Share News

Rishabh Pant: పంత్ ఈజ్ బ్యాక్.. ఆర్సీబీని కుమ్మేశాడు!

ABN , Publish Date - May 27 , 2025 | 08:55 PM

పించ్ హిట్టర్ రిషబ్ పంత్ తన రేంజ్ ఏంటో చూపిస్తున్నాడు. ఐపీఎల్-2025 సీజన్ మొత్తం విఫలమవుతూ వచ్చిన ఈ లక్నో సారథి.. ఆఖరాటలో ఆర్సీబీపై చెలరేగి బ్యాటింగ్ చేస్తున్నాడు.

Rishabh Pant: పంత్ ఈజ్ బ్యాక్.. ఆర్సీబీని కుమ్మేశాడు!
Rishabh Pant

ఐపీఎల్-2025కు ముందు జరిగిన మెగా ఆక్షన్‌లో ఏకంగా రూ.27 కోట్లకు అమ్ముడుపోయిన ఆటగాడతను. కోట్లు పోసి కొనుక్కోవడమే గాక అతడికి కెప్టెన్సీ కూడా ఇచ్చి ప్రోత్సహించింది ఫ్రాంచైజీ. అయినా ఏం లాభం.. 12 ఇన్నింగ్స్‌ల్లో కలిపి అతడు చేసింది 135 పరుగులే. దీంతో ఆటకు, ప్రైజ్ రేట్‌కు సంబంధం లేదంటూ అతడిపై విమర్శకులు విరుచుకుపడ్డారు. టీమ్ ఓటమికి అతడే ప్రధాన కారణం అంటూ ఏకిపారేశారు. ఆ ప్లేయర్ మరెవరో కాదు.. రిషబ్ పంత్. ఈ సీజన్‌లో చెత్త బ్యాటింగ్‌తో పరువు తీసుకున్నాడీ డాషింగ్ బ్యాటర్. అయితే ఎలాగైనా పరుగులు చేయాల్సిందేనని డిసైడ్ అయిన లక్నో సారథి.. ఆర్సీబీతో జరుగుతున్న ఆఖరాటలో చెలరేగి బ్యాటింగ్ చేస్తున్నాడు. ధనాధన్ బ్యాటింగ్‌తో ప్రత్యర్థి బౌలర్లకు పోయిస్తున్నాడు. 29 బంతుల్లోనే హాఫ్ సెంచరీ మార్క్‌ను అందుకున్నాడు పంత్.


తగ్గేదేలే..

ఓపెనర్ మాథ్యూ బ్రీక్ (14) ఔట్ అవ్వడంతో క్రీజులోకి వచ్చిన పంత్.. ఆరంభం నుంచే బాదుడు మొదలుపెట్టాడు. బౌండరీల మీద బౌండరీలు కొట్టాడు. అలాగని సిక్సుల్లోనూ తగ్గలేదు. ప్రస్తుతం 47 బంతుల్లో 89 పరుగులతో నాటౌట్‌గా ఉన్నాడీ పించ్ హిట్టర్. ఇందులో 8 ఫోర్లతో పాటు 6 భారీ సిక్సులు ఉన్నాయి. పంత్ బాదుడు చూసిన నెటిజన్స్.. ఇది సామి నీ దగ్గర నుంచి కావాల్సింది అని అంటున్నారు. పంత్ రేంజ్ ఏంటో చెప్పేందుకు ఈ ఇన్నింగ్స్ చాలని కామెంట్స్ చేస్తున్నారు. మరిన్ని భారీ షాట్లు బాదాలి, విశ్వరూపం చూపించాలి అని కోరుతున్నారు ఫ్యాన్స్. కాగా, 16.2 ఓవర్లలో 2 వికెట్ల నష్టానికి 181 పరుగులతో ఉంది లక్నో సూపర్ జెయింట్స్. పంత్‌తో పాటు నికోలస్ పూరన్ (2 నాటౌట్) క్రీజులో ఉన్నాడు. వీళ్లిద్దరూ జోరును కొనసాగిస్తే ఎల్‌ఎస్‌జీ అలవోకగా 230 పరుగుల మార్క్‌ను అందుకోవచ్చు.


ఇవీ చదవండి:

టికెట్ల వ్యవహారం.. సంచలన నివేదిక!

బంతికి 60 లక్షలు.. హీరోను జీరో చేశారు

మరిన్ని క్రీడా, తెలుగు వార్తల కోసం క్లిక్ చేయండి

Updated Date - May 27 , 2025 | 09:09 PM