MS Dhoni: పచ్చి అబద్ధం.. అస్సలు నమ్మకండి.. ఫ్యాన్స్‌కు ధోని రిక్వెస్ట్
ABN , Publish Date - Apr 22 , 2025 | 07:34 PM
CSK: ఆ పుకార్లను అస్సలు నమ్మొద్దని అంటున్నాడు చెన్నై సూపర్ కింగ్స్ కెప్టెన్ ఎంఎస్ ధోని. వాటిలో ఏమాత్రం నిజం లేదని చెబుతున్నారు. ఇంతకీ మాహీ చెబుతోంది దేని గురించో ఇప్పుడు చూద్దాం..

టీమిండియాకు ఆడే స్టార్ల గురించి ఏదో ఒక రూమర్ వినిపిస్తూనే ఉంటుంది. ఆటగాళ్ల కెరీర్ దగ్గర నుంచి పర్సనల్ లైఫ్, హాబీస్, ఆదాయం వరకూ దాదాపుగా ప్రతి అంశం మీద గాసిప్స్ వైరల్ అవుతుంటాయి. అయితే వీటిల్లో ఎంత నిజం ఉందనేది ప్లేయర్లు చెప్పేంత వరకు నమ్మలేం. అలా తనకు సంబంధించి ఏళ్ల పాటు జనాల నోళ్లలో నలిగిన ఓ విషయం మీద రియాక్ట్ అయ్యాడు లెజెండ్ మహేంద్ర సింగ్ ధోని. తాను ప్రతి రోజూ 5 లీటర్ల పాలు తాగుతానంటూ వైరల్ అయిన రూమర్‌పై తాజాగా క్లారిటీ ఇచ్చాడు మాహీ. ఇంతకీ అతడు ఏమన్నాడంటే..
నిజం ఇదే..
ఐపీఎల్‌లో సీఎస్‌కే తరఫున దుమ్మురేపుతున్న ధోని.. తాజాగా ఓ ప్రమోషనల్ ఈవెంట్‌లో పాల్గొన్నాడు. ఈ సందర్భంగా మీకు సంబంధించిన ఏదైనా ఓ పాపులర్ రూమర్ గురించి చెప్పమంటూ మాహీని అడిగారు యాంకర్. దీనికి లెజెండరీ క్రికెటర్ స్పందిస్తూ.. డైలీ నేను 5 లీటర్ల పాలు తాగుతా అనే రూమర్ బాగా చర్చనీయాంశంగా మారిందని అన్నాడు. ప్రతి రోజూ తాను పాలు తాగుతాననేది కరెక్టేనని.. కానీ అన్ని లీటర్లు తాగనని స్పష్టం చేశాడు ధోని. డైలీ 1 లీటర్ పాలు మాత్రమే తాగుతానని తెలిపాడు. వాషింగ్ మెషీన్‌లో లస్సీ తయారు చేస్తాననే రూమర్ కూడా ఉందని.. కానీ అసలు తాను లస్సీనే తాగనని క్లారిటీ ఇచ్చాడు సీఎస్‌కే సారథి. కాగా, ధోని సారథ్యంలో సీఎస్‌కే ఈ ఐపీఎల్‌లో చెత్తాటతో అందర్నీ నిరాశపరుస్తోంది. ఇప్పటిదాకా ఆడిన 8 మ్యాచుల్లో 2 విజయాలు, 6 పరాజయాలతో పాయింట్స్ టేబుల్‌లో లాస్ట్ పొజిషన్‌లో కొనసాగుతోంది చెన్నై.
ఇవీ చదవండి:
రివేంజ్‌కు బెస్ట్ చాన్స్.. గెలిచేదెవరో..
గిల్-అభిషేక్‌కు యువీ వార్నింగ్
మరిన్ని క్రీడా, తెలుగు వార్తల కోసం క్లిక్ చేయండి