Share News

Sanju Samson: సీఎస్‌కేలోకి సంజూ శాంసన్.. తెర వెనుక బిగ్ స్కెచ్!

ABN , Publish Date - Jul 02 , 2025 | 02:32 PM

సంజూ శాంసన్.. సీఎస్‌కే జట్టు ఇప్పుడు ఇతడి పేరే జపిస్తోందని తెలుస్తోంది. శాంసన్ రాక కోసం ఎల్లో ఆర్మీ వేయి కళ్లతో ఎదురు చూస్తున్నట్లు సమాచారం.

Sanju Samson: సీఎస్‌కేలోకి సంజూ శాంసన్.. తెర వెనుక బిగ్ స్కెచ్!
Sanju Samson

ఐపీఎల్‌లో ఫ్రాంచైజీలు తమ జట్లను ప్రక్షాళన చేయడం సహజమే. ముంబై ఇండియన్స్, చెన్నై సూపర్ కింగ్స్ లాంటి బడా సక్సెస్‌ఫుల్ టీమ్స్ తప్పితే.. మిగతా అన్ని జట్లలోనూ ఇది చూస్తూనే ఉంటాం. సీజన్‌లో ఆటగాళ్లు ఆడిన తీరు, లీడర్‌షిప్, ఫ్యూచర్ ప్లాన్స్‌ను బట్టి ఈ విషయంలో ఫ్రాంచైజీలు ముందుకెళ్తుంటాయి. రాజస్థాన్ రాయల్స్ కూడా ఇదే తోవలో అడుగులు వేస్తున్నట్లు తెలుస్తోంది. కనీసం ఆరుగురు ఆటగాళ్లను వదులుకోవడానికి ఆ జట్టు సిద్ధమవుతున్నట్లు సమాచారం. ఇందులో భాగంగానే కెప్టెన్, వికెట్ కీపర్ సంజూ శాంసన్‌‌కు గుడ్‌బై చెప్పాలని నిర్ణయించుకున్నట్లు వినిపిస్తోంది.


దక్కించుకోవాల్సిందే..

రాజస్థాన్‌ను వదిలి సంజూ శాంసన్‌ అందుబాటులోకి వస్తాడేమోనని రెండు ఫ్రాంచైజీలు ఎదురు చూస్తున్నాయని తెలుస్తోంది. ఈ వికెట్ కీపర్ బ్యాటర్ తమ టీమ్‌లోకి వస్తే ఎదురుండదని భావిస్తున్నాయట. అందులో ఒకటి కోల్‌కతా నైట్ రైడర్స్ అయితే.. మరొకటి చెన్నై సూపర్ కింగ్స్ అని సమాచారం. కేకేఆర్ కంటే కూడా సీఎస్‌కే సంజూ రాక కోసం తీవ్రంగా ఎదురు చూస్తున్నట్లు తెలుస్తోంది. వచ్చే ఐపీఎల్‌తో ఎంఎస్ ధోని 45వ పడిలోకి అడుగుపెడతాడు. కాబట్టి కీపర్ బ్యాటర్ అయిన ధోనీకి ప్రత్యామ్నాయంగా శాంసన్‌ను తీసుకోవాలని సీఎస్‌కే సమాలోచనలు చేస్తున్నట్లు సమాచారం. అందుకోసం తెర వెనుక బిగ్ స్కెచ్ వేసినట్లు వినిపిస్తోంది. ఎంత ధరకైనా సరే అతడ్ని దక్కించుకోవాలని ఫిక్స్ అయ్యిందట ఎల్లో ఆర్మీ.


తీసుకోవడం పక్కా..

‘సంజూ శాంసన్ కోసం మేం ఎదురు చూస్తున్నాం. అతడు భారత బ్యాటర్. కీపింగ్‌తో పాటు ఓపెనింగ్ కూడా చేస్తాడు. కాబట్టి అతడు అందుబాటులో ఉంటే దక్కించుకునేందుకు ప్రయత్నిస్తాం. అయితే ఎవర్ని ట్రేడ్ చేసి సంజూను తీసుకోవాలనేది ఇంకా ఖరారు కాలేదు. ఎందుకంటే వచ్చే సీజన్‌కు ఇంకా చాలా సమయం ఉంది. సంజూ విషయంలో ఎంతో ఆసక్తితో ఉన్నామని మాత్రం చెప్పగలను’ అని ఓ ప్రముఖ మీడియా సంస్థతో సీఎస్‌కే ఫ్రాంచైజీ అధికారి చెప్పాడు. ఇది చూసిన నెటిజన్స్.. సంజూను చెన్నైలోకి తీసుకొచ్చేందుకు గట్టిగానే ప్రయత్నాలు జరుగుతున్నాయని అంటున్నారు.


ఇవీ చదవండి:

టీమ్ కంటే బుమ్రా గొప్పా?

బ్యాటింగ్ చేతకాదు: అశ్విన్

స్టోక్స్ మాటలు వింటే గూస్‌బంప్స్!

మరిన్ని క్రీడా వార్తల కోసం క్లిక్ చేయండి

Updated Date - Jul 02 , 2025 | 02:38 PM