Share News

Pat Cummins IPL 2025: సన్‌రైజర్స్ నుంచి కమిన్స్ ఔట్.. టోర్నీ మధ్యలో హఠాత్తుగా..

ABN , Publish Date - Apr 18 , 2025 | 02:55 PM

Becky Boston: సన్‌రైజర్స్ హైదరాబాద్‌‌కు ఈ సీజన్‌లో ఏదీ కలసి రావడం లేదు. ఎస్‌ఆర్‌హెచ్ ఏది చేసినా రివర్స్ అవుతోంది. అసలే వరుస ఓటముల్లో ఉన్న జట్టుకు తాజాగా బిగ్ షాక్ తగిలిందని తెలుస్తోంది.

Pat Cummins IPL 2025: సన్‌రైజర్స్ నుంచి కమిన్స్ ఔట్.. టోర్నీ మధ్యలో హఠాత్తుగా..
SRH vs MI

అదృష్టం బాగా లేకపోతే అరటి పండు తిన్నా పన్ను విరుగుతుందని పెద్దలు అంటుంటారు. ఇప్పుడు సన్‌రైజర్స్ హైదరాబాద్ పరిస్థితి అలాగే ఉంది. గత సీజన్‌లో భారీ స్కోర్లు బాదుతూ ఫైనల్స్‌కు దూసుకెళ్లిన కమిన్స్ సేన.. తృటిలో కప్పు కోల్పోయింది. ఈ సీజన్‌లోనూ అదే మ్యాజిక్ చేస్తుందని అనుకుంటే.. వరుస పరాజయాలతో ప్లేఆఫ్స్ అవకాశాలు సంక్లిష్టం చేసుకుంది. ఉతుకుడే ఉతుకుడు అన్నట్లు ఆడే ఎస్‌ఆర్‌‌హెచ్‌ను స్లో పిచ్‌ల మీద ఆడిస్తూ చిత్తు చేస్తున్నాయి అపోజిషన్ టీమ్స్. ఈ తరుణంలో టీమ్‌కు బిగ్ షాక్ తగిలిందని తెలుస్తోంది. సన్‌రైజర్స్ క్యాంప్ నుంచి కెప్టెన్ ప్యాట్ కమిన్స్ వెళ్లిపోయాడని రూమర్స్ వస్తున్నాయి. అసలు నిజం ఏంటనేది ఇప్పుడు చూద్దాం..


ఇండియాకు గుడ్‌బై..

ముంబై ఇండియన్స్‌తో వాంఖడే వేదికగా గురువారం జరిగిన పోరులో ఓటమిపాలైంది సన్‌రైజర్స్. దీంతో ఆరెంజ్ ఆర్మీ ఆటగాళ్లతో పాటు అభిమానులు కూడా నిరాశలో కూరుకుపోయారు. జట్టు మళ్లీ కమ్‌బ్యాక్ ఇస్తుందా.. ప్లేఆఫ్స్ చేరుతుందా.. లేదా.. అనే ఆలోచనల్లో మునిగిపోయారు. ఈ తరుణంలో కెప్టెన్ కమిన్స్ సతీమణి బెకీ ఇన్‌స్టాగ్రామ్‌లో ఒక ఇంట్రెస్టింగ్ పోస్ట్ పెట్టింది. కమిన్స్‌తో కలసి ఎయిర్‌పోర్ట్‌లో దిగిన ఫొటోను పోస్ట్ చేసిన బెకీ.. దీనికి గుడ్‌బై ఇండియా.. ఈ అందమైన దేశాన్ని పర్యటించడం ఓ అద్భుతం అంటూ క్యాప్షన్ ఇచ్చింది.


ఎయిర్‌పోర్ట్‌లో ఏం చేస్తున్నట్లు..

కమిన్స్-బెకీ ఎయిర్‌పోర్ట్‌లో దిగిన ఫొటోలను షేర్ చేయడం, గుడ్‌బై ఇండియా క్యాప్షన్ పెట్టడంతో వీళ్లు ఆస్ట్రేలియాకు పయనమయ్యారా అనే సందేహాలు వ్యక్తం అవుతున్నాయి. ప్యాట్‌కు గాయమైందా లేదా వరుస ఓటముల వల్ల బాధతో స్వదేశానికి వెళ్లిపోతున్నాడా.. అనే డౌట్స్ వస్తున్నాయి. కాపాడతాడనుకుంటే.. ఇలా హ్యాండ్ ఇచ్చాడేంటనే కామెంట్స్ వినిపిస్తున్నాయి. అయితే సన్‌రైజర్స్ మేనేజ్‌మెంట్ నుంచి దీనిపై ఓ క్లారిటీ వచ్చినట్లు తెలుస్తోంది. పూర్తి సీజన్‌కు కమిన్స్ అందుబాటులో ఉంటాడట. భయపడాల్సిందేమీ లేదు.. భార్యను డ్రాప్ చేసేందుకు అతడు ముంబై ఎయిర్‌పోర్ట్‌కు వెళ్లాడని, ఆ టైమ్‌లోనే దిగిన ఫొటోలు అవి అని ఎస్‌‌ఆర్‌హెచ్ వర్గాలు స్పష్టం చేశాయని సమాచారం. దీంతో ఆరెంజ్ ఆర్మీ అభిమానులు హమ్మయ్య అంటూ ఊపిరి పీల్చుకుంటున్నారు.


ఇవీ చదవండి:

స్టార్ క్రికెటర్లు నాకు అశ్లీల ఫొటోలు పంపారు..

ఎస్‌ఆర్‌హెచ్‌కు ఒకే దారి.. ఇలా చేస్తే ప్లేఆఫ్స్‌కు..

రాహుల్ దగ్గర కోట్ల రూపాయల కార్లు

మరిన్ని క్రీడా, తెలుగు వార్తల కోసం క్లిక్ చేయండి

Updated Date - Apr 18 , 2025 | 03:01 PM