Share News

Virat Kohli vs KL Rahul: కోహ్లీ వర్సెస్ కేఎల్ రాహుల్.. ఇంత కోపం దాచుకున్నాడా..

ABN , Publish Date - Apr 11 , 2025 | 01:52 PM

RCB vs DC: స్టైలిష్ బ్యాటర్ కేఎల్ రాహుల్ ఆకాశమే హద్దుగా చెలరేగుతున్నాడు. బ్యాక్ టు బ్యాక్ స్టన్నింగ్ నాక్స్‌తో ఐపీఎల్‌ను అతడు షేక్ చేస్తున్నాడు. రాహుల్ దెబ్బకు కోహ్లీ టీమ్‌ కూడా బిత్తరపోక తప్పలేదు.

Virat Kohli vs KL Rahul: కోహ్లీ వర్సెస్ కేఎల్ రాహుల్.. ఇంత కోపం దాచుకున్నాడా..
RCB vs DC

విరాట్ కోహ్లీ వర్సెస్ కేఎల్ రాహుల్.. ఇప్పుడు సోషల్ మీడియాలో ఇదే హాట్ టాపిక్. క్రికెట్ ఫ్యాన్స్‌ను టచ్ చేసినా వీళ్ల రైవల్రీ గురించే మాట్లాడుతున్నారు. టీమిండియాకు చాన్నాళ్ల నుంచి కలసి ఆడుతూ వస్తున్న వీళ్ల మధ్య శత్రుత్వం ఏంటనేగా మీ డౌట్. అయితే ఇది ఇంటర్నేషనల్ క్రికెట్‌కు సంబంధించిన రైవల్రీ కాదు.. ఇండియన్ ప్రీమియర్ లీగ్‌కు సంబంధించినది. భారత్‌కు ఆడేటప్పుడు భుజం భుజం కలపి ఆడతారు. కానీ ఐపీఎల్‌లో మాత్రం వీళ్ల మధ్య రైవల్రీ ఉందని చాన్నాళ్లుగా వినిపిస్తోంది. అది గురువారం ఆర్సీబీ-డీసీ మ్యాచ్‌లో కనిపించింది. దీంతో అసలు వీళ్ల మధ్య ఏం జరిగింది.. ఇద్దరు స్నేహితుల మధ్య శత్రుత్వం నిజమేనా అని అందరూ డిస్కస్ చేసుకుంటున్నారు. దీని గురించి ఇప్పుడు చూద్దాం..


ఆ కోపంతోనే..

కోహ్లీ కెరీర్ ఆరంభం నుంచి ఐపీఎల్‌లో ఒకే జట్టుకు ఆడుతున్నాడు. ఆర్సీబీ తప్ప మరో టీమ్‌కు అతడు మారలేదు. బెంగళూరును కెప్టెన్‌గానూ చాన్నాళ్ల పాటు ముందుండి నడిపించాడు. అందుకే అక్కడి చిన్నస్వామి స్టేడియం, ఆర్సీబీ ఫ్యాన్స్, బెంగళూరు సిటీతో అతడికి మంచి అనుబంధం ఏర్పడింది. అయితే రాహుల్‌కు ఆ గ్రౌండ్‌తో అక్కడి ప్రజలతో మరింత అనుబంధం ఉంది. ఎందుకంటే బెంగళూరు అతడి హోమ్ సిటీ. పైగా 2013 నుంచి నుంచి 2017 సీజన్ వరకు ఆర్సీబీకి ఆడాడు కేఎల్. అది కూడా కోహ్లీ కెప్టెన్సీలోనే. అయితే మరుసటి సీజన్‌లో అతడ్ని బెంగళూరు వదిలేసింది. దీంతో అతడు పలు జట్లు మారక తప్పలేదు.


నివురుగప్పిన నిప్పు..

రాహుల్ 2018 నుంచి 2021 వరకు పంజాబ్ కింగ్స్‌కు ఆడాడు. ఆ తర్వాత 2022 నుంచి 2024 దాకా లక్నో తరఫున ఆడాడు. ఈ ఏడాది ఢిల్లీ క్యాపిటల్స్‌కు మారాడు. మెగా ఆక్షన్‌లో అతడ్ని కొనుగోలు చేసే చాన్స్ ఉన్నప్పటికీ ఆర్సీబీ ఇంట్రెస్ట్ చూపించలేదు. మరి.. ఆ కోపం పెట్టుకున్నాడో లేదా అప్పట్లో తనను రిలీజ్ చేశారనే పగా లేదా కోహ్లీ కెప్టెన్‌గా మరింత సపోర్ట్ అందించి ఉంటే ఇంకా బెంగళూరుకే ఆడుతూ ఉండేవాడ్ని అనే ఆలోచనో ఏమో గానీ నిన్నటి మ్యాచ్‌ ముగిసిన తర్వాత కేఎల్ అగ్రెసివ్‌గా సెలెబ్రేట్ చేసుకున్నాడు. బ్యాట్‌ను పిచ్‌పై పెట్టి.. ఇది నా అడ్డా అంటూ ధమ్కీ ఇచ్చాడు. అంతకుముందు వికెట్ పడినప్పుడు కోహ్లీ అతడి ముందే సెలెబ్రేట్ చేసుకోవడం.. మ్యాచ్ పూర్తయిన తర్వాత కేఎల్ సెలెబ్రేషన్‌లో ఉన్నప్పుడు విరాట్ అతడ్ని వెరైటీగా చూడటంతో వీళ్ల మధ్య కనిపించని రైవల్రీ ఉందనే అభిప్రాయాలు వ్యక్తం అవుతున్నాయి. ఇన్నాళ్లూ నివురుగప్పిన నిప్పులా ఉన్న కేఎల్.. సొంతగడ్డపై 53 బంతుల్లో 93 పరుగుల విధ్వంసక ఇన్నింగ్స్ ఆడటం, సీనియర్ ప్లేయర్ కావడం, భారీ క్రేజ్ రావడంతో ఇలా ఆర్సీబీ టీమ్, కోహ్లీ మీద తన కోపాన్ని లేట్‌గా బయటపెట్టాడని నెటిజన్స్ కామెంట్స్ చేస్తున్నారు.


ఇవీ చదవండి:

64 ఏళ్ల వయసులో క్రికెట్ డెబ్యూ

ధోనీకి ‘చెన్నై’ పగ్గాలు

రష్మిక హ్యాట్రిక్‌ విజయం

మరిన్ని క్రీడా, తెలుగు వార్తల కోసం క్లిక్ చేయండి

Updated Date - Apr 11 , 2025 | 01:57 PM