Rohit Sharma: ఆ సీక్రెట్ చెప్పను.. నా భార్య చూస్తోంది: రోహిత్
ABN , Publish Date - Feb 02 , 2025 | 11:41 AM
Rohit Sharma-Smriti Mandhana: టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మకు మర్చిపోయే అలవాటు ఉంది. మతిమరుపు వల్ల అతడు చాలా సార్లు ఇబ్బందులు పడ్డాడు. పర్సు దగ్గర నుంచి పాస్‌పోర్ట్ వరకు అతడు చాలా విషయాల్లో మతిమరుపుతో సమస్యలు ఎదుర్కొన్నాడు.

ఒక్కొక్కరికి ఒక్కో అలవాటు ఉంటుంది. అందులో కొన్ని మంచి కోసం ఉపయోగపడితే, మరికొన్ని లేనిపోని చిక్కుల్లో పడేస్తాయి. టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మకు ఇలాంటి ఓ బ్యాడ్ హాబీ ఉంది. అదే మతిమరుపు. కెరీర్ స్టార్టింగ్ నుంచి దీంతో అతడు చాలా సమస్యలు ఎదుర్కొంటున్నాడు. పర్సు దగ్గర నుంచి పాస్‌పోర్ట్ వరకు, టాస్ దగ్గర నుంచి ప్లేయింగ్ ఎలెవన్ వరకు చాలా విషయాల్లో అతడు మతిమరుపుతో ఇబ్బంది పడిన సందర్భాలు ఉన్నాయి. తాజాగా దీని గురించి అతడు ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేశాడు. మతిమరుపు విషయంలో ఓ సీక్రెట్ ఉందని.. అది తన ఒక్కడికే తెలుసునని అన్నాడు.
అది హాబీ కాదు!
బీసీసీఐ ఏటా ప్రకటించే నమన్ అవార్డుల వేడుక శనివారం నాడు ఘనంగా జరిగింది. ఈ కార్యక్రమానికి విచ్చేసిన రోహిత్‌ను మహిళా స్టార్ క్రికెటర్ స్మృతి మంధాన ఆసక్తికర ప్రశ్న అడిగింది. ఈ మధ్య కాలంలో మీరు అలవర్చుకున్న కొత్త అలవాటు ఏంటి? అని స్మృతి క్వశ్చన్ చేసింది. భారత జట్టు ఆటగాళ్లంతా మతిమరుపు విషయంలో తనను ఏడిపిస్తుంటారని హిట్‌మ్యాన్ అన్నాడు. అయితే ఇది తన హాబీ కాదన్నాడు.
రివీల్ చేయను!
‘మతిమరుపు విషయంలో అంతా నన్ను టీజ్ చేస్తుంటారు. అయితే ఇది నా అలవాటు కాదు. నేను వ్యాలెట్, పాస్‌పోర్ట్ మర్చిపోయానని ఏడిపిస్తుంటారు. కానీ ఇది నిజం కాదు. అది జరిగి చాలా ఏళ్లు అవుతోంది’ అని రోహిత్ చెప్పుకొచ్చాడు. మరి.. మీ లైఫ్‌లో మీరు మర్చిపోయిన అతి పెద్ద విషయం ఏంటి? అని స్మృతి అడగ్గా.. చెప్పను అంటూ తప్పించుకున్నాడు రోహిత్. ‘ఆ విషయం నేను చెప్పలేను. ఒకవేళ ఇది లైవ్ టెలికాస్ట్ అవుతుంటే గనుక నా వైఫ్ చూస్తుంది. కాబట్టి నేను మర్చిపోయినది ఏంటో రివీల్ చేయలేను’ అని చెబుతూ హిట్‌మ్యాన్ నవ్వుల్లో మునిగిపోయాడు. అది తనకు మాత్రమే తెలుసునని అన్నాడు. దీంతో హిట్‌మ్యాన్ మర్చిపోయింది వస్తువా? లేదా ఇంకేదైనా విషయమై ఉంటుందా? అంటూ ఆలోచనల్లో మునిగిపోయారు అభిమానులు.
ఇవీ చదవండి:
కోహ్లీ మళ్లీ బ్యాటింగ్‌కు రాకుండానే..!
మరిన్ని క్రీడా, తెలుగు వార్తల కోసం క్లిక్ చేయండి