Share News

Gujarat Titans: గుజరాత్‌కు గట్టి షాక్.. మరో తోపు ప్లేయర్ దూరం

ABN , Publish Date - Apr 12 , 2025 | 02:26 PM

Today IPL Match: ఐపీఎల్ తాజా ఎడిషన్‌లో వరుస విజయాలతో రచ్చ చేస్తోంది గుజరాత్ టైటాన్స్. ఆ టీమ్ పట్టిందల్లా బంగారం అవుతోంది. ఈ తరుణంలో గిల్ సేనకు అనూహ్యంగా ఎదురుదెబ్బ తగిలింది.

Gujarat Titans: గుజరాత్‌కు గట్టి షాక్.. మరో తోపు ప్లేయర్ దూరం
Gujarat Titans

ఐపీఎల్-2025లో గుజరాత్ టైటాన్స్ జట్టు హవా నడుస్తోంది. వరుస విజయాలతో టేబుల్ టాపర్‌గా కంటిన్యూ అవుతోంది గిల్ సేన. ఎదురొచ్చిన ప్రతి జట్టును బుల్డోజర్‌లా తొక్కుకుంటూ పోతోంది జీటీ. ఉన్న తక్కువ వనరులతోనే బెస్ట్ ఎఫర్ట్స్ పెట్టి విజయాల మోత మోగిస్తోంది. ఇదే జోరులో మరిన్ని మ్యాచుల్లో నెగ్గి ప్లేఆఫ్స్ బెర్త్‌ను ఖాయం చేసుకోవాలని చూస్తోంది. ఈ తరుణంలో జీటీకి గట్టి షాక్ తగిలింది. ఆ టీమ్ స్టార్ ఆల్‌రౌండర్ గాయం కారణంగా టోర్నమెంట్ నుంచి తప్పుకున్నాడు. మరి.. క్యాష్ రిచ్ లీగ్ నుంచి తప్పుకున్న ఆ జీటీ ప్లేయర్ ఎవరో ఇప్పుడు చూద్దాం..


బిగ్ చాలెంజ్

గుజరాత్ టైటాన్స్ ఆల్‌రౌండర్ గ్లెన్ ఫిలిప్స్ ఐపీఎల్ మధ్యలో నుంచి తప్పుకున్నాడు. ఏప్రిల్ 6వ తేదీన సన్‌రైజర్స్ హైదరాబాద్‌తో మ్యాచ్‌లో ఫీల్డింగ్ చేస్తూ గాయపడ్డాడు కివీస్ స్టార్. దీంతో ఇవాళ లక్నో సూపర్ జెయింట్స్‌తో ఇవాళ జరిగే మ్యాచ్‌లో అతడు ఆడతాడా.. లేదా.. అనేది అనుమానంగా మారింది. ఎట్టకేలకు మ్యాచ్‌కు ముందు దీనిపై జీటీ టీమ్ మేనేజ్‌మెంట్ క్లారిటీ ఇచ్చింది. ఫిలిప్స్ టోర్నమెంట్ మొత్తానికి దూరమయ్యాడని అధికారిక ప్రకటన చేసింది. స్టార్ ఆల్‌రౌండర్ దూరమైన నేపథ్యంలో అతడి స్థానంలో ఎవర్ని భర్తీ చేస్తారో చూడాలి. కాగా, ఇప్పటికే స్పీడ్‌స్టర్ కగిసో రబాడ జీటీకి దూరమయ్యాడు. ఇప్పుడు ఫిలిప్స్ కూడా తప్పుకోవడంతో సుదీర్ఘ టోర్నమెంట్‌లో గిల్ సేనకు మున్ముందు వీళ్ల లోటును భర్తీ చేయడం కష్టం కానుంది. ఈ సవాల్‌ను జీటీ ఎలా ఎదుర్కొంటుందో చూడాలి.


ఇవీ చదవండి:

విక్టరీ కొట్టేదెవరు.. వెనుదిరిగేదెవరు

బచ్చా ప్లేయర్ కాళ్లు మొక్కిన బ్రావో

ధోని పరువు తీసిన కేకేఆర్

మరిన్ని క్రీడా, తెలుగు వార్తల కోసం క్లిక్ చేయండి

Updated Date - Apr 12 , 2025 | 02:26 PM