RR vs GT Playing 11: జీటీని భయపెడుతున్న రాజస్థాన్.. ప్లేయింగ్ 11తో షాకే..
ABN , Publish Date - Apr 28 , 2025 | 05:19 PM
Today IPL Match: ఐపీఎల్‌లో ఇక ప్రతి మ్యాచ్ రవసత్తరంగా జరగనుంది. దీనికి కారణం ప్లేఆఫ్స్‌కు సమయం దగ్గర పడటమే. ప్లేఆఫ్స్ బెర్తుల లెక్కలు ప్రతి ఫైట్‌తో మారిపోనున్నాయి. ఇవాళ జరగనున్న రాజస్థాన్ రాయల్స్-గుజరాత్ టైటాన్స్ మ్యాచ్‌కూ చాలా ఇంపార్టెన్స్ ఉంది. అదేంటో ఇప్పుడు చూద్దాం..

ఐపీఎల్-2025 క్రమంగా తుదిదశకు చేరుకుంటోంది. ఇకపై జరిగే ప్రతి మ్యాచ్ క్యాలిక్యులేటెడ్ అనే చెప్పాలి. ప్లేఆఫ్స్ బెర్తుల లెక్కలు మార్చేసే అవకాశం ఉండటంతో ప్రతి పోరాటానికి ఎంతో ప్రాధాన్యత ఏర్పడింది. ఈ నేపథ్యంలో ఇవాళ గుజరాత్ టైటాన్స్‌ను ఢీకొట్టనుంది రాజస్థాన్ రాయల్స్. ఇప్పటికే 12 పాయింట్లతో ప్లేఆఫ్స్ బెర్త్‌ను కన్ఫర్మ్ చేసుకునే దిశగా భారీ అడుగులు వేస్తోంది గుజరాత్. అటు ప్లేఆఫ్స్ రేసు నుంచి తప్పుకున్న రాజస్థాన్ జీటీకి షాకులు ఇవ్వాలని చూస్తోంది. పోయేదేం లేదు కాబట్టి లాస్ట్ టైమ్ తమను ఓడించిన గిల్ సేనను ఓ పట్టు పట్టాలని చూస్తోంది. అందుకే ప్లేయింగ్ ఎలెవన్ నుంచే పకడ్బందీ ప్లానింగ్ చేస్తోంది.
బిగ్ చాలెంజ్
ప్లేఆఫ్స్ రేసు నుంచి తప్పుకున్న ఏ టీమ్ అయినా కొత్తగా కోల్పోవడానికి ఏమీ ఉండదు. అందుకే అవి పరువు కోసం చెలరేగి ఆడతాయి. ఇలాంటి సమయాల్లో రాజస్థాన్ రాయల్స్ చాలా డేంజర్. గతంలో ప్లేఆఫ్స్ నుంచి తప్పుకున్న పలు సందర్భాల్లో తోపు టీమ్స్‌ను కూడా రాయల్స్ మట్టికరిపించింది. దీంతో ఆ జట్టును చూస్తే జీటీకి చెమటలు పడుతున్నాయి. ఎలాగూ ప్లేఆఫ్స్‌కు క్వాలిఫై అవుతుంది.. అయితే టాప్-2లో ప్లేస్ కోసం విజయాలు కంటిన్యూ చేయాలి. అందుకే రాజస్థాన్ మీదా నెగ్గాలని గిల్ సేన భావిస్తోంది. అయితే అపోజిషన్ టీమ్ మాత్రం జీటీ పైకి గట్టి ప్లేయర్లను బరిలోకి దించుతోంది. జైస్వాల్, వైభవ్, నితీష్ రాణా, పరాగ్, జురెల్, హెట్‌మెయిర్ లాంటి విధ్వంసకారుల్ని పక్కా ప్లానింగ్‌తో ఆడిస్తోంది. దంచుడే దంచుడు సూత్రంతో ముందుకెళ్లాలని ధైర్యం నూరిపోస్తోంది. ఆర్చర్, హసరంగ, తీక్షణ, సందీప్ లాంటి క్వాలిటీ బౌలింగ్ అటాక్‌ను ఫేస్ చేయడం కూడా జీటీకి సవాలే. దీన్ని గిల్ సేన ఎలా ఎదుర్కొంటుందో చూడాలి.
రాజస్థాన్ రాయల్స్ (అంచనా): యశస్వి జైస్వాల్, వైభవ్ సూర్యవంశీ, నితీష్ రాణా, రియాన్ పరాగ్, ధ్రువ్ జురెల్, షిమ్రన్ హెట్మెయిర్, జోఫ్రా ఆర్చర్, వనిందు హసరంగ, మహీష తీక్షణ, శుభం దూబె, సందీప్ శర్మ.
ఇంపాక్ట్ సబ్‌స్టిట్యూట్: తుషార్ దేశ్‌పాండే.
గుజరాత్ టైటాన్స్ (అంచనా): శుభ్‌మన్ గిల్, సాయి సుదర్శన్, జోస్ బట్లర్, షెర్ఫేన్ రూథర్‌ఫోర్డ్, షారుఖ్ ఖాన్, రాహుల్ తెవాటియా, వాషింగ్టన్ సుందర్, రషీద్ ఖాన్, ఆర్ సాయి కిషోర్, మహ్మద్ సిరాజ్, ప్రసిద్ధ్ కృష్ణ.
ఇంపాక్ట్ సబ్‌స్టిట్యూట్: ఇషాంత్ శర్మ.
ఇవీ చదవండి:
మరిన్ని క్రీడా, తెలుగు వార్తల కోసం క్లిక్ చేయండి