Ravindra Jadeja: ఇంగ్లండ్‌కు జడేజా భయం.. ఇవి మామూలు రికార్డులు కాదు!
ABN , Publish Date - Jun 16 , 2025 | 08:42 PM
టీమిండియా సీనియర్ స్పిన్నర్ రవీంద్ర జడేజాను చూసి ఇంగ్లండ్ వణుకుతోంది. దీనికి అతడి రికార్డులే కారణమని చెప్పాలి. మరి.. జడ్డూ రికార్డులు ఎలా ఉన్నాయో ఇప్పుడు చూద్దాం..

టీమిండియా సీనియర్ స్పిన్నర్ రవీంద్ర జడేజా సరికొత్త సవాల్‌కు సిద్ధమవుతున్నాడు. ఇంగ్లండ్‌తో 5 టెస్టుల సిరీస్‌లో తన తడాఖా చూపించేందుకు రెడీ అవుతున్నాడు. వెటరన్ స్పిన్నర్ రవిచంద్రన్ అశ్విన్ రిటైర్‌మెంట్ ప్రకటించడంతో జడ్డూపై ఇప్పుడు అదనపు బాధ్యత పెరిగింది. రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ లాంటి దిగ్గజాలు తప్పుకోవడంతో జడ్డూ బంతితో మ్యాజిక్ చేయడమే కాదు.. బ్యాట్‌తోనూ విలువైన పరుగులు చేయాల్సిన అవసరం ఏర్పడింది. అందుకే స్టోక్స్ సేనతో పోరుకు అన్ని రకాలుగా సన్నద్ధమవుతున్నాడు. అతడ్ని చూసి ప్రత్యర్థి వణుకుతోంది. దీనికి జడ్డూ రికార్డులే కారణమని చెప్పాలి. ఆ రికార్డులు ఏంటో ఇప్పుడు చూద్దాం..
గింగిరాలు తిప్పుతూ..
ఇంగ్లండ్‌తో మ్యాచ్ అంటే చాలు జడేజా చెలరేగిపోతాడు. ముఖ్యంగా బంతితో అతడు నిప్పులు చెరుగుతాడు. బాల్‌ను గింగిరాలు తిప్పుతూ ఇంగ్లీష్ బ్యాటర్ల వెన్నులో వణుకు పుట్టిస్తుంటాడు. ఆ టీమ్ మీద ఇప్పటివరకు 20 మ్యాచులు ఆడాడు జడేజా. ఇంగ్లండ్ మీద 1031 పరుగులు చేసిన టీమిండియా ఆల్‌రౌండర్.. 70 వికెట్లు పడగొట్టాడు. ఆ జట్టు స్టార్ బ్యాటర్లందర్నీ భయపెట్టాడు జడేజా. అందుకే అతడి బౌలింగ్‌ను ఎదుర్కోవడంపై ప్రత్యేక దృష్టి సారిస్తోంది ఆతిథ్య జట్టు. పిచ్ నుంచి స్పిన్‌కు మద్దతు లేకపోయినా పేస్ వేరియేషన్స్, కట్టుదిట్టమైన లైన్ అండ్ లెంగ్త్‌తో కట్టిపడేసే జడ్డూ.. ఈసారి కూడా రాణిస్తే భారత్‌కు తిరుగుండదనే చెప్పాలి. అతడు బ్యాట్‌తో కూడా అదరగొట్టాలని, ఇంగ్లండ్ బెండు తీయాలని ఫ్యాన్స్ కోరుతున్నారు.
ఇవీ చదవండి:
మరిన్ని క్రీడా వార్తల కోసం క్లిక్ చేయండి