Share News

Sachin Tendulkar: సచిన్ సిక్సుల వర్షం.. కురాళ్లు కుళ్లుకునే ఇన్నింగ్స్ ఇది

ABN , Publish Date - Mar 06 , 2025 | 10:04 AM

IML T20 2025: టీమిండియా దిగ్గజం సచిన్ టెండూల్కర్ అస్సలు తగ్గేదేలే అంటూ దూసుకెళ్తున్నాడు. 52 ఏళ్ల వయసులోనూ అతడు దుమ్మురేపుతున్నాడు. భీకరమైన హిట్టింగ్‌తో ప్రత్యర్థులను ఊచకోత కోస్తున్నాడు.

Sachin Tendulkar: సచిన్ సిక్సుల వర్షం.. కురాళ్లు కుళ్లుకునే ఇన్నింగ్స్ ఇది
IML T20

ప్రస్తుత కాలంలో రిటైర్మెంట్ ప్రకటించిన తర్వాత కూడా క్రికెటర్లు ఏదో ఒక లీగ్‌లో ఆడుతూ అభిమానులను అలరిస్తున్నారు. అయితే నలభై ఏళ్లు దాటాక లీగ్స్‌లో ఆడటం కూడా కష్టమే. మహేంద్ర సింగ్ ధోని లాంటి కొందరు అరుదైన ప్లేయర్లు ఐపీఎల్ లాంటి టోర్నమెంట్స్‌లో ఆడుతూ ఫ్యాన్స్‌లో జోష్ నింపుతున్నారు. కానీ ఒక లెజెండ్ మాత్రం 52 ఏళ్ల వయసులోనూ పాతికేళ్ల కుర్రాడిలా దుమ్మురేపుతున్నాడు. బౌలర్లను ఊచకోత కోస్తూ సిక్సులు, బౌండరీల వర్షం కురిపిస్తున్నాడు. ఆరో గేర్ వేసి తగ్గేదేలే అంటూ పరుగులు తీస్తున్న ఆ దిగ్గజం మరెవరో కాదు.. బ్యాటింగ్ గ్రేట్ సచిన్ టెండూల్కర్.


భారీ షాట్లే లక్ష్యంగా..

ఇంటర్నేషనల్ మాస్టర్స్ లీగ్ టీ20-2025లో దుమ్మురేపుతున్నాడు సచిన్. రిటైరైన క్రికెటర్లతో నిర్వహిస్తున్న ఈ టోర్నమెంట్‌లో మాస్టర్ బ్లాస్టర్ వరుసగా స్టన్నింగ్ నాక్స్ ఆడుతూ భారత్ విజయాల్లో కీలకపాత్ర పోషిస్తున్నాడు. బుధవారం ఆస్ట్రేలియా మాస్టర్స్‌తో జరిగిన మ్యాచ్‌లో ధనాధన్ హాఫ్ సెంచరీతో ఆకట్టుకున్నాడు సచిన్. 33 బంతుల్లో 7 ఫోర్లు, 4 సిక్సుల సాయంతో 64 పరుగులు చేశాడు. 193 స్ట్రైక్ రేట్‌తో బ్యాటింగ్ చేసిన సచిన్.. ఫోర్లు, సిక్సులు కొట్టడమే ధ్యేయంగా ఆడాడు. అయితే అతడు రాణించినా మిగతా బ్యాటర్లంతా చేతులెత్తేశారు. దీంతో కంగారూలు సంధించిన 269 పరుగుల భారీ ఛేదనలో భారత్ వెనుకబడింది. 174 పరుగులకే పరిమితమై.. ఓటమిని మూటగట్టుకుంది. కాగా, అంతకుముందు ఆసీస్ ఇన్నింగ్స్‌లో షేన్ వాట్సన్ (110 నాటౌట్), బెన్ డంక్ (132) సెంచరీలతో హల్‌చల్ చేశారు.


ఇవీ చదవండి:

19 ఏళ్ల కెరీర్‌కు స్టార్ క్రికెటర్ గుడ్‌బై

వన్డేలకు స్మిత్‌ వీడ్కోలు

శరత్‌.. టీటీకి గుడ్‌బై

మరిన్ని క్రీడా, తెలుగు వార్తల కోసం క్లిక్ చేయండి

Updated Date - Mar 06 , 2025 | 12:14 PM