MI vs LSG Prediction: ప్లేఆఫ్స్ లెక్కలు మార్చేసే ఫైట్.. హార్దిక్-పంత్‌లో ఎవరిది పైచేయి..
ABN , Publish Date - Apr 27 , 2025 | 02:41 PM
Indian Premier League: ఐపీఎల్ లేటెస్ట్ ఎడిషన్‌లో మరో ఆసక్తికర పోరుకు రంగం సిద్ధమైంది. ప్లేఆఫ్స్ బెర్త్‌ల లెక్కలు మార్చేసే ఈ ఫైట్ ముంబై ఇండియన్స్‌కు లక్నో సూపర్ జెయింట్స్‌కు మధ్య జరగనుంది.

ముంబై ఇండియన్స్-లక్నో సూపర్ జెయింట్స్ మధ్య ఇవాళ రసవత్తర పోరు జరగనుంది. వాంఖడే వేదికగా జరిగే ఈ ఫైట్‌లో గెలిచిన టీమ్ ప్లేఆఫ్స్ బెర్త్ కన్ఫర్మ్ చేసుకునే దిశగా మరో ముందడుగు వేస్తుంది. ఈ రెండు జట్లు 9 మ్యాచుల్లో 10 పాయింట్లతో ఉన్నాయి. ఇవాళ్టి పోరులో గెలిస్తే 12 పాయింట్లతో ప్లేఆఫ్స్ రేసులో బిగ్ స్టెప్ వేస్తాయి. కాబట్టి నెగ్గడం ఇరు జట్లకు చాలా కీలకం. ఈ నేపథ్యంలో ఎవరి బలాబలాలు ఎలా ఉన్నాయో ఇప్పుడు చూద్దాం..
బలాలు
ముంబై: వరుస విజయాలతో హార్దిక్ సేన మంచి దూకుడు మీద ఉంది. బ్యాటింగ్‌లో రోహిత్ శర్మ రెచ్చిపోయి ఆడుతున్నాడు. సూర్యకుమార్ యాదవ్ కూడా సూపర్ టచ్‌లో కనిపిస్తున్నాడు. విల్ జాక్స్, పాండ్యా, తిలక్, నమన్ ధీర్ కూడా ఫామ్‌లో ఉన్నారు. అటు బౌలింగ్‌లో బౌల్ట్, బుమ్రా, చాహర్ రాణిస్తున్నారు. కెప్టెన్ హార్దిక్ అవసరమైనప్పుడు బ్రేక్‌త్రూలు అందిస్తున్నాడు.
లక్నో: మార్క్రమ్, మార్ష్, బదోని బ్యాటింగ్‌లో అదరగొడుతున్నారు. బౌలింగ్‌లో దిగ్వేష్, ఆవేశ్ ఖాన్ రాణిస్తున్నారు. ఇతరులు కూడా కాంట్రిబ్యూట్ చేయాల్సిన అవసరం ఉంది.
బలహీనతలు
ముంబై: ర్యాన్ రికల్టన్ నుంచి బిగ్ స్కోర్స్ ఆశిస్తోంది ఎంఐ. విల్ జాక్స్ నుంచి కూడా భారీ ఇన్నింగ్స్ రావాలని కోరుకుంటోంది. సేమ్ టైమ్ హిట్‌మ్యాన్ ఫామ్ కంటిన్యూ అవ్వాలని భావిస్తోంది. బౌలింగ్‌లో బుమ్రా, హార్దిక్ నుంచి మరింత నిలకడ కోరుకుంటోంది.
లక్నో: కెప్టెన్ పంత్ ఈ సీజన్‌లో ఒక్కటంటే ఒక్క మంచి ఇన్నింగ్స్ కూడా ఆడలేదు. పూరన్ లాస్ట్ మ్యాచ్‌లో రాణించలేదు. మార్క్రమ్ బ్యాటింగ్‌తో పాటు స్పిన్ బౌలింగ్‌తోనూ కొన్ని వికెట్లు తీయాలని ఫ్యాన్స్ కోరుకుంటున్నారు. రవి బిష్ణోయ్ మునుపటి రేంజ్‌లో చెలరేగి బౌలింగ్ చేయాల్సిన అవసరం ఉంది.
గత రికార్డులు
ఈ రెండు జట్ల మధ్య ఇప్పటివరకు 7 మ్యాచులు జరిగాయి. ఇందులో 6 మ్యాచుల్లో లక్నోనే నెగ్గింది. ఒక్కదాంట్లో మాత్రమే ఎంఐ విజయకేతనం ఎగురవేసింది.
విన్నింగ్ ప్రిడిక్షన్
గత రికార్డులు లక్నోకు అనుకూలంగా ఉన్నాయి. కానీ ప్రస్తుత ఫామ్, బ్యాటింగ్ బలం, సమకూతంగా ఉన్న బౌలింగ్, వరుస విజయాలు.. ఇలా మిగతా విషయాలన్నీ ముంబై ఎంత స్ట్రాంగ్‌గా ఉందో చెబుతున్నాయి. కాబట్టి వీటన్నింటినీ పరిగణనలోకి తీసుకుంటే.. ఇవాళ్టి మ్యాచ్‌లో పంత్ టీమ్ మీద పాండ్యా సేన విజయం సాధించడం ఖాయం.
ఇవీ చదవండి:
మరిన్ని క్రీడా, తెలుగు వార్తల కోసం క్లిక్ చేయండి