Share News

MI vs LSG Toss: టాస్ నెగ్గిన లక్నో.. కానీ కష్టమే..

ABN , Publish Date - Apr 27 , 2025 | 03:05 PM

Today IPL Match: ముంబై-లక్నో మధ్య కీలక పోరు మొదలైపోయింది. టాస్ నెగ్గిన ఎల్‌ఎస్‌జీ కెప్టెన్ రిషబ్ పంత్ ఏం ఎంచుకున్నాడు.. ఎవరు తొలుత బ్యాటింగ్‌కు దిగుతారనేది ఇప్పుడు చూద్దాం..

MI vs LSG Toss: టాస్ నెగ్గిన లక్నో.. కానీ కష్టమే..
MI vs LSG Toss

ప్లేఆఫ్స్ బెర్త్‌లపై మ్యాచ్ మ్యాచ్‌కూ లెక్కలు మారిపోతున్నాయి. పలు టీమ్స్ ఇస్తున్న ట్విస్టులకు ఎవరు నెక్స్ట్ స్టేజ్‌కు క్వాలిఫై అవుతారనేది కచ్చితంగా చెప్పలేని పరిస్థితి. రెండు జట్లు తప్పితే దాదాపుగా అన్ని టీమ్స్ పోటీలో ఉన్నాయి. ఈ నేపథ్యంలో ఈ బెర్త్‌లపై మరింత ఆసక్తిని పెంచేందుకు ముంబై ఇండియన్స్-లక్నో సూపర్ జెయింట్స్ మధ్య ఇంకో పోరు మొదలైంది. ఇందులో టాస్ నెగ్గిన ఎల్‌ఎస్‌జీ కెప్టెన్ రిషబ్ పంత్ తొలుత బౌలింగ్ ఎంచుకున్నాడు. బ్యాటింగ్ పిచ్ అయిన వాంఖడేలో చేజింగ్‌లో ఎక్కువ విజయాలు నమోదయ్యాయి. అయితే సొంత గ్రౌండ్‌లో కండీషన్స్ రోహిత్ అండ్ కోకు కొట్టినపిండే. కాబట్టి 200 పైచిలుకు స్కోరు నమోదు చేసి లక్నోను ఇబ్బంది పెట్టే అవకాశం ఉంది. బలమైన బౌలింగ్ యూనిట్ కలిగిన ఎంఐ విసిరే సవాల్‌ను పంత్ టీమ్ ఎలా ఎదుర్కొంటుందో చూడాలి. కాగా, లక్నో ప్లేయింగ్ ఎలెవన్‌లోకి స్పీడ్‌స్టర్ మయాంక్ యాదవ్ ఎంట్రీ ఇచ్చాడు. 150 కిలోమీటర్ల భీకర పేస్‌తో బౌలింగ్ చేసే మయాంక్.. ముంబై బ్యాటర్లను భయపడతాడేమో చూడాలి.


ఇవీ చదవండి:

ధోనీ నెక్స్ట్ ప్లాన్ ఇదే..

అసమానతలు తగ్గించాలి

మనోళ్ల్లు ఏం చేస్తారో?

మరిన్ని క్రీడా, తెలుగు వార్తల కోసం క్లిక్ చేయండి

Updated Date - Apr 27 , 2025 | 03:23 PM