Pahalgam Attack-Sourav Ganguly: పాక్‌తో క్రికెట్ రిలేషన్స్.. గంగూలీ సంచలన వ్యాఖ్యలు
ABN , Publish Date - Apr 26 , 2025 | 01:50 PM
IND vs PAK: పహల్గాం ఉగ్రదాడితో భారత్-పాకిస్థాన్ మధ్య పచ్చగడ్డి వేస్తే భగ్గుమనేలా పరిస్థితులు నెలకొన్నాయి. పాక్ ప్రేరేపిత ఉగ్రవాదులు చేసిన నరమేధంపై యావత్ భారతదేశం సీరియస్‌గా ఉంది. దాయాదితో అన్ని రకాల సంబంధాలు తెంచుకోవాలనే డిమాండ్లు పెరుగుతున్నాయి.

క్రికెట్లో మోస్ట్ ఎగ్జయిటింగ్ ఫైట్స్‌లో భారత్-పాకిస్థాన్ ఒకటి. ఈ దాయాది జట్లు బరిలోకి దిగి కొదమసింహాల్లా కొట్లాడుతుంటే చూసేందుకు రెండు కళ్లు చాలవు. అయితే ఇక మీదట ఈ టీమ్స్ మధ్య మ్యాచులు జరగడం కష్టంగానే కనిపిస్తోంది. దీనికి కారణం పహల్గాం ఉగ్రదాడి. టూరిస్టులపై అమానవీయంగా దాడి చేసి 26 మందిని పొట్టన పెట్టుకున్నారు టెర్రరిస్టులు. దీంతో పాకిస్థాన్‌పై యావత్ భారతదేశం గుర్రుగా ఉంది. ఆ కంట్రీతో అన్ని రిలేషన్స్ తెంచుకోవాలనే డిమాండ్లు వినిపిస్తున్నాయి. క్రికెట్ విషయంలోనూ ఇదే పంథాను అవలంభించాలనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. ఈ నేపథ్యంలో టీమిండియా మాజీ కెప్టెన్ సౌరవ్ గంగూలీ సంచలన వ్యాఖ్యలు చేశాడు. ఇంతకీ అతడేం అన్నాడంటే..
సహించేదే లేదు..
పాకిస్థాన్‌తో ఎలాంటి క్రికెట్ ఆడొద్దని భారత క్రికెట్ బోర్డుకు రిక్వెస్ట్ చేశాడు గంగూలీ. ఉగ్రదాడిని తీవ్రంగా ఖండించిన దాదా.. పాక్‌తో క్రికెట్ సంబంధాలను పూర్తిగా తెంచేసుకోవాలని స్పష్టం చేశాడు. అది జరిగి తీరాల్సిందేనని అన్నాడు. ఈ విషయంలో వేరే ఆలోచన పెట్టుకోవద్దని పేర్కొన్నాడు. తప్పకుండా దాయాది విషయంలో కఠిన చర్యలు తీసుకోవాల్సిందేనని దాదా చెప్పుకొచ్చాడు. ప్రతి ఏడాది ఇలాంటి ఘటనలు రిపీట్ అవుతూనే ఉన్నాయని.. ఏమైనా తమాషా అనుకుంటున్నారా అంటూ పాక్‌పై సీరియస్ అయ్యాడు గంగూలీ. టెర్రరిజాన్ని ఏమాత్రం సహించేది లేదన్నాడు.
ఎక్కడ దాక్కున్నారు..
గంగూలీ నుంచి సచిన్ టెండూల్కర్ వరకు, విరాట్ కోహ్లీ నుంచి గౌతం గంభీర్ దాకా భారత క్రికెటర్లు ఒక్కొక్కరుగా ఉగ్రదాడిపై ఘాటుగా స్పందిస్తున్నారు. వరల్డ్‌వైడ్‌గా ఈ ఘటనపై రియాక్షన్స్ వస్తున్నాయి. అయితే డానిష్ కనేరియా మినహా పాకిస్థాన్ క్రికెటర్లు ఎవరూ దీనిపై స్పందించడం లేదు. నేరుగా పాక్ ప్రధానిని టార్గెట్ చేసుకొని కనేరియా పలు వ్యాఖ్యలు చేశాడు. చాంపియన్స్ ట్రోఫీ విషయంలో నానా రభస చేసిన పాక్ మాజీలు.. ఇప్పుడు ఎక్కడ దాక్కున్నారంటూ వాళ్లపై సోషల్ మీడియాలో సీరియస్ అవుతున్నారు నెటిజన్స్. ఉగ్రదాడిని కనీసం ఖండించకపోవడం దారుణమంటూ వాళ్లపై ఫైర్ అవుతున్నారు.
ఇవీ చదవండి:
చెన్నై బ్యాటర్లపై ధోనీ అసంతృప్తి
మరిన్ని క్రీడా, తెలుగు వార్తల కోసం క్లిక్ చేయండి