PBKS vs RCB IPL 2025: ఆర్సీబీ బంపర్ విక్టరీ.. ఒకే దెబ్బకు రెండు పిట్టలు అంటే ఇదే
ABN , Publish Date - Apr 20 , 2025 | 06:58 PM
Indian Premier League: ఆర్సీబీ లెక్క సరి చేసింది. పంజాబ్ కింగ్స్‌కు మర్చిపోలేని షాక్ ఇచ్చింది కోహ్లీ టీమ్. 7 వికెట్ల తేడాతో ఓడించి మాతో అంత ఈజీ కాదంటూ ధమ్కీ ఇచ్చింది.

ఐపీఎల్-2025లో ఆర్సీబీ లెక్కలు మారుస్తూ పోతోంది. ఇతర జట్టు తమతో పెట్టుకోవాలంటే ఇతర జట్టు భయపడేలా చేస్తోంది. స్టన్నింగ్ బౌలింగ్, థండర్ బ్యాటింగ్‌తో అపోజిషన్ టీమ్స్‌కు వణుకు పుట్టిస్తోంది. ఇవాళ పంజాబ్ కింగ్స్‌నూ ఓ పట్టు పట్టింది కోహ్లీ టీమ్. 7 వికెట్ల తేడాతో అయ్యర్ సేనను వాళ్ల సొంతగడ్డపై చిత్తుగా ఓడించింది బెంగళూరు. ఆ టీమ్ సంధించిన 157 పరుగుల టార్గెట్‌ను ఇంకో 7 బంతులు ఉండగానే ఉఫ్‌మని ఊదిపారేసింది. కింగ్ కోహ్లీ (54 బంతుల్లో 73 నాటౌట్) చివరి వరకు స్తంభంలా నిలబడిపోయాడు. తన టీమ్‌ను గెలుపు తీరాలకు చేర్చే వరకు అతడు విశ్రమించలేదు.
ఆర్సీబీ పైపైకి..
దేవ్‌దత్ పడిక్కల్ (35 బంతుల్లో 61) మెరుపు ఇన్నింగ్స్‌తో చెలరేగాడు. 5 బౌండరీలు, 4 సిక్సులతో పంజాబ్ బౌలర్లకు హడలెత్తించాడీ లెఫ్టాండ్ బ్యాటర్. కోహ్లీ-పడిక్కల్ జోడీ రెండో వికెట్‌కు ఏకంగా 103 పరుగుల భాగస్వామ్యం జోడించారు. ఇది మ్యాచ్ విన్నింగ్ పార్ట్‌నర్‌షిప్‌గా చెప్పాలి. ఆఖర్లో పడిక్కల్, పాటిదార్ ఔట్ అయినా జితేష్ శర్మ (11 నాటౌట్)తో కలసి గెలుపు లాంఛనాన్ని పూర్తి చేశాడు కోహ్లీ. ఈ విజయంతో ఆర్సీబీ పాయింట్స్ టేబుల్‌ను షేక్ చేసింది. ఏకంగా 3వ స్థానానికి ఎగబాకింది బెంగళూరు. కాగా, హోం గ్రౌండ్‌లో ఓడుతూ వస్తున్న ఆర్సీబీ.. ఇతర గ్రౌండ్స్‌లో మాత్రం విజయాల మోత మోగిస్తోంది. ఇప్పటికే ఈడెన్ గార్డెన్స్, వాంఖడే, చెపాక్, జైపూర్‌లో నెగ్గిన కోహ్లీ టీమ్.. ఇవాళ చండీగఢ్‌లోనూ నెగ్గింది. తద్వారా అవే గేమ్స్‌లో తమకు ఎదురులేదని ప్రత్యర్థులకు డేంజర్ సిగ్నల్స్ పంపించింది.
ఇవీ చదవండి:
ఓడితే ఇంటికే.. ఆప్షన్ లేదు మిత్రమా
ఆప్షన్ లేదు మిత్రమా.. ఓడితే ఇంటికే..
కృనాల్ పాండ్యా స్టన్నింగ్ క్యాచ్
మరిన్ని క్రీడా, తెలుగు వార్తల కోసం క్లిక్ చేయండి