Share News

Punjab Kings: పంజాబ్‌కు డూ ఆర్ డై.. రంగంలోకి స్పిన్ మాంత్రికుడు.. ఇక వేటే!

ABN , Publish Date - Jun 01 , 2025 | 05:15 PM

పంజాబ్ కింగ్స్ ఇప్పుడు డూ ఆర్ డై పరిస్థితుల్లో ఉంది. తొలి కప్పు వేటలో ఉన్న టీమ్‌ను బౌలింగ్ సమస్యలు వేధిస్తున్నాయి. అయితే ఆ ఇబ్బందుల్ని తీర్చేందుకు స్పిన్ మాంత్రికుడు వచ్చేస్తున్నాడు.

Punjab Kings: పంజాబ్‌కు డూ ఆర్ డై.. రంగంలోకి స్పిన్ మాంత్రికుడు.. ఇక వేటే!
Yuzvendra Chahal

ఐపీఎల్-2025లో క్వాలిఫయర్-2 పోరుకు సర్వం సిద్ధమైంది. మరికొంత సేపట్లో ఈ సమరం షురూ కానుంది. మరోసారి ఫైనల్‌కు వెళ్లి ఇంకో కప్పు కొట్టేయాలని ముంబై ఇండియన్స్.. ఎలాగైనా తుదిపోరుకు అర్హత సాధించి తొలిసారి ట్రోఫీని సొంతం చేసుకోవాలని పంజాబ్ కింగ్స్ పట్టుదలతో కనిపిస్తున్నాయి. అయితే ఎలిమినేటర్‌లో గుజరాత్ టైటాన్స్‌ను చిత్తు చేసి జోష్‌లో క్వాలిఫయర్-2 ఆడేందుకు ఎంఐ రెడీ అయిపోయింది. అటు క్వాలిఫయర్-1లో ఆర్సీబీ చేతుల్లో ఘోర పరాభవం చవిచూసిన పంజాబ్.. కాస్త భయం భయంగానే బరిలోకి దిగుతోంది. దీనికి తోడు బౌలింగ్ కష్టాలు ఆ టీమ్‌ మేనేజ్‌మెంట్‌ను మరింత ఆందోళనకు గురిచేస్తున్నాయి. ఈ తరుణంలో ఆ జట్టు అభిమానులకు శుభవార్త. అయ్యర్ సేనలోకి స్పిన్ మాంత్రికుడు వచ్చేస్తున్నాడు. అతడు ఎవరనేది ఇప్పుడు చూద్దాం..


బెండు తీస్తాడా..

జోరు మీదున్న ముంబై ఇండియన్స్ బ్యాటర్ల బెండు తీసేందుకు సీనియర్ స్పిన్నర్ యుజ్వేంద్ర చాహల్ వచ్చేస్తున్నాడు. మణికట్టు గాయంతో మూడు మ్యాచులకు దూరంగా ఉన్న లెగ్ స్పిన్నర్.. ఈ పోరులో బరిలోకి దిగేందుకు రెడీగా ఉన్నాడని తెలుస్తోంది. అసలే బౌలింగ్ సమస్యతో సతమతమవుతున్న పంజాబ్‌కు ఇది అదిరిపోయే న్యూస్ అనే చెప్పాలి. చాహల్ రాకతో స్పిన్ విభాగంతో పాటు మొత్తం బౌలింగ్ యూనిట్ బలోపేతం కావడం ఖాయం..

PBKS-Yuzvendra-Chahal.jpg


ముంబైకి డేంజర్..

మ్యాచ్ విన్నర్ అయిన చాహల్ గానీ రెచ్చిపోతే ముంబైకి ఇబ్బందులు తప్పవు. అతడు పరుగులు సమర్పించుకున్నా వికెట్లు తీస్తాడు. కాబట్టి సూర్యకుమార్ యాదవ్, తిలక్ వర్మ, హార్దిక్ పాండ్యా లాంటి బ్యాటర్లు కాచుకొని ఉండాల్సిందే. కాగా, ఈ సీజన్‌లో 12 మ్యాచుల్లో 14 వికెట్లు పడగొట్టాడు చాహల్. కేకేఆర్, సీఎస్‌కేతో మ్యాచుల్లో నాలుగేసి వికెట్లు తీశాడు. తనదైన రోజున ఎంతటి తోపు బ్యాటర్‌నైనా పెవిలియన్‌కు పంపే సత్తా అతడి సొంతం. గతంలో సూర్య, రోహిత్, హార్దిక్‌ను అతడు పలుమార్లు ఔట్ చేశాడు. అందుకే చాహల్ తుదిజట్టులో ఉంటే ముంబైకి డేంజర్ తప్పదనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.


ఇవీ చదవండి:

ఫైనల్‌కు వెళ్లేది ఆ జట్టేనా?

వాన గండం.. ఫైనల్ వెళ్లేదెవరు?

మరిన్ని క్రీడా, తెలుగు వార్తల కోసం క్లిక్ చేయండి

Updated Date - Jun 01 , 2025 | 05:30 PM