Rohit-Iyer: అయ్యర్‌ను ఇమిటేట్ చేసిన రోహిత్.. అచ్చం దించేశాడు భయ్యా..
ABN , Publish Date - May 27 , 2025 | 01:59 PM
క్వాలిఫయర్-1కి చేరుకునే సువర్ణావకాశాన్ని ముంబై ఇండియన్స్ చేజార్చుకుంది. పంజాబ్ కింగ్స్‌తో మ్యాచ్‌లో ఓడటంతో ఎలిమినేటర్ ఆడాల్సిన పరిస్థితికి చేరుకుంది ముంబై.

టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ మైదానంలో సీరియస్‌గా కనిపిస్తాడు. బరిలోకి దిగితే చాలు.. గెలవడం, ప్రత్యర్థి ఎత్తులను చిత్తు చేయడం మీదే ఫోకస్ చేస్తాడు. నెగ్గడం కోసం ఏమేం చేయాలో అవన్నీ చేస్తుంటాడు. అందుకే మ్యాచ్ పూర్తయ్యే వరకు ఇంటెన్స్‌గా కనిపిస్తాడు. కానీ మ్యాచ్ ముగిసిన తర్వాత మాత్రం కూల్ అయిపోతాడు. ప్రత్యర్థి ఆటగాళ్లతోనూ అతడు బాగా కలసిపోతాడు. వాళ్ల మీద జోక్స్ వేస్తూ అల్లరి చేస్తుంటాడు. సొంత జట్టు ప్లేయర్లతో పాటు అపోజిషన్ టీమ్ వారినీ ఆటపట్టిస్తుంటాడు. నిన్న ఇదే జరిగింది. పంజాబ్ కింగ్స్-ముంబై ఇండియన్స్ మ్యాచ్ పూర్తయ్యాక ప్రత్యర్థి జట్టు సారథి శ్రేయస్ అయ్యర్‌ను ఓ ఆటాడుకున్నాడు హిట్‌మ్యాన్. అతడి నడకను ఇమిటేట్ చేస్తూ అందర్నీ నవ్వుల్లో ముంచెత్తాడు.
భలే దించేశాడు..
భారత జట్టులోని పలువురు ఆటగాళ్లు రోహిత్ శర్మను ఇమిటేట్ చేసిన సందర్భాలు చాలా ఉన్నాయి. గార్డెన్‌లో తిరగొద్దు.. వంటి అతడి డైలాగులు చెబుతూ ఆటపట్టిస్తుంటారు. రోహిత్ కూడా అవకాశం దొరికిన ప్రతిసారి తోటి ఆటగాళ్లతో ఆడుకుంటాడు. నిన్న కూడా ఇలాగే అయ్యర్‌ను ఇమిటేట్ చేశాడు. మ్యాచ్ ముగిశాక పెవిలియన్ వైపు వస్తున్న అయ్యర్‌ను.. అతడి స్టైల్‌లో నడుస్తూ వెళ్లి కలిశాడు రోహిత్. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. ఇది చూసిన నెటిజన్స్.. రోహిత్ చాలా ఫన్నీ గురూ అని అంటున్నారు. భలేగా ఇమిటేట్ చేశాడు.. అచ్చం అయ్యర్ వాకింగ్ స్టైల్‌ను దించేశాడు అంటూ హిట్‌మ్యాన్‌ను మెచ్చుకుంటున్నారు. ఆటలో ఇలాంటి సరదా విషయాలు కూడా ఉంటేనే మరింత మజా వస్తుందని కామెంట్స్ చేస్తున్నారు. కాగా, ముంబై ఇండియన్స్‌తో మ్యాచ్‌లో 7 వికెట్ల తేడాతో ఘనవిజయం సాధించింది పంజాబ్ కింగ్స్. దీంతో క్వాలిఫయర్-1కు అర్హత సాధించింది అయ్యర్ సేన. అటు ఓటమిపాలైన ముంబై.. ఎలిమినేటర్‌కు పడిపోయింది.
ఇవీ చదవండి:
మరిన్ని క్రీడా, తెలుగు వార్తల కోసం క్లిక్ చేయండి