Share News

Jasprit Bumrah: కోచ్‌కు షాక్ ఇచ్చిన బుమ్రా.. ఇది కదా కావాల్సింది!

ABN , Publish Date - Jun 12 , 2025 | 11:06 AM

బుల్లెట్ బంతులతో ప్రత్యర్థి బ్యాటర్ల గుండెల్లో రైళ్లు పరిగెత్తించే బుమ్రా.. ఈసారి సొంత జట్టును కోచ్‌ను షాక్‌కు గురిచేశాడు. జస్‌ప్రీత్ బౌలింగ్‌కు ఆయన ఫిదా అయిపోయాడట. అసలేం జరిగిందంటే..

Jasprit Bumrah: కోచ్‌కు షాక్ ఇచ్చిన బుమ్రా.. ఇది కదా కావాల్సింది!
Jasprit Bumrah

ఇంగ్లండ్ టూర్‌లో ఉన్న భారత జట్టు 5 టెస్టుల సిరీస్ కోసం జోరుగా రెడీ అవుతోంది. టీమిండియా ప్లేయర్లు నెట్స్‌లో తీవ్రంగా చెమటోడ్చుతున్నారు. విరాట్ కోహ్లీ, రోహిత్ శర్మ, రవిచంద్రన్ అశ్విన్ వంటి గొప్ప ఆటగాళ్ల నిష్క్రమణ తర్వాత జరుగుతున్న తొలి సిరీస్ కావడంతో ఎలాగైనా గెలిచి తీరాలని అనుకుంటున్నారు. దిగ్గజాలు లేకపోయినా టీమిండియాకు ఎదురులేదని చాటిచెప్పాలని భావిస్తున్నారు. సీనియర్ పేసర్ జస్‌ప్రీత్ బుమ్రా కూడా తన బెస్ట్ పెర్ఫార్మెన్స్‌ ఇవ్వాలని అనుకుంటున్నాడు. అందుకోసం నెట్స్‌లో చెమటలు చిందిస్తున్నాడు. అయితే అతడి బౌలింగ్ చూసి కోచ్ బిత్తరపోయాడట. ఆ రిథమ్ ఏంటి బాస్ అంటూ షాక్ అయ్యాడట. అసలేం జరిగిందంటే..


సీన్ రివర్స్..

భీకరమైన పేస్, నిలకడైన లైన్ అండ్ లెంగ్త్, చక్కటి రిథమ్‌తో బౌలింగ్ చేసే బుమ్రా అంటే ప్రత్యర్థులకు హడల్. అతడి రాకాసి స్వింగర్లు, అనూహ్యమైన బౌన్సర్లు, స్టన్నింగ్ యార్కర్లకు స్టార్ బ్యాటర్ల దగ్గర కూడా సమాధానం లేదు. అతడు బౌలింగ్‌కు దిగుతున్నాడంటేనే అంతా భయపడతారు. అయితే ఈసారి సీన్ రివర్స్ అయింది. బుమ్రా బంతుల్ని సంధిస్తున్న తీరు, అతడి రిథమ్ చూసి టీమిండియా బౌలింగ్ కోచ్ మోర్నీ మోర్కెల్ షాక్ అయ్యాడు. ఈ విషయాన్ని స్వయంగా అతడే బయటపెట్టాడు. జస్‌ప్రీత్ ఫిట్‌గా ఉన్నాడని, అద్భుతంగా బౌలింగ్ చేస్తున్నాడని అన్నాడు.

bumrah.jpg


వాటే ఎనర్జీ..

‘బుమ్రాకు ఎలా సన్నద్ధం అవ్వాలో తెలుసు. గత మూడ్రోజులుగా ట్రెయినింగ్ సెషన్స్‌లో అతడి బౌలింగ్‌ను గమనిస్తున్నాడు. సూపర్ ఎనర్జీతో బంతులు సంధిస్తున్నాడు. అతడి ఎనర్జీ చూసి షాక్ అయ్యా. అతడు ఫిట్‌గా ఉండటం సంతోషకరం. బుమ్రాను ఎలా వాడుకోవాలో మాకు తెలుసు. మా జట్టుకు అతడు చాలా కీలకం. కాబట్టి అవసరాన్ని బట్టి బుమ్రా చేతికి బంతులు ఇస్తూ పోతాం’ అని మోర్కెల్ చెప్పుకొచ్చాడు. బౌలింగ్ కోచ్ వ్యాఖ్యలపై నెటిజన్స్ హర్షం వ్యక్తం చేస్తున్నారు. బుమ్రా వేటకు సిద్ధమవుతున్నాడని.. ఇంగ్లండ్‌కు దబిడిదిబిడేనని అంటున్నారు. కోచ్‌కే షాక్ ఇచ్చాడంటే ఏ రేంజ్‌లో సన్నద్ధమవుతున్నాడో అర్థం అవుతోందని, ఇది కదా బుమ్రా నుంచి కావాల్సింది అని కామెంట్స్ చేస్తున్నారు.


ఇవీ చదవండి:

టీమిండియాకు కొత్త టెన్షన్

ఐపీఎల్‌ సమయంలోనే పిఎస్ఎల్

మరిన్ని క్రీడా వార్తల కోసం క్లిక్ చేయండి

Updated Date - Jun 12 , 2025 | 11:06 AM