RCB vs PBKS AI Prediction: ఆర్సీబీ వర్సెస్ పంజాబ్.. ఫైనల్లో గెలిచేదెవరు.. ఏఐ జోస్యం ఇదే..!
ABN , Publish Date - Jun 03 , 2025 | 03:23 PM
క్యాష్ రిచ్ ఫైనల్‌కు సమయం ఆసన్నమైంది. మరికొన్ని గంటల్లో బరిలోకి దిగి అమీతుమీ తేల్చుకోనున్నాయి పంజాబ్-ఆర్సీబీ జట్లు. ఎవరు గెలిచినా సరికొత్త చాంపియన్ అవతరించడం ఖాయం.

ఐపీఎల్-2025 ఫైనల్ ఫైట్‌కు ఇంకొన్ని గంటలే మిగిలి ఉంది. తొలి కప్పు కోసం 17 ఏళ్లుగా ఎదురు చూస్తున్న ఆర్సీబీ-పంజాబ్ కింగ్స్ ఇవాళ తాడోపేడో తేల్చుకోనున్నాయి. ఎవరు నెగ్గినా నయా చాంపియన్ ఆవిర్భవించడం ఖాయం. అందుకే ఇరు జట్ల అభిమానులతో పాటు క్రికెట్ లవర్స్ అంతా ఈ పోరు కోసం వేయి కళ్లతో ఎదురు చూస్తున్నారు. లెజెండరీ ప్లేయర్ విరాట్ కోహ్లీ తొలి కప్పు కల నెరవేరుతుందా లేదా శ్రేయస్ అయ్యర్ సారథ్యంలో పంజాబ్ చాంపియన్‌గా అవతరిస్తుందా అనే చర్చలు ఊపందుకున్నాయి. ఈ మ్యాచ్‌పై అభిమానులతో పాటు క్రికెట్ అనలిస్టులు, మాజీ ప్లేయర్లు.. ఇలా అంతా ప్రిడిక్షన్స్ చెబుతున్నారు. ఈ తరుణంలో ఆర్టిఫిషయల్ ఇంటెలిజెన్స్ కూడా తన స్టైల్లో ఫైనల్ ఫైట్‌పై జోస్యం చెప్పింది. ఇంతకీ ఏఐ మొగ్గు ఎటు వైపు ఉందో ఇప్పుడు చూద్దాం..
గ్రాక్ మాట విన్నారా..
‘డేటాను పరిగణనలోకి తీసుకుంటే పంజాబ్ కంటే ఆర్సీబీ ఆధిక్యంలో ఉంది. బౌలింగ్-బ్యాటింగ్ రెండింటా బలంగా ఉంది. కోహ్లీ-సాల్ట్ ఫామ్ టీమ్‌కు సానుకూలాంశం. లివింగ్‌స్టోన్, జితేష్ శర్మ లాంటి బ్యాటర్లతో బ్యాటింగ్ విభాగం దుర్భేద్యంగా ఉంది. అటు పంజాబ్‌లో చాహల్, జెమీసన్ బాగా బౌలింగ్ చేస్తున్నారు. అయినా గత మ్యాచ్‌లో ఆర్సీబీ చేతుల్లో ఓడినందున పంజాబ్‌పై ఎక్కువగా ఒత్తిడి ఉంది’ అని ఎక్స్ గ్రాక్ విశ్లేషించింది.
జెమినీ అంచనా ఏంటంటే..
ఆర్సీబీ కంటే పంజాబ్ కాస్త ముందంజలో ఉందని జెమినీ చెప్పింది. అయితే టాస్, వాతావరణ పరిస్థితులు ప్రభావితం చేసే చాన్స్ ఉందని తెలిపింది. ఎవరు నెగ్గుతారో కచ్చితంగా చెప్పలేమని.. కానీ పంజాబ్‌కు ఎక్కువ అవకాశాలు ఉన్నాయని పేర్కొంది జెమినీ.
మెటా ఏం తేల్చిందంటే..
క్రికెట్లో ఎప్పుడు ఏం జరుగుతుందో చెప్పలేమని మెటా తెలిపింది. అందునా టీ20లను అసలే అంచనా వేయలేమని పేర్కొంది. ఇరు జట్లు బలంగా ఉన్నాయని.. ఫైనల్ పోరు రసవత్తరంగా సాగడం ఖాయమని విశ్లేషించింది.
చాట్ జీపీటీ జోస్యం ఫలించేనా..
ఫైనల్ మ్యాచ్‌లో ఆర్సీబీకే ఎక్కువ విజయావకాశాలు ఉన్నాయని చాట్ జీపీటీ జోస్యం చెబుతోంది. అయితే శ్రేయస్ అయ్యర్ ఫామ్, సారథ్య పటిమ.. పంజాబ్ పెర్ఫార్మెన్స్ను బట్టి చూస్తే ఇవాళ్టి పోరులో ఆర్సీబీకి గట్టి పోటీ ఎదురవడం ఖాయమని పేర్కొంది.
ఇవీ చదవండి:
గుకేష్ ఎమోషనల్.. వీడియో చూడాల్సిందే!
బీసీసీఐ బాస్‌గా మాజీ జర్నలిస్ట్
మరిన్ని క్రీడా, తెలుగు వార్తల కోసం క్లిక్ చేయండి