RCB IPL 2025: ఆర్సీబీకీ అదిరిపోయే న్యూస్.. బ్యాటింగ్ రాక్షసుడు వచ్చేస్తున్నాడు
ABN , Publish Date - May 15 , 2025 | 08:45 AM
Indian Premier League: ఐపీఎల్-2025 రీస్టార్ట్‌కు ముందు ఆర్సీబీకి అదిరిపోయే న్యూస్. ఓవర్సీస్ ప్లేయర్లు వస్తారా.. లేదా.. అని సందేహిస్తున్న టీమ్‌కు అదిరిపోయే వార్త. బ్యాటింగ్ రాక్షసుడు వచ్చేస్తున్నాడు. అతడు ఎవరో ఇప్పుడు చూద్దాం..

భారత్-పాకిస్థాన్ మధ్య ఉద్రిక్తతల వల్ల అర్ధాంతరంగా ఆగిపోయిన ఐపీఎల్-2025 మళ్లీ ప్రారంభం కానుంది. మే 17వ తేదీ నుంచి క్యాష్ రిచ్ లీగ్‌లోని మిగిలిన మ్యాచులు మొదలవుతాయి. అయితే ఇండో-పాక్ ఉద్రిక్తతల వల్ల ఇళ్లకు వెళ్లిపోయిన ఓవర్సీస్ ప్లేయర్లు తిరిగి భారత్‌కు వస్తారా.. అనేది అనుమానంగా మారింది. బీసీసీఐతో పాటు ఫ్రాంచైజీలు తీవ్రంగా ప్రయత్నిస్తున్నా బిజీ షెడ్యూల్స్ వల్ల కొందరు ఆటగాళ్లు రాలేని పరిస్థితి. దీంతో టాప్-4లో ఉన్న జట్లు ప్లేఆఫ్స్ విషయంలో తమ విజయావకాశాలు దెబ్బతింటాయేమోనని భయపడుతున్నాయి. ఈ తరుణంలో పాయింట్స్ టేబుల్‌లో రెండో స్థానంలో ఉన్న ఆర్సీబీకి సూపర్ న్యూస్. ఆ టీమ్‌లోని ఓ బ్యాటింగ్ రాక్షసుడు ఇండియాకు వస్తున్నాడు. అతడు ఎవరనేది ఇప్పుడు చూద్దాం..
ఎయిర్‌పోర్ట్‌లో..
బెంగళూరు అభిమానులు ఊపిరి పీల్చుకోవాలి. ఆ జట్టు స్టార్ ఆల్‌రౌండర్ రొమారియో షెఫర్డ్ భారత్‌కు వచ్చేస్తున్నాడు. ప్రయాణం మొదలుపెట్టిన ఈ కరీబియన్ విధ్వంసకారుడు.. ఎయిర్‌పోర్ట్‌లో దిగిన ఓ ఫొటోను సోషల్ మీడియాలో షేర్ చేశాడు. ఇది చూసిన నెటిజన్స్.. బెంగళూరుకు ఇక తిరుగులేదని అంటున్నారు. ఫోర్లు, సిక్సులతో ప్రత్యర్థుల నుంచి చూస్తుండగానే మ్యాచ్‌ను లాగేసుకునే రొమారియో రాకతో బ్యాటింగ్ యూనిట్ సాలిడ్‌గా మారుతుందని చెబుతున్నారు. షెఫర్డ్ వచ్చేశాడు.. డౌట్‌గా ఉన్న జోష్ హేజల్‌వుడ్ కూడా వచ్చేస్తే ఆర్సీబీ మరింత పవర్‌ఫుల్ స్క్వాడ్‌గా మారుతుందని కామెంట్స్ చేస్తున్నారు. కాగా, ఈ సీజన్‌లో చెలరేగి ఆడుతున్న రొమారియో.. సీఎస్‌కేతో జరిగిన మ్యాచ్‌లో 14 బంతుల్లోనే 53 పరుగులు చేశాడు. ఇందులో 4 ఫోర్లతో పాటు ఏకంగా 6 సిక్సులు ఉన్నాయి. అలాంటి విధ్వంసకారుడు వస్తున్నాడంటే ఆర్సీబీకి అంతకంటే గుడ్ న్యూస్ ఏం ఉంటుంది.
ఇవీ చదవండి:
నీరజ్ ఇక లెఫ్టినెంట్ కల్నల్
మరిన్ని క్రీడా, తెలుగు వార్తల కోసం క్లిక్ చేయండి