Cricket In 2028 Olympics: ఒలింపిక్స్‌లో క్రికెట్.. ఆ 6 జట్లకే ఆడే చాన్స్.. గట్టి షాకే
ABN , Publish Date - Apr 10 , 2025 | 11:03 AM
IOC: ఒలింపిక్స్‌లో క్రికెట్ ఉండాలనేది చాలా మంది స్పోర్ట్స్ లవర్స్ డ్రీమ్. ఎట్టకేలకు ఇది త్వరలో నిజం కానుంది. లాస్ ఏంజిల్స్ ఒలింపిక్స్‌లో ఈ కోరిక నెరవేరనుంది. అయితే విశ్వక్రీడల్లో క్రికెట్ మ్యాచుల నిర్వహణలో ఓ కొత్త చిక్కు వచ్చి పడింది. అదేంటో ఇప్పుడు చూద్దాం..

ప్రపంచ క్రీడా సంబురమైన ఒలింపిక్స్‌లో ఎన్నో రకాల గేమ్స్ ఉన్నాయి. అయితే ఎంతో పాపులారిటీ, క్రేజ్ కలిగిన క్రికెట్ మాత్రం విశ్వక్రీడల్లో కనిపించదు. దీంతో ఒలింపిక్స్‌లో జెంటిల్మన్ గేమ్ ఉంటే అదిరిపోతుందని చాలా మంది స్పోర్ట్స్ లవర్స్ కోరుకున్నారు. ఎట్టకేలకు ఆ కల నెరవేరనుంది. లాస్ ఏంజిల్స్ ఆతిథ్యం ఇవ్వనున్న ఒలింపిక్స్-2028లో క్రికెట్‌ను చేరుస్తున్నారు. అయితే ఇక్కడే ఓ ట్విస్ట్ ఇచ్చింది అంతర్జాతీయ ఒలింపిక్ సంఘం (ఐవోసీ). మెగా టోర్నమెంట్‌లో ఆడే జట్ల విషయంలో మెలిక పెట్టింది. మరి.. ఐవోసీ తాజా ప్రకటనలో ఏం చెప్పిందో ఇప్పుడు చూద్దాం..
విమెన్ టీమ్స్ కూడా..
128 ఏళ్ల సుదీర్ఘ నిరీక్షణ తర్వాత ఒలింపిక్స్‌లో క్రికెట్ భాగం కానుంది. మెన్స్‌తో పాటు విమెన్స్ టీమ్స్ కూడా లాస్ ఏంజిల్స్ ఒలింపిక్స్-2028లో పోటీపడనున్నాయి. ఇద్దరికీ వేర్వేరు ఈవెంట్స్ నిర్వహిస్తారు. అయితే కేవలం ఆరేసి జట్లు మాత్రమే పాల్గొంటాయని స్పష్టం చేసింది ఐవోసీ. పురుషుల ఈవెంట్స్‌లో 6 జట్లు, మహిళల ఈవెంట్స్‌లో 6 జట్లు మెడల్స్ కోసం పోటీపడతాయని క్లారిటీ ఇచ్చింది. మొత్తంగా ప్రతి ఈవెంట్‌లో 90 మంది చొప్పున ఆటగాళ్లు పాల్గొంటారని తెలిపింది. టీ20 ఫార్మాట్‌లో మ్యాచులు నిర్వహిస్తామని అంతర్జాతీయ ఒలింపిక్ సంఘం పేర్కొంది.
పాక్‌కు ఝలక్
ఒలింపిక్స్‌లో పాల్గొనే జట్లు, ఆటగాళ్లు, ఫార్మాట్ తదితర విషయాలపై క్లారిటీ ఇచ్చిన ఐవోసీ.. క్వాలిఫికేషన్ గురించి మాత్రం స్పష్టత ఇవ్వలేదు. మెగా టోర్నమెంట్‌కు ఇంకా చాలా టైమ్ ఉంది. కాబట్టి ఆ వివరాలు తదుపరి వెల్లడించే అవకాశం ఉంది. అయితే టోర్నమెంట్‌కు ఆతిథ్యం ఇస్తున్నందున యూఎస్‌ఏ జట్టు ఎలాగూ నేరుగా అర్హత సాధిస్తుంది. దీంతో మిగిలిన 5 జట్లు ఏవో తేలాల్సి ఉంది. ఐసీసీ ర్యాంకింగ్స్‌లో టాప్-5లో ఉన్న జట్లే క్వాలిఫై అవుతాయని వినిపిస్తోంది. అదే నిజమైతే 7వ ర్యాంక్‌లో ఉన్న దాయాది పాకిస్థాన్‌కు ఒలింపిక్స్ చాన్స్ మిస్ అవడం ఖాయం. కాగా, వచ్చే ఒలింపిక్స్‌లో క్రికెట్‌తో పాటు బేస్‌బాల్/సాఫ్ట్‌బాల్, ఫ్లాగ్ ఫుట్‌బాల్, లాక్రోస్ (సిక్సెస్), స్క్వాష్ లాంటి ఇతర ఆటల్ని కొత్తగా చేర్చారు.
ఇవీ చదవండి:
మరిన్ని క్రీడా, తెలుగు వార్తల కోసం క్లిక్ చేయండి