Ishan Kishan: ఇషాన్ కిషన్ మాస్ బ్యాటింగ్.. దడ పుట్టించాడు!
ABN , Publish Date - May 23 , 2025 | 08:59 PM
సన్‌రైజర్స్ స్టార్ బ్యాటర్ ఇషాన్ కిషన్ అదరగొట్టాడు. ఆర్సీబీతో జరుగుతున్న పోరులో తన హిట్టింగ్ పవర్ చూపించాడు. బౌండరీలు, సిక్సులతో స్టేడియాన్ని హోరెత్తించాడు.

ఐపీఎల్-2025లో తరచూ విఫలమవుతూ వస్తున్న స్టార్ బ్యాటర్ ఇషాన్ కిషన్ ఎట్టకేలకు గాడిలో పడ్డాడు. భారీ ఇన్నింగ్స్ ఆడాలనే కసితో ఉన్న లెఫ్టాండ్ బ్యాటర్.. రాయల్ చాలెంజర్స్ బెంగళూరుతో మ్యాచ్‌లో చెలరేగి ఆడుతున్నాడు. మాస్ బ్యాటింగ్‌తో ప్రత్యర్థి బౌలర్లకు నరకం చూపిస్తున్నాడు. 28 బంతుల్లోనే 50 పరుగుల మార్క్‌ను అతడు చేరుకున్నాడు. ఇందులో 5 బౌండరీలతో పాటు 2 భారీ సిక్సులు ఉన్నాయి. అడ్డగోలు షాట్లకు వెళ్లకుండా లెక్క వేసి ఆర్సీబీ బౌలర్లను బాదుతున్నాడు ఇషాన్. గత మ్యాచుల్లో చేసిన పొరపాట్లను రిపీట్ చేయకుండా తన బలాన్ని నమ్ముకొని బ్యాటింగ్ చేస్తున్నాడు. ఇంకా నాటౌట్‌గా ఉన్న ఇషాన్.. ఆఖరి బంతి వరకు క్రీజులో ఉంటే సెంచరీ మార్క్‌ను అందుకున్నా ఆశ్చర్యపోవాల్సిన పని లేదు.
బాదుడే బాదుడు..
ఈ మ్యాచ్‌లో టాస్ ఓడి బ్యాటింగ్‌కు దిగిన సన్‌రైజర్స్ 15 ఓవర్లకు 5 వికెట్ల నష్టానికి 166 పరుగులతో ఉంది. ఇషాన్‌తో పాటు అభినవ్ మనోహర్ క్రీజులో ఉన్నాడు. ఇప్పటికే చాలా బంతులు ఎదుర్కొన్నందున ఇషాన్ ఎక్కువ స్ట్రైక్ తీసుకొనే అవకాశం ఉంది. కాబట్టి అతడికి సెంచరీ చేసే చాన్స్ ఉంది. అయితే మైల్స్టోన్ మీద కాకుండా జట్టుకు భారీ స్కోరు అందించడం మీద గురి పెడితే బాగుటుంది. కాగా, ఓపెనర్ అభిషేక్ శర్మ (17 బంతుల్లో 34), హెన్రిచ్ క్లాసెన్ (13 బంతుల్లో 24), అనికేత్ వర్మ (9 బంతుల్లో 26) రాణించారు. మరో ఓపెనర్ ట్రావిస్ హెడ్ (10 బంతుల్లో 17) కూడా ఉన్నంత సేపు భారీ షాట్లు బాదాడు. అయితే ఇషాన్ ఎంతసేపు క్రీజులో ఉంటాడనే దాని మీదే సన్‌రైజర్స్ బిగ్ టోటల్ ఆశలు ఆధారపడి ఉంటాయి. మరి.. అతడేం చేస్తాడో చూడాలి.
ఇవీ చదవండి:
కుర్ర బ్యాటర్ వరల్డ్ రికార్డ్!
మరిన్ని క్రీడా, తెలుగు వార్తల కోసం క్లిక్ చేయండి