Share News

IND vs PAK Matches: పహల్గాం ఎఫెక్ట్.. ఐసీసీ టోర్నీల్లోనూ ఇండో-పాక్ మ్యాచులు ఉండవా..

ABN , Publish Date - Apr 25 , 2025 | 02:14 PM

BCCI: భారత్-పాకిస్థాన్ జట్ల మధ్య మ్యాచ్ అంటే ఇరు దేశాల క్రీడాభిమానులతో పాటు ప్రపంచ వ్యాప్తంగా ఉన్న క్రికెట్ లవర్స్‌కూ ఆసక్తే. కోట్లాది మంది వీక్షించే ఈ దాయాదుల పోరుకు జెంటిల్మన్ గేమ్‌లో చాలా ప్రాముఖ్యత ఉంది. అయితే పహల్గాం అటాక్‌తో ఈ సిచ్యువేషన్ కంప్లీట్ రివర్స్ అయ్యే చాన్సులు కనిపిస్తున్నాయి.

IND vs PAK Matches: పహల్గాం ఎఫెక్ట్.. ఐసీసీ టోర్నీల్లోనూ ఇండో-పాక్ మ్యాచులు ఉండవా..
IND vs PAK

వరల్డ్ క్రికెట్‌లో కొన్ని పోరాటాలకు చాలా ప్రాముఖ్యత ఉంటుంది. ముఖ్యంగా భారత్-పాకిస్థాన్ జట్లు బరిలోకి దిగి ఆడుతున్నాయంటే చూసేందుకు కోట్లాది మంది ఎగబడతారు. ఈ దాయాదుల పోరు ఉందంటే చాలు ఆఫీసులకు సెలవులు పెట్టేస్తారు. ఆ రోజు ఎన్ని పనులున్నా ఆపుకొని మరీ టీవీలు, ఫోన్లకు అతుక్కుపోతారు. చివరి బంతి వరకు ఉత్కంఠగా జరిగే ఈ ఇండో-పాక్‌కు ఫైట్‌కు ఉన్న మజాయే వేరు. అయితే ఈ ఉభయ దేశాల మధ్య క్రికెట్ రిలేషన్స్ పూర్తిగా తెగిపోయే చాన్సులు కనిపిస్తున్నాయి. ఇప్పటికే రెండు దేశాల మధ్య ద్వైపాక్షిక సిరీస్‌లు జరగడం లేదు. ఇక ఫ్యూచర్‌లోనూ నిర్వహించే ప్రసక్తే లేదని బీసీసీఐ వైస్ ప్రెసిడెంట్ రాజీవ్ శుక్లా క్లారిటీ ఇచ్చారు. దీంతో ఐసీసీ టోర్నమెంట్స్‌లోనైనా భారత్-పాక్ తలపడతాయా.. లేదా.. అనే అనుమానాలు రేకెత్తుతున్నాయి. దీని గురించి ఇప్పుడు చూద్దాం..


ఐసీసీకి లేఖ నిజమేనా..

ఇండో-పాక్ మధ్య ద్వైపాక్షిక సిరీస్‌లు ఉండవని బీసీసీఐ తేల్చేసింది. కానీ ఐసీసీ టోర్నీల్లో ఇరు టీమ్స్ తలపడతాయా.. లేదా.. అనేది మాత్రం క్లారిటీ ఇవ్వలేదు. అయితే పహల్గాం దాడి నేపథ్యంలో ఐసీసీ టోర్నీల్లో పాకిస్థాన్‌తో గ్రూప్ స్టేజ్‌లో అస్సలు ఆడొద్దని టీమిండియా భావిస్తోందనే రూమర్స్ వినిపిస్తున్నాయి. ఈ మేరకు ఐసీసీకి బీసీసీఐ పెద్దల నుంచి లెటర్ కూడా వెళ్లిందని తెలుస్తోంది. ఫ్యూచర్‌లో వరల్డ్ కప్, చాంపియన్స్ ట్రోఫీ లాంటి మెగా టోర్నీల్లో ఇండో-పాక్‌ను ఒకే గ్రూప్‌లో ఉంచొద్దని ఆ లేఖలో బీసీసీఐ పేర్కొన్నట్లు సమాచారం. అయితే దీనిపై బోర్డు వర్గాలు మాత్రం క్లారిటీ ఇవ్వడం లేదు.


కంప్లీట్‌ కట్..

దేశవ్యాప్తంగా పహల్గాం టెర్రర్ అటాక్ మీద ఆగ్రహం వ్యక్తమవుతోంది. దీంతో పాకిస్థాన్‌తో ఎలాంటి సంబంధాలు వద్దనే డిమాండ్లు తీవ్రతరం అవుతున్నాయి. ఆ దేశంతో క్రికెట్ రిలేషన్స్ కూడా వద్దనే అభిప్రాయాలు వినిపిస్తున్నాయి. ఈ నేపథ్యంలోనే ఐసీసీ టోర్నీల్లో గ్రూప్ స్టేజ్ మ్యాచుల్లో దాయాదితో ఆడొద్దని టీమిండియా అనుకుంటోందట. అదే సమయంలో ఐసీసీ టోర్నీల్లో పాక్‌తో మ్యాచులను బ్యాన్ చేసే అంశం మీదా చర్చలు జరుగుతున్నాయిని సమాచారం. అయితే దీనిపై బోర్డు పెద్దలు క్లారిటీ ఇస్తే తప్ప ఏమీ చెప్పలేం. ఈ వ్యవహారంపై మరింత స్పష్టత కోసం బీసీసీఐ నుంచి అధికారిక ప్రకటన కోసం ఎదురు చూడక తప్పదు.


ఇవీ చదవండి:

ప్లేఆఫ్స్ చేరాలంటే ఎవరెన్ని నెగ్గాలి

పాక్ అథ్లెట్‌కు ఆహ్వానం పంపడంపై విమర్శలు

సచిన్ కొడుకు మరో గేల్ అవుతాడు

మరిన్ని క్రీడా, తెలుగు వార్తల కోసం క్లిక్ చేయండి

Updated Date - Apr 25 , 2025 | 02:18 PM