Share News

Mitchell Owen: కుర్ర బ్యాటర్ ఊచకోత.. ఏకంగా 11 సిక్సులు.. ఈ బాదుడు చూడాల్సిందే

ABN , Publish Date - Jan 27 , 2025 | 06:09 PM

Mitchell Owen Record Century: ఏదైనా టోర్నమెంట్ ఫైనల్ మ్యాచ్ అనగానే ఆటగాళ్ల మీద తీవ్రమైన ఒత్తిడి పడుతుంది. అందునా చేజింగ్ అంటే ఇంక ప్రెజర్ ఏ రేంజ్‌లో ఉంటుందో ఊహలకు కూడా అందదు. ఆ సిచ్యువేషన్‌లో ఓ కుర్రాడు జూలు విదిల్చి ప్రత్యర్థులపై సింహంలా దూకాడు. విధ్వంసక బ్యాటింగ్‌తో రిజల్ట్‌ను వన్‌సైడ్ చేసేశాడు.

Mitchell Owen: కుర్ర బ్యాటర్ ఊచకోత.. ఏకంగా 11 సిక్సులు.. ఈ బాదుడు చూడాల్సిందే
Mitchell Owen

BBL 2024-25: క్రికెట్ అంటేనే హైటెన్షన్ మధ్య ఆడాల్సిన గేమ్. అభిమానుల అంచనాలు, ప్రత్యర్థుల నుంచి ఎదురయ్యే తీవ్ర పోటీ, అనుక్షణం పెరుగుతూ పోయే ఒత్తిడి.. వీటిన్నింటినీ తట్టుకొని ఆటగాళ్లు తమ బెస్ట్ ఇవ్వడం అంత ఈజీ కాదు. అందునా బిగ్ టోర్నమెంట్స్ ఫైనల్ మ్యాచ్‌లో అత్యుత్తమ ప్రదర్శన ఇవ్వడమంటే మాటలు కాదు. కానీ ఓ యంగ్ బ్యాటర్ ఇది చేసి చూపించాడు. బిగ్‌బాష్ లీగ్‌ ఫైనల్‌లో ఒక కుర్ర ఆటగాడు స్టన్నింగ్ సెంచరీతో తన జట్టుకు కప్‌ను అందించాడు. అతడి ఊచకత చూసి అపోజిషన్ టీమ్‌తో పాటు ఆడియెన్స్ కూడా బిత్తరపోయారు. ఇంతకీ ఆ యంగ్ సెన్సేషన్ ఎవరంటే..


పిచ్చకొట్టుడు కొట్టాడు!

బిగ్‌బాష్ లీగ్ 2024-25లో విజేతగా ఆవిర్భవించింది హోబర్ట్ హరికేన్స్. ప్రతిష్టాత్మక ట్రోఫీని ఆ టీమ్ ఎగరేసుకుపోయింది. సిడ్నీ థండర్స్‌తో జరిగిన ఫైనల్‌లో హోబర్ట్ 7 వికెట్ల తేడాతో విజయఢంకా మోగించింది. ఈ మ్యాచ్‌లో ముందు బ్యాటింగ్ చేసిన సిడ్నీ 20 ఓవర్లలో 7 వికెట్లకు 182 పరుగులు చేసింది. ఆ తర్వాత ఛేజింగ్ స్టార్ట్ చేసిన హోబర్ట్.. 14.1 ఓవర్లలో 3 వికెట్లకు 185 పరుగులు చేసి చాంపియన్‌గా అవతరించింది. 23 ఏళ్ల కుర్ర బ్యాటర్ మిచెల్ ఓవెన్ 42 బంతుల్లో 108 పరుగులతో ఫైనల్‌లో విధ్వంసం సృష్టించాడు. వచ్చిన బౌలర్‌ను వచ్చినట్లు ఉతికి ఆరేశాడు.


ఇదేం ఉతుకుడు!

11 సిక్సులు బాదిన ఓవెన్.. 6 బౌండరీలు కొట్టాడు. 257 స్ట్రైక్ రేట్‌తో బ్యాటింగ్ చేసిన ఈ చిచ్చరపిడుగు భారీ టార్గెట్‌ను ఉఫ్‌మని ఊదేశాడు. అతడు నీళ్లు తాగినంత ఈజీగా స్టేడియంలోకి సిక్సులు తరలించడం, బౌలర్లను పిచ్చ కొట్టుడు కొట్టడం హైలైట్‌గా నిలిచాయి. అతడి ఉతుకుడు చూసి సొంత జట్టు ఆటగాళ్లు కూడా షాక్ అయ్యారు. ఈ ఇన్నింగ్స్ చూసిన నెటిజన్స్.. ఆస్ట్రేలియాకు మరో సిసలైన హిట్టర్ దొరికాడని కామెంట్స్ చేస్తున్నారు. ఇలాంటోడు ఇంటర్నేషనల్ క్రికెట్‌లోకి వస్తే బాగుంటుందని.. అతడ్ని మిస్ అవ్వొద్దంటూ క్రికెట్ ఆస్ట్రేలియాకు సజెషన్స్ చేస్తున్నారు.


ఇవీ చదవండి:

ఒక్క వన్డే ఆడకుండానే చాంపియన్స్ ట్రోఫీకి.. రోహిత్ ధైర్యానికి సెల్యూట్

బుమ్రాకు ప్రతిష్టాత్మక పురస్కారం.. తొలి బౌలర్‌గా రికార్డు

మూడో టీ20కి టీమిండియా ప్లేయింగ్ 11.. విధ్వంసక బ్యాటర్ రీఎంట్రీ

మరిన్ని క్రీడా, తెలుగు వార్తల కోసం క్లిక్ చేయండి

Updated Date - Jan 27 , 2025 | 06:12 PM