Share News

Legend 90 League: కివీస్ లెజెండ్ ఊచకోత.. 49 బంతుల్లో 160 రన్స్.. ఇదేం బాదుడు సామి

ABN , Publish Date - Feb 11 , 2025 | 11:49 AM

Martin Guptill: న్యూజిలాండ్ దిగ్గజ ఆటగాడు మార్టిన్ గప్తిల్ విధ్వంసక ఇన్నింగ్స్‌తో అందరి దృష్టిని ఆకర్షించాడు. 49 బంతుల్లోనే 160 పరుగులు బాది బౌలర్లకు ముచ్చెమటలు పట్టించాడు.

Legend 90 League: కివీస్ లెజెండ్ ఊచకోత.. 49 బంతుల్లో 160 రన్స్.. ఇదేం బాదుడు సామి
Martin Guptill

న్యూజిలాండ్ లెజెండ్ మార్టిన్ గప్తిల్ సంచలన ఇన్నింగ్స్‌తో మరోసారి అంతా తన గురించి మాట్లాడుకునేలా చేశాడు. 3 ఏళ్ల కిందే ఇంటర్నేషనల్ క్రికెట్‌ నుంచి సన్యాసం తీసుకున్న ఈ పించ్ హిట్టర్.. లెజెండ్ 90 లీగ్‌తో మరోమారు వార్తల్లో నిలిచాడు. ఛత్తీస్‌గఢ్ వారియర్స్ తరఫున బరిలోకి దిగిన గప్తిల్.. బిగ్ బాయ్స్ ఉనికరీతో జరిగిన మ్యాచ్‌లో 49 బంతుల్లో ఏకంగా 160 పరుగులు బాదాడు. 21 బంతుల్లోనే హాఫ్ సెంచరీని చేరుకున్న కివీస్ మాజీ స్టార్.. ఆ తర్వాత 28 బంతుల్లో ఏకంగా 110 పరుగులు బాదాడు.


వాటే పార్ట్‌నర్‌షిప్!

ఇషాన్ మల్హోత్రా వేసిన ఇన్నింగ్స్‌ 12వ ఓవర్‌లో 29 పరుగులు పిండుకున్నాడు గప్తిల్. 34 బంతుల్లోనే సెంచరీ మార్క్‌ను అందుకున్న విధ్వంసక బ్యాటర్.. తర్వాతి 13 బంతుల్లో మరో 50 పరుగులు బాదేశాడు. లెజెండ్ 90 లీగ్‌లో గప్తిల్‌కు ఇదే అత్యధిక వ్యక్తిగత స్కోరు కావడం గమనార్హం. ఈ ఇన్నింగ్స్‌లో 12 బౌండరీలతో పాటు ఏకంగా 16 సిక్సులు బాదాడతను. అతడి స్ట్రైక్ రేట్ 326.53గా ఉండటం విశేషం. మరో ఎండ్‌లో రిషి ధవన్ 42 బంతుల్లో 76 పరుగుల నాక్‌తో గప్తిల్‌కు మంచి సహకారం అందించాడు. వీళ్లిద్దరూ కలసి 15 ఓవర్లలో 240 పరుగుల భాగస్వామ్యాన్ని జోడించారు. ఆ తర్వాత చేజింగ్‌కు దిగిన బిగ్ బాయ్స్ ఉనికరి జట్టు ఓవర్లన్నీ ఆడి 4 వికెట్లకు 151 పరుగులు మాత్రమే చేయగలిగింది. కాగా, గప్తిల్ బ్యాటింగ్ చూసిన నెటిజన్స్.. రిటైర్మెంట్ తర్వాత కూడా ఈ రేంజ్‌లో చెలరేగి ఆడటం మామూలు విషయం కాదని.. నువ్వు గ్రేట్ బాస్ అని మెచ్చుకుంటున్నారు.


ఇదీ చదవండి:

సచిన్ క్రేజీ రికార్డుపై కన్నేసిన రోహిత్.. చరిత్రకు అడుగు దూరం

టీమిండియా స్టార్లకు డేంజర్.. గంభీర్ పిచ్చికి బలవడం ఖాయం

నేనేం చేయాలో నాకు తెలుసు.. వాళ్లకు ఇచ్చిపడేసిన రోహిత్

మరిన్ని క్రీడా, తెలుగు వార్తల కోసం క్లిక్ చేయండి

Updated Date - Feb 11 , 2025 | 11:49 AM