ICC Champions Trophy: చాంపియన్స్ ట్రోఫీ ఎఫెక్ట్.. రిటైర్మెంట్ ప్రకటించిన మరో స్టార్ క్రికెటర్
ABN , Publish Date - Mar 06 , 2025 | 09:10 AM
Bangladesh: చాంపియన్స్ ట్రోఫీ-2025 ఫెయిల్యూర్ పలువురు క్రికెటర్ల కెరీర్‌లకు ఎండ్ కార్డ్ వేస్తోంది. ఒక్కొక్కరుగా కొందరు సీనియర్ ప్లేయర్లు రిటైర్మెంట్ బాట పడుతున్నారు. తాజాగా ఓ బంగ్లాదేశ్ సీనియర్ బ్యాటర్ సుదీర్ఘ కెరీర్‌కు గుడ్‌బై చెప్పేశాడు.

బంగ్లాదేశ్ వికెట్ కీపర్, బ్యాటర్ ముష్ఫికర్ రహీం సంచలన నిర్ణయం తీసుకున్నాడు. వన్డే క్రికెట్‌కు అతడు గుడ్‌బై చెప్పేశాడు. ఈ విషయాన్ని సోషల్ మీడియా ద్వారా ప్రకటించాడు ముష్ఫికర్. గత కొన్నాళ్లుగా ఎన్నో సవాళ్లు ఎదుర్కొంటున్నానని అన్నాడు. కెరీర్ మొత్తం నిజాయితీ, అంకితభావంతో బంగ్లాకు ప్రాతినిధ్యం వహించానని తెలిపాడు. లాంగ్ కెరీర్‌లో తనకు సహకరించిన బంగ్లా బోర్డుతో పాటు అభిమానులు, సహచర క్రికెటర్లు, కుటంబ సభ్యులకు అతడు ధన్యవాదాలు తెలిపాడు. కాగా, చాంపియన్స్ ట్రోఫీ ముష్ఫికర్‌కు చివరి వన్డే టోర్నమెంట్‌గా నిలిచింది. ఇందులో బంగ్లాదేశ్ లీగ్ దశలోనే ఇంటిదారి పట్టింది.
భర్తీ చేయగలరా..
చాంపియన్స్ ట్రోఫీలో ఆడిన రెండు మ్యాచుల్లోనూ ముష్ఫికర్ విఫలమయ్యాడు. ఇక, 2006లో జింబాబ్వేతో జరిగిన మ్యాచ్‌తో వన్డే ఫార్మాట్‌లోకి ఎంట్రీ ఇచ్చాడతను. 37 ఏళ్ల వెటరన్ బ్యాటర్.. బంగ్లా తరఫున ఏకంగా 274 మ్యాచులు ఆడాడు. ఇందులో 7,795 పరుగులు చేశాడతను. 9 సెంచరీలతో పాటు 49 హాఫ్ సెంచరీలు బాదాడు. కీపింగ్‌లో కూడా అతడు తోపే. 243 క్యాచులు అందుకోవడమే గాక 56 స్టంపింగ్స్ చేశాడు. సుదీర్ఘ కాలం పాటు దేశానికి ఆడుతూ బ్యాటింగ్ ఆర్డర్‌కు వెన్నెముకగా ఉన్న ముష్ఫికర్ లాంటి ఆటగాడు టీమ్‌ను వీడటం బంగ్లాదేశ్‌కు పూడ్చలేని లోటు అనే చెప్పాలి. ఆ రేంజ్‌లో అటు కీపింగ్, ఇటు బ్యాటింగ్‌లో ఆడే ప్లేయర్ దొరకడం అంత ఈజీ కాదు. మరి.. ముష్ఫికర్‌ను భర్తీ చేసే ఆటగాడు ఎవరైనా వస్తారేమో చూడాలి.
ఇవీ చదవండి:
కివీస్ వచ్చేసింది భారత్‌తో ఫైనల్‌కు సై
మరిన్ని క్రీడా, తెలుగు వార్తల కోసం క్లిక్ చేయండి