Ryan Rickelton: రికల్టన్ మెరుపు ఇన్నింగ్స్.. లక్నో బౌలర్ల తాటతీశాడు
ABN , Publish Date - Apr 27 , 2025 | 04:32 PM
MI vs RCB: ముంబై ఇండియన్స్ ఓపెనర్ ర్యాన్ రికల్టన్ ఆకాశమే హద్దుగా చెలరేగిపోయాడు. లక్నోతో మ్యాచ్‌లో బౌలర్లను ఊచకోత కోశాడతను. భారీ షాట్లతో ఉరుములా ప్రత్యర్థిపై విరుచుకుపడ్డాడు.

లక్నో సూపర్ జెయింట్స్‌తో జరుగుతున్న మ్యాచ్‌లో ముంబై ఇండియన్స్‌కు అదిరిపోయే ఆరంభం లభించింది. కెప్టెన్ రోహిత్ శర్మ (5 బంతుల్లో 12) త్వరగానే ఔట్ అయ్యాడు. కానీ మరో ఓపెనర్ ర్యాన్ రికల్టన్ (32 బంతుల్లో 52) మాత్రమే ఆకాశమే హద్దుగా చెలరేగాడు. 6 బౌండరీలు బాదిన ఈ విధ్వంసక వీరుడు 4 సిక్సులు కూడా కొట్టాడు. 181 స్ట్రైక్ రేట్‌తో బ్యాటింగ్ చేసిన రికల్టన్.. ఫోర్లు, సిక్సుల ద్వారానే 48 పరుగులు రాబట్టాడు. మయాంక్ యాదవ్‌తో పాటు ప్రిన్స్ యాదవ్‌ను ఉతికి ఆరేశాడు. అయితే ఎట్టకేలకు స్పిన్నర్ దిగ్వేష్ రాఠీ బౌలింగ్‌లో ఆయుష్ బదోనికి క్యాచ్ ఇచ్చి ఔట్ అయ్యాడు రికల్టన్.
వరుస బ్రేకులు
రికల్టన్ ఉన్నంత సేపు ముంబై స్కోరు బోర్డు రాకెట్ వేగంతో పరుగులు పెట్టింది. ఓవర్‌కు 10 స్ట్రైక్ రేట్‌తో రయ్‌మంటూ పరుగులు తీసింది. అతడు ఔట్ అయ్యాక మాత్రం ఎంఐ ఇన్నింగ్స్ కుదుపులకు లోనైంది. లక్నో బౌలర్లు వరుసగా వికెట్లు తీస్తూ ఎక్కడికక్కడ బ్రేకులు వేస్తూ పోయారు. ప్రస్తుతం ఆ టీమ్ 14.2 ఓవర్లలో 4 వికెట్లకు 146 పరుగులతో ఉంది. సూర్యకుమార్ యాదవ్ (35 నాటౌట్), హార్దిక్ పాండ్యా (4 నాటౌట్) క్రీజులో ఉన్నారు. వికెట్లు కాపాడుకొని ఆడితే ఈజీగా 200 పరుగుల మార్క్‌ను అందుకునే అవకాశాలు కనిపిస్తున్నాయి. బ్యాటింగ్ పిచ్ కాబట్టి 200 పైచిలుకు స్కోరు చేస్తే గానీ లక్నోను ఆపడం కష్టమే. ఆ టీమ్‌లో పూరన్, మార్ష్ సహా మార్క్రమ్ మంచి ఫామ్‌లో ఉన్నారు. మరి.. ముంబై ఎంత టార్గెట్ సెట్ చేస్తుందో చూడాలి.
ఇవీ చదవండి:
టాస్ నెగ్గిన లక్నో.. కానీ కష్టమే..
మరిన్ని క్రీడా, తెలుగు వార్తల కోసం క్లిక్ చేయండి