Share News

Piyush Chawla: రిటైర్‌మెంట్ ప్రకటించిన ఐపీఎల్ లెజెండ్.. ధోనీనే వణికించినోడు!

ABN , Publish Date - Jun 06 , 2025 | 03:20 PM

ఐపీఎల్ తొలి సీజన్ నుంచి ఆడుతూ వస్తున్న ఓ లెజెండ్.. క్రికెట్ నుంచి తప్పుకున్నాడు. అన్ని ఫార్మాట్లకు రిటైర్‌మెంట్ ఇస్తున్నట్లు అతడు ప్రకటించాడు. మరి.. ఎవరా ఆటగాడు అనేది ఇప్పుడు చూద్దాం..

Piyush Chawla: రిటైర్‌మెంట్ ప్రకటించిన ఐపీఎల్ లెజెండ్.. ధోనీనే వణికించినోడు!
Piyush Chawla

టీమిండియా వెటరన్ స్పిన్నర్ పీయుష్ చావ్లా సంచలన నిర్ణయం తీసుకున్నాడు. అన్ని ఫార్మాట్ల క్రికెట్ నుంచి తప్పుకుంటున్నట్లు 36 ఏళ్ల ఈ లెగ్ స్పిన్నర్ ప్రకటించాడు. టీ20 ప్రపంచ కప్-2007, వన్డే వరల్డ్ కప్-2011ను గెలుచుకున్న భారత జట్టులో సభ్యుడిగా ఉన్న పీయుష్.. క్రికెట్ నుంచి వైదొలుగుతున్నట్లు వెల్లడించాడు. సుదీర్ఘ కెరీర్‌లో తన సక్సెస్‌కు సహకరించిన వారందరికీ అతడు ధన్యవాదాలు తెలిపాడు. అందమైన ఆటకు వీడ్కోలు పలికేందుకు ఇదే సరైన సమయమని భావిస్తున్నట్లు చెప్పాడు పీయుష్. రిటైర్‌మెంట్ ఇచ్చినా తన నుంచి క్రికెట్‌ను వేరు చేయలేరని అన్నాడు. టీమిండియాకు ఆడిన ప్రతి క్షణాన్ని ఆస్వాదించానని.. వరల్డ్ కప్ జ్ఞాపకాలు ఎప్పటికీ మర్చిపోనని పేర్కొన్నాడు. తనపై నమ్మకం ఉంచి ప్రోత్సహించిన ఐపీఎల్ ఫ్రాంచైజీలు పంజాబ్ కింగ్స్, చెన్నై సూపర్ కింగ్స్, కోల్‌కతా నైట్ రైడర్స్‌కు అతడు థ్యాంక్స్ చెప్పాడు.

piyush-chawla-retirement.jpg-1.jpg


దేశవాళీల్లోనూ దిగ్గజమే..

ఇన్నాళ్ల కెరీర్‌లో తనకు సహకరించిన కుటుంబ సభ్యులు, కోచింగ్ స్టాఫ్‌తో పాటు మద్దుతగా నిలిచిన ఫ్యాన్స్‌కు ధన్యవాదాలు తెలిపాడు పీయుష్ చావ్లా. క్రికెట్ జర్నీలో అండగా ఉన్న భారత క్రికెట్ బోర్డుతో పాటు ఉత్తర్‌ప్రదేశ్, గుజరాత్ క్రికెట్ అసోసియేషన్స్‌కు ఇన్‌స్టాగ్రామ్‌లో పెట్టిన పోస్ట్‌లో కృతజ్ఞతలు తెలియజేశాడు. కాగా, ఐపీఎల్‌ లెజెండ్‌గా గుర్తింపు సంపాదించిన చావ్లా.. ఓవరాల్‌గా క్యాష్ రిచ్ లీగ్‌లో 164 మ్యాచుల్లో 156 వికెట్లు పడగొట్టాడు. కోల్‌కతా నైట్ రైడర్స్ తరఫున ఓ మ్యాచ్‌లో బంతిని గింగిరాలు తిప్పుతూ ఎంఎస్ ధోనీని భయపెట్టాడు. ఇక, భారత జట్టు తరఫున 2006లో అరంగేట్రం చేసిన చావ్లా.. ఇంగ్లండ్‌తో 2012లో జరిగిన నాగ్‌పూర్ టెస్ట్‌లో చివరగా ఆడాడు. మొత్తంగా భారత్ తరఫున 3 టెస్టుల్లో 7 వికెట్లు తీశాడు. 25 వన్డేల్లో 32 వికెట్లు, 7 టీ20ల్లో 4 వికెట్లు పడగొట్టాడతను. ఫస్ట్‌క్లాస్ క్రికెట్‌లో 446 వికెట్లు, లిస్ట్‌-ఏలో 254 వికెట్లు పడగొట్టాడు చావ్లా.


ఇవీ చదవండి:

చాహల్ పట్టుదలకు గర్ల్‌ఫ్రెండ్ ఫిదా!

గార్డెన్‌లో రోహిత్.. పంత్ డైలాగ్ వైరల్!

మరిన్ని క్రీడా, తెలుగు వార్తల కోసం క్లిక్ చేయండి

Updated Date - Jun 06 , 2025 | 03:24 PM