Mohammed Siraj On Diogo Jota: చనిపోతాడని అనుకోలేదు.. సిరాజ్ ఎమోషనల్ కామెంట్స్!
ABN , Publish Date - Jul 12 , 2025 | 01:21 PM
టీమిండియా పేసర్ మహ్మద్ సిరాజ్ ఎమోషనల్ అయ్యాడు. అతడు చనిపోతాడని అనుకోలేదంటూ భావోద్వేగానికి గురయ్యాడు. అసలేం జరిగిందంటే..!

పోర్చుగల్ ఫుట్‌బాల్ స్టార్ డియోగో జోటా యాక్సిడెంట్‌లో ప్రాణాలు కోల్పోయాడని తెలిసి షాక్‌కు గురయ్యానని మహ్మద్ సిరాజ్ అన్నాడు. అతడి మరణం తనను కలచివేసిందని.. తీవ్ర భావోద్వేగానికి గురైనట్లు టీమిండియా స్టార్ పేసర్ చెప్పాడు. జీవితం ఎవరి అంచనాలకు అందదు అంటూ ఎమోషనల్ అయిపోయాడు సిరాజ్. డియోగో జోటా గురించి మాట్లాడుతూ భావోద్వేగానికి గురయ్యాడు సిరాజ్. పోర్చుగల్‌తో పాటు లివర్‌పూల్ క్లబ్‌కు ఆడుతూ ఎంతో మంది అభిమానాన్ని చూరగొన్నాడు జోటా. ఇటీవల కారు ప్రమాదంలో అతడు చనిపోయాడు. దీంతో ఫుట్‌బాల్ స్టార్ మృతిపై సిరాజ్ పైవిధంగా స్పందించాడు.
లైఫ్‌కు భరోసా లేదు..
‘గత మ్యాచ్ సమయంలో డియోగో జోటా మృతి గురించి తెలిసింది. నేను పోర్చుగల్ అభిమానిని. అతడు అదే జట్టుకు ఆడతాడు. జోటా చనిపోయాడనే వార్త తెలిసి చాలా ఎమోషనల్ అయిపోయా. జీవితం మన ఊహలకు అందనిది. ఎప్పుడైనా ఏదైనా జరగొచ్చు. మనం ఎవరి కోసం పోరాడుతున్నామో తెలియదు. రేపు ఏం జరుగుతుందో చెప్పలేం. లైఫ్‌కు భరోసానే లేదు. జోటా మరణవార్త తెలిసి షాక్ అయ్యా. అదీ కారు ప్రమాదంలో చనిపోయాడని తెలిసి విస్మయానికి లోనయ్యా. మ్యాచ్‌లో వికెట్ తీయగానే అతడికి అంకితం చేశా’ అని సిరాజ్ చెప్పుకొచ్చాడు.
జోటాతో పాటు సోదరుడు కూడా..
డియోగో జోటా జెర్సీ నంబర్ 20 కావడంతో లార్డ్స్ టెస్ట్‌లో 2 వికెట్లు తీశాక తన రెండు వేళ్లతో రెండు వికెట్లు, పక్కన సున్నా చూపిస్తూ అంకితం చేశాడు సిరాజ్. కాగా, జులై 3న జరిగిన కారు ప్రమాదంలో జోటాతో పాటు అతడి సోదరుడు ఆండ్రీ డిసెల్వా కూడా ప్రాణాలు కోల్పోయాడు. స్పెయిన్‌లోని సెర్నాడిల్లాలో ఈ ప్రమాదం చోటుచేసుకుంది. ఈ వార్త తెలిసి క్రీడా ప్రపంచం శోకసంద్రంలో మునిగిపోయింది. ఫుట్‌బాల్‌ను ఎంతగానో ఇష్టపడే సిరాజ్.. జోటాకు నివాళిగా లార్డ్స్ టెస్ట్ తొలి ఇన్నింగ్స్‌లో తీసిన రెండు వికెట్ల ప్రదర్శనను అంకితం ఇచ్చాడు.
ఇవీ చదవండి:
బయటపడ్డ గిల్-సారా రిలేషన్‌షిప్!
సచిన్ వల్ల కానిది బుమ్రా సాధించాడు!
మరిన్ని క్రీడా వార్తల కోసం క్లిక్ చేయండి