Nathan Smith: వాటే క్యాచ్.. వీడు మనిషా.. పక్షా.. గాల్లోకి అమాంతం ఎగిరి..
ABN , Publish Date - Jan 08 , 2025 | 03:56 PM
క్రికెట్‌లో ఎన్నో స్టన్నింగ్ క్యాచెస్ చూసుంటారు. కానీ ఇది మాత్రం వాటన్నింటికీ మించినదే చెప్పాలి. ఎప్పుడు పరుగు అందుకున్నాడు, ఎప్పుడు ఎగిరాడు, బంతిని పట్టేశాడు అనేది తెలియకుండా క్షణకాలంలోనే మాయ చేసేశాడో ఫీల్డర్.

క్రికెట్‌లో ఎన్నో స్టన్నింగ్ క్యాచెస్ చూసుంటారు. కానీ ఇది మాత్రం వాటన్నింటికీ మించినదే చెప్పాలి. ఎప్పుడు పరుగు అందుకున్నాడు, ఎప్పుడు ఎగిరాడు, బంతిని పట్టేశాడు అనేది తెలియకుండా క్షణకాలంలోనే మాయ చేసేశాడో ఫీల్డర్. పక్షిలా గాల్లోకి ఎగిరి అమాతం బంతిని పట్టేసి అందర్నీ ఆశ్చర్యంలో ముంచెత్తాడు. ఇది శ్రీలంక-న్యూజిలాండ్ మధ్య జరుగుతున్న రెండో వన్డేలోచోటుచేసుకుంది. లంక బ్యాటర్ ఎషాన్ మలింక ఆఫ్ సైడ్ కొట్టిన బంతిని అద్భుతంగా ఒడిసి పట్టుకున్నాడు కివీస్ ప్లేయర్ నాథన్ స్మిత్.
నీళ్లు తాగినంత ఈజీగా..
ఎషాన్ కొట్టిన బంతి బౌండరీ దిశగా వెళ్తుండటంతో డీప్‌లో ఉన్న నాథన్ స్మిత్ పరిగెత్తుకుంటూ వచ్చాడు. బంతి గాల్లో ఉండటంతో దాని వైపు చూస్తూనే చాలా దూరం నుంచి రన్నింగ్ చేస్తూ వచ్చాడు. బాల్ బౌండరీ లైన్‌ను సమీపిస్తుండటంతో స్పీడ్ పెంచిన స్మిత్.. మెరువు వేగంతో దాని వద్దకు చేరుకున్నాడు. అయితే బంతి మరింత స్పీడ్‌గా కింద పడుతుండటంతో ఒకేసారి జంప్ చేశాడు. ఆ సమయంలో అతడి బాడీ మొత్తం గాల్లోనే ఉంది. రెండు చేతులతో బాల్‌ను ఒడిసిపట్టి తన జట్టు సభ్యుల్ని సంతోషంలో ముంచెత్తాడు స్మిత్. ఈ క్యాచ్ చూసి బ్యాటర్‌తో పాటు ఆడియెన్స్ అంతా షాక్ అయ్యారు. వాటే క్యాచ్ అంటూ ప్రశంసల్లో ముంచెత్తారు. కాగా, ఈ మ్యాచ్‌లో న్యూజిలాండ్ 37 ఓవర్లలో 9 వికెట్లకు 255 పరుగులు చేసింది. ఆ తర్వాత ఛేజింగ్‌కు దిగిన లంక 142 పరుగులకే కుప్పకూలింది.
ఇవీ చదవండి:
సెలెక్టర్లను కన్‌ఫ్యూజ్ చేస్తున్న నితీష్ రెడ్డి.. భలే ట్విస్ట్ ఇచ్చాడు
లాంగ్ బ్రేక్ తీసుకుంటున్న టీమిండియా స్టార్.. అప్పటిదాకా నో క్రికెట్
ఆ స్టార్లను సౌతాఫ్రికా పంపండి.. బీసీసీఐకి డివిలియర్స్ రిక్వెస్ట్..
మరిన్ని క్రీడా, తెలుగు వార్తల కోసం క్లిక్ చేయండి