంజీలు, ఐపీఎల్‌లో రాణించినా బ్లూ జెర్సీ వేసుకునే చాన్స్ వస్తుందన్న గ్యారెంటీ లేదు. ప్రతిభకు తోడు కాసింత అదృష్టం, పరిస్థితులు కలిసొస్తే తప్ప భారత జట్టులో చోటు దక్కదు. యువకులకు ఏమో గానీ.. టీమిండియాకు ఆడి దూరంగా ఉన్న ఆటగాళ్లకు రీఎంట్రీ చాలా టఫ్. అదో యుద్ధమనే చెప్పాలి. కానీ ఆ వార్‌లో పేస్ బౌలింగ్ ఆల్‌రౌండర్ శార్దూల్ ఠాకూర్ గెలిచాడని తెలుస్తోంది. ఏడాదిన్నరగా భారత టెస్ట్ టీమ్‌కు దూరంగా ఉంటున్న ఈ బీజీటీ హీరో.. ఎట్టకేలకు కమ్‌బ్యాక్ ఇవ్వనున్నట్లు వినిపిస్తోంది. ఏ సిరీస్‌తో అతడు భారత జట్టులోకి వస్తున్నాడో ఇప్పుడు చూద్దాం..
వాటే చాన్స్..
5 టెస్టుల సిరీస్ కోసం త్వరలో ఇంగ్లండ్ ఫ్లైట్ ఎక్కనున్న భారత జట్టులో శార్దూల్ ఠాకూర్‌కు బెర్త్ కన్ఫర్మ్ అయిందని తెలుస్తోంది. ముంబై తరఫున దేశవాళీ రెడ్ బాల్ టోర్నమెంట్స్‌లో అదరగొడుతున్న లార్డ్ శార్దూల్.. ఐపీఎల్-2025లోనూ దుమ్మురేపుతున్నాడు. అనూహ్యంగా లక్నో సూపర్ జెయింట్స్‌లోకి ఎంట్రీ ఇచ్చిన పేస్ ఆల్‌రౌండర్.. వికెట్ల మీద వికెట్లు తీస్తూ ఆ టీమ్‌కు పెద్ద దిక్కుగా మారాడు. అతడి టాలెంట్‌కు ఫిదా అయిన బీసీసీఐ.. ఇంగ్లండ్ టూర్‌కు సెలెక్ట్ చేయాలని డిసైడ్ అయిందట. పేస్, స్వింగ్‌కు అనుకూలించే ఇంగ్లీష్ పిచ్‌లపై షమి, బుమ్రా, సిరాజ్, ప్రసిద్ధ్‌కు శార్దూల్ కూడా తోడైతే టీమిండియాకు తిరుగుండదని సెలెక్టర్లు భావిస్తున్నారట. అతడితో పాటు స్టైలిష్ బ్యాటర్ శ్రేయస్ అయ్యర్‌ను కూడా ఇంగ్లండ్ టూర్‌కు పంపాలని అనుకుంటున్నారట. ఇది తెలిసిన నెటిజన్స్.. విశేషంగా రాణిస్తున్న శార్దూల్, అయ్యర్ లాంటి వారిని సెలెక్ట్ చేయాలనుకోవడం భేష్ అంటూ బీసీసీఐని మెచ్చుకుంటున్నారు. వీళ్లు టీమిండియాకు బిగ్ ప్లస్ అవుతారని అంటున్నారు. ఈ చాన్స్‌ను ఉపయోగించుకొని ఇద్దరూ టీమ్‌లో సెటిల్ అవ్వాలని సూచిస్తున్నారు.
ఇవీ చదవండి:
ఆ రోజు క్రికెట్ వదిలేస్తా: రోహిత్
నాకు కెప్టెన్సీ అక్కర్లేదు: బుమ్రా
మరిన్ని క్రీడా, తెలుగు వార్తల కోసం క్లిక్ చేయండి