MI vs LSG Target: దంచికొట్టిన ముంబై.. పంత్ సేనకు చేజింగ్ కష్టమే..
ABN , Publish Date - Apr 27 , 2025 | 05:23 PM
IPL 2025: లక్నోతో మ్యాచ్‌లో ముంబై ఇండియన్స్ బ్యాటర్లు అదరగొట్టారు. స్టన్నింగ్ నాక్స్‌తో టీమ్‌కు భారీ స్కోరు అందించారు. మరి.. ఎంఐ ఎంత టార్గెట్ సెట్ చేసిందో ఇప్పుడు చూద్దాం..

లక్నో సూపర్ జెయింట్స్‌తో మ్యాచ్‌లో చెలరేగిపోయింది ముంబై ఇండియన్స్. ఆ టీమ్ బ్యాటర్లు ర్యాన్ రికల్టన్, సూర్యకుమార్ యాదవ్ విధ్వంసక ఇన్నింగ్స్‌లతో రెచ్చిపోయారు. రికల్టన్ 32 బంతుల్లో 6 ఫోర్లు, 4 సిక్సుల సాయంతో 58 పరుగులు చేశాడు. కెప్టెన్ సూర్యకుమార్ 28 బంతుల్లో 4 బౌండరీలు, 4 సిక్సులతో కలిపి 54 పరుగులు బాదాడు. వీళ్లతో పాటు విల్ జాక్స్ (21 బంతుల్లో 29), నమన్ ధీర్ (9 బంతుల్లో 18 నాటౌట్) కూడా మంచి సహకారం అందించడంతో 20 ఓవర్లలో 215 పరుగుల భారీ స్కోరు చేసింది ముంబై.
చేజ్ చేస్తారా..
బ్యాటింగ్‌కు సహకరిస్తున్న పిచ్ మీద ముంబై సెట్ చేసిన 215 పరుగులు టార్గెట్ గట్టిదే. ట్రెంట్ బౌల్ట్, జస్‌ప్రీత్ బుమ్రా, దీపక్ చాహర్, హార్దిక్ పాండ్యా లాంటి టైట్ బౌలింగ్ లైనప్‌ను ఎదుర్కొని ఈ స్కోరును చేజ్ చేయడం అంత ఈజీ కాదు. అయితే మిచెల్ మార్ష్, నికోలస్ పూరన్, ఎయిడెన్ మార్క్రమ్ లాంటి విధ్వంసకారులతో నిండిన లక్నో బ్యాటింగ్‌ను తక్కువ అంచనా వేయడానికి లేదు. వీళ్లు ముగ్గురూ భీకర ఫామ్‌లో ఉన్నారు. ఆయుష్ బదోని, అబ్దుల్ సమద్ కూడా టచ్‌లో కనిపిస్తున్నారు. వీరికి తోడుగా కెప్టెన్ రిషబ్ పంత్ కానీ చెలరేగి ఆడితే 215 చేజ్ చేయొచ్చు. అయితే టాప్-4 బ్యాటర్లలో కనీసం ఇద్దరు భారీ ఇన్నింగ్స్‌లు ఆడాలి. అలాగే ఒకరు లాస్ట్ వరకు క్రీజులో పాతుకుపోతే గానీ ఇది సాధ్యం కాదు.
ఇవీ చదవండి:
టాస్ నెగ్గిన లక్నో.. కానీ కష్టమే..
మరిన్ని క్రీడా, తెలుగు వార్తల కోసం క్లిక్ చేయండి