Share News

Rishabh Pant IPL 2025: లక్నోను ఓడిస్తున్న పంత్.. ఏంటి ఇంత మాట అనేశాడు

ABN , Publish Date - Apr 28 , 2025 | 02:07 PM

Indian Premier League: ఐపీఎల్-2025 ఆరంభంలో వరుస విక్టరీలతో దుమ్మురేపిన లక్నో సూపర్ జెయింట్స్ ప్లేఆఫ్స్‌కు ముందు డీలాపడింది. బ్యాక్ టు బ్యాక్ లాసెస్ ఆ టీమ్‌ను తెగ ఇబ్బంది పెడుతున్నాయి. దీనికి కెప్టెన్ రిషబ్ పంత్ బ్యాడ్ ఫామ్ ఓ రీజన్ అనే చెప్పాలి.

Rishabh Pant IPL 2025: లక్నోను ఓడిస్తున్న పంత్.. ఏంటి ఇంత మాట అనేశాడు
Rishabh Pant

3, 0, 9.. గత మూడు ఇన్నింగ్స్‌ల్లో లక్నో సూపర్ జెయింట్స్ కెప్టెన్ రిషబ్ పంత్ బ్యాట్ నుంచి వచ్చిన స్కోర్లు ఇవి. ఈ ఐపీఎల్‌లో ఇప్పటిదాకా అతడు చేసింది 110 పరుగులే. దీంతో లక్నో వరుస ఓటములకు కారణమంటూ అతడిపై తీవ్ర విమర్శలు వస్తున్నాయి. మామూలుగా క్రికెట్‌లో నెగ్గాలంటే టీమ్ నిండా స్టార్లే ఉండాల్సిన అవసరం లేదు. అందుబాటులో ఉన్న వనరుల్ని చక్కగా వినియోగించుకున్నా చాలు. ఇదే సూత్రాన్ని పాటిస్తూ అదిరిపోయే ఆటతీరుతో ఐపీఎల్ తాజా ఎడిషన్ ఆరంభంలో వరుస విక్టరీలతో అదరగొట్టింది లక్నో. అయితే ఫస్టాఫ్ ఎండింగ్‌లో బ్యాక్ టు బ్యాక్ లాసెస్‌తో ప్లేఆఫ్స్ ఆశల్ని సంక్లిష్టం చేసుకుంటోంది. దీనికి పంత్ బ్యాటింగ్ ఫెయిల్యూర్ బలమైన కారణమనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. దీనిపై టీమ్ మెంటార్ జహీర్ ఖాన్ స్ట్రాంగ్‌గా రియాక్ట్ అయ్యాడు. అతడు ఏమన్నాడంటే..


రియల్ లీడర్

లక్నో ఓటములకు పంత్ కారణమనడం సరికాదన్నాడు జహీర్ ఖాన్. ఒక లీడర్‌గా అతడు ప్రతి విభాగంలోనూ తనదైన మార్క్ చూపించాడని మెచ్చుకున్నాడు. అతడో నిఖార్సయిన నాయకుడని ప్రశంసించాడు. ఆటగాళ్లందరితో సన్నిహితంగా ఉంటూ వాళ్ల రియల్ గేమ్ ఆడేలా ఫ్రీడమ్ ఇచ్చాడని తెలిపాడు. ప్లాన్స్‌కు అనుగుణంగా టీమ్‌ను నడిపిస్తున్నాడని పొగడ్తల్లో ముంచెత్తాడు జహీర్. అయితే బ్యాటింగ్‌లో పంత్ అనుకున్నంతగా రాణించలేకపోవడం నిజమేనని.. కానీ అతడు త్వరలో ఫామ్‌ను అందుకుంటాడని జహీర్ ఆశాభావం వ్యక్తం చేశాడు.


ఒక్క ఇన్నింగ్స్ చాలు..

పంత్ ఫామ్‌ను అందుకోవడానికి ఒక్క ఇన్నింగ్స్ చాలని.. ఆ మూమెంట్స్ కోసం తామంతా ఎదురు చూస్తున్నామని జహీర్ పేర్కొన్నాడు. ప్రైస్ ట్యాగ్ ప్రెజర్ వల్లే రిషబ్ రాణించలేకపోతున్నాడనేది వాస్తవం కాదన్నాడు లక్నో మెంటార్. టీమ్ ఎలా పెర్ఫార్మ్ చేస్తుంది, టోర్నమెంట్‌లో విన్నర్స్‌గా నిలిచామా.. లేదా.. లాంటి విషయాల మీదే తాము ఫోకస్ చేస్తున్నామని స్పష్టం చేశాడు జహీర్. పంత్ త్వరలో ఫామ్ పుంజుకోవడమే గాక టీమ్‌ను తిరిగి సక్సెస్ ట్రాక్ ఎక్కిస్తాడని, ట్రోఫీ అందిస్తాడని తాము నమ్ముతున్నామని వ్యాఖ్యానించాడు. ఇందులో ఎలాంటి అనుమానాలు పెట్టుకోవాల్సిన అవసరం లేదన్నాడు. మొత్తంగా పంత్‌ సరిగ్గా ఆడట్లేదంటూ విమర్శిస్తున్న వారిని జహీర్ ఏకిపారేశాడు.


ఇవీ చదవండి:

పాక్‌ టోర్నీలో ఆడేది లేదు

ఆ విషయాన్ని మర్చిపోతున్నారు:కోహ్లీ

విరాట్-రాహుల్ కోల్డ్ వార్

మరిన్ని క్రీడా, తెలుగు వార్తల కోసం క్లిక్ చేయండి

Updated Date - Apr 28 , 2025 | 02:12 PM