Share News

Saurav Ganguly Family: బోటు బోల్తా.. సముద్రంలో గంగూలీ సోదరుడి కుటుంబం..!

ABN , Publish Date - May 26 , 2025 | 05:25 PM

టీమిండియా లెజెండ్ సౌరవ్ గంగూలీ కుటుంబం ప్రమాదంలో పడింది. వాళ్లు ప్రయాణిస్తున్న బోటు ఒక్కసారిగా బోల్తాపడింది. ఆ తర్వాత ఏం జరిగిందంటే..

Saurav Ganguly Family: బోటు బోల్తా.. సముద్రంలో గంగూలీ సోదరుడి కుటుంబం..!
Saurav Ganguly

టీమిండియా లెజెండ్ సౌరవ్ గంగూలీ కుటుంబానికి తృటిలో పెను ప్రమాదం తప్పింది. దాదా సోదరుడు స్నేహ్‌శీష్, అతడి సతీమణి అర్పిత ప్రయాణిస్తున్న బోటు ఒక్కసారిగా తిరగబడింది. ఈ ఘటన ఒడిశాలోని పూరి తీరంలో చోటుచేసుకుంది. దీంతో వెంటనే రంగంలోకి దిగిన లైఫ్ గార్డ్స్ వాళ్లను కాపాడారు. పూరీ బీచ్‌లో స్పోర్ట్స్ యాక్టివిటీ చేస్తుండగా ఈ ఘటన జరిగిందని తెలుస్తోంది. బోటులో సరిపడా ప్రయాణికులు లేకపోవడంతోనే ఈ ప్రమాదం జరిగిందని అర్పిత అంటున్నారు. సముద్రంలో అలల తీవ్రత ఎక్కువగా ఉందన్నారు. మామూలుగా స్పీడ్‌బోటులో 10 మంది ప్యాసింజర్లను తీసుకెళ్లాలని.. కానీ డబ్బులకు ఆశపడి ముగ్గురు, నలుగురినే ఎక్కించుకుంటున్నారని గంగూలీ వదిన మండిపడ్డారు.


ఆటలు ఆపేయాలి..

సరిపడా ప్రయాణికులు లేరని.. బోటు తేలికగా ఉండటంతో భారీ అలకు వెంటనే తిరగబడిందన్నారు అర్పిత. ఒకవేళ లైఫ్ గార్డ్స్ గానీ లేకపోయి ఉంటే తాము ఈ రోజు ప్రాణాలతోనే ఉండేవాళ్లం కాదని వాపోయారు. బోట్లను నిర్వహించే వారి మీద కఠిన చర్యలు తీసుకోవాలని సంబంధిత అధికారులను ఆమె కోరారు. ఈ బీచ్‌లో వాటర్ స్పోర్ట్స్ ఆడటం ప్రమాదకరమని చెప్పుకొచ్చారు. కోల్‌కతా చేరుకున్నాక ఈ విషయంపై ఉన్నతాధికారులతో పాటు ముఖ్యమంత్రికి లేఖ రాస్తానని తెలిపారు. ఇక్కడ వాటర్ స్పోర్ట్స్ ఆపేయాలని ఆమె సూచించారు. కాగా, గంగూలీ సోదరుడి కుటుంబాన్ని లైఫ్ గార్డ్స్ రక్షించడం, వాళ్లను సముద్రం నుంచి ఒడ్డుకు తీసుకొస్తున్న వీడియోలు, ఫొటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. లైఫ్ గార్డ్స్ పనితీరుపై అంతా ప్రశంసల జల్లులు కురిపిస్తున్నారు. కొద్దిలో సేఫ్ అయ్యారని.. వాళ్ల రాక ఆలస్యమైతే ఘోరం జరిగేదని ఆందోళన చెందుతున్నారు. ఇదే సమయంలో డబ్బులకు ఆశపడి బోటు నిర్వాహకులు చేసిన నిర్వాకంపై నెటిజన్స్ మండిపడుతున్నారు.


ఇవీ చదవండి:

రహానె సంచలన వ్యాఖ్యలు

చరిత్ర సృష్టించిన ఆర్సీబీ

మరిన్ని క్రీడా, తెలుగు వార్తల కోసం క్లిక్ చేయండి

Updated Date - May 26 , 2025 | 05:35 PM