Kohli-Ashwin: క్రికెట్ కంటే తోపా.. కోహ్లీపై అశ్విన్ సెటైర్స్!
ABN , Publish Date - Jun 17 , 2025 | 02:24 PM
టీమిండియా వెటరన్ స్పిన్నర్ రవిచంద్రన్ అశ్విన్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. గేమ్ కంటే ఎవరూ ఎక్కువ కాదన్నాడు. ఇంకా అశ్విన్ ఏం మాట్లాడాడో ఇప్పుడు చూద్దాం..

భారత్-ఇంగ్లండ్ సిరీస్‌కు సమయం దగ్గర పడుతుండటంతో సీనియర్లు విరాట్ కోహ్లీ-రోహిత్ శర్మ గురించి చర్చలు మరింతగా ఊపందుకుంటున్నాయి. వీళ్లిద్దరూ లేని లోటు టీమిండియాపై తీవ్రంగా ప్రభావం చూపుతోందని, కుర్రాళ్లతో నిండిన జట్టు నెట్టుకురావడం కష్టమేననే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. రోకో జోడీని స్ఫూర్తిగా తీసుకొని యువ భారత్ చెలరేగాలని అభిమానులు సూచిస్తున్నారు. ఈ తరుణంలో దిగ్గజ స్పిన్నర్ రవిచంద్రన్ అశ్విన్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. ఆట కంటే ఎవరూ ఎక్కువ కాదన్నాడు. ఎంతటి తోపు ప్లేయర్లయినా గేమ్ తర్వాతేనని అన్నాడు. అశ్విన్ ఇంకా ఏం చెప్పాడో ఇప్పుడు చూద్దాం..
ఆటే గొప్పది..
‘క్రికెట్ అందరికంటే గొప్పది. ఇప్పటివరకు ఆడిన ఆటగాళ్లు, ఇక మీదట ఆడేవారి కంటే కూడా ఆటే అత్యుత్తమమైనది. దాని కంటే ఎవరూ ఎక్కువ కాదు. ఒక్కో దశలో ఒక్కో ఆటగాడు ఆట మీద మంచిగానో లేదా చెడుగానో ప్రభావం చూపించొచ్చు. కానీ వాళ్లను ఆట కంటే గొప్పగా, అతీతులుగా చూడటం సరికాదు’ అని అశ్విన్ చెప్పుకొచ్చాడు. రెడ్ బాల్ క్రికెట్‌కు విరాట్ కోహ్లీ అంబాసిడర్ అనే కామెంట్‌పై అతడు పైవిధంగా స్పందించాడు.
హైప్ ఎందుకు..
క్రికెట్ కంటే ఏ ఆటగాడ్ని కూడా గొప్పగా చూడాల్సిన అవసరం లేదన్నాడు సీనియర్ స్పిన్నర్ అశ్విన్. ఇది చూసిన నెటిజన్స్.. కోహ్లీ పీఆర్ టీమ్‌ను టార్గెట్ చేసుకొనే అశ్విన్ ఇలాంటి వ్యాఖ్యలు చేశాడని అంటున్నారు. అతడు మాట్లాడిన దాంట్లో నిజం ఉందని, గేమ్ కంటే ఎవరూ గొప్పకాదని, ఆటగాళ్లకు ఎక్కువ హైప్ ఇవ్వడం సరికాదని కామెంట్స్ చేస్తున్నారు. అయితే మరికొందరు మాత్రం ఆటకు అత్యుత్తమ సేవలు అందించిన వారిని గొప్పగా ప్రెజెంట్ చేయడంలో, హైప్ ఇవ్వడంలో తప్పు లేదంటున్నారు.
ఇవీ చదవండి:
మరిన్ని క్రీడా వార్తల కోసం క్లిక్ చేయండి