Cricketers On Pahalgam Attack: న్యాయం జరగాల్సిందే.. పహల్‌గామ్ అటాక్‌పై స్టార్ క్రికెటర్ల సంచలన వ్యాఖ్యలు
ABN , Publish Date - Apr 23 , 2025 | 03:50 PM
Kashmir Attack: యావత్ దేశాన్ని ఉలిక్కిపడేలా చేసింది పహల్‌గామ్ ఘటన. ఉగ్రవాదులు నిర్దాక్షిణ్యంగా జరిపిన కాల్పుల్లో ఏకంగా 28 మంది టూరిస్టులు ప్రాణాలు కోల్పోయారు. ఈ ఘటనపై టీమిండియా స్టార్లు రియాక్ట్ అయ్యారు. ఇంతకీ వాళ్లు ఏమన్నారంటే..

కశ్మీరు లోయలో రక్తం ఏరులైపారింది. మరోసారి పేట్రేగిపోయిన ఉగ్రవాదులు 28 మంది టూరిస్టులను బలిగొన్నారు. అనంత్‌నాగ్ జిల్లా పహల్‌గామ్ దగ్గర్లోని బైసరన్ లోయలో ప్రకృతిని ఆస్వాదిస్తున్న పర్యాటకులను చుట్టుముట్టి కాల్పులకు తెగబడ్డారు ముష్కరులు. పురుషులే లక్ష్యంగా దాడి చేసి తూటాల వర్షం కురిపించారు. దేశం మొత్తాన్ని ఉలిక్కిపడేలా చేసిన ఈ ఘటనపై టీమిండియా స్టార్లు స్పందించారు. ఈ దాడి బాధితులకు న్యాయం జరగాల్సిందేనని భారత క్రికెటర్లు డిమాండ్ చేస్తున్నారు. సచిన్ నుంచి కోహ్లీ వరకు చాలా మంది స్టార్లు పహల్‌గామ్ విషాదంపై రియాక్ట్ అయ్యారు. ఎవరెవరు ఎలా స్పందించారో ఇప్పుడు చూద్దాం..
న్యాయం జరగాలి..
పహల్‌గామ్‌లో అమాయక ప్రజలపై జరిగిన దాడి తనను తీవ్రంగా కలచివేసిందని కోహ్లీ అన్నాడు. ఈ అటాక్‌లో ప్రాణాలు కోల్పోయిన వారి కుటుంబాలకు సానుభూతిని తెలియజేశాడు విరాట్. మృతుల కుటుంబాలకు శాంతి, బలం చేకూరాలని ప్రార్థిస్తున్నానని నెట్టింట పెట్టిన పోస్టులో రాసుకొచ్చాడు కోహ్లీ. బాధితులు అందరికీ న్యాయం జరగాలని లెజెండ్ సచిన్ టెండూల్కర్ అన్నాడు. మృతుల కుటుంబాల బాధ మాటల్లో వర్ణించలేనిదని ట్వీట్ చేశాడు మాస్టర్ బ్లాస్టర్.
పగ తీర్చుకుంటాం
మతం పేరుతో అమాయకులను టార్గెట్ చేసి ప్రాణాలు తీయడం దారుణమంటూ సీరియస్ అయ్యాడు మహ్మద్ సిరాజ్. ఏ కారణం గానీ నమ్మకం గానీ సిద్ధాంతాన్ని గానీ సాకుగా చూపి ఇలాంటి దుశ్చర్యను సమర్థించలేరంటూ ఫైర్ అయ్యాడు మియా. పాకిస్థాన్‌తో ఎప్పటికీ క్రికెట్ ఆడొద్దని.. వాళ్లను దూరంగా ఉంచాలని యంగ్ క్రికెటర్ శ్రీవాత్స్ గోస్వామి బీసీసీఐని కోరాడు. ఈ దారుణానికి కారణమైన వారిని వదిలేది లేదని.. భారత్ తప్పక పగ తీర్చుకుంటుందని టీమిండియా హెడ్ కోచ్ గౌతం గంభీర్ ట్వీట్ చేశాడు.
ఇవీ చదవండి:
చేతికి నల్లరిబ్బన్లతో బరిలోకి..
పెళ్లి కాని మిశ్రా భార్యను వేధించాడట
మరిన్ని క్రీడా, తెలుగు వార్తల కోసం క్లిక్ చేయండి