Kavya Maran: మనసులు గెలుచుకున్న కావ్యా మారన్.. ఒక్క కామెంట్‌తో..!
ABN , Publish Date - Jul 01 , 2025 | 12:29 PM
సన్‌రైజర్స్ కో-ఓనర్ కావ్యా మారన్ మరోమారు అభిమానుల మనసులు గెలుచుకున్నారు. ఒక్క కామెంట్‌తో ఫ్యాన్స్ హృదయాలు దోచుకున్నారు. ఇంతకీ ఆమె ఏమన్నారంటే..

సన్‌రైజర్స్ హైదరాబాద్ మ్యాచ్ ఉంటే చాలు.. స్టేడియాల్లో వాలిపోతుంటారు కో-ఓనర్ కావ్యా మారన్. హైదరాబాద్ అనే కాదు.. ఎస్ఆర్‌హెచ్ మ్యాచ్ ఎక్కడ జరిగినా ఆమె తెగ సందడి చేస్తుంటారు. చప్పట్లు కొడుతూ, ఎగురుతూ, గెంతుతూ ఆరెంజ్ ఆర్మీ ప్లేయర్లను ఆమె ప్రోత్సహిస్తుంటారు. బౌండరీలు, సిక్సులు కొట్టినా.. వికెట్లు తీసినా ఫుల్ ఎంజాయ్ చేస్తుంటారు. అయితే ఈ క్రమంలో ఆమె ఇచ్చే కొన్ని ఎక్స్‌ప్రెషన్స్ సోషల్ మీడియాలో మీమ్ మెటీరియల్‌గా మారి వైరల్ అవుతున్నాయి. దీనిపై తాజాగా స్పందించారు కావ్యా పాప. ఇంతకీ ఆమె ఏమన్నారంటే..
వదలని కెమెరాలు..
‘సన్‌రైజర్స్ బరిలోకి దిగితే ప్రోత్సహించాల్సిన బాధ్యత నా మీద ఉంటుంది. నేను అదే చేస్తుంటా. ఈ క్రమంలో నేను ఎలా స్పందించినా అది మ్యాచ్‌లో భాగంగానే చూడాలి. హైదరాబాద్‌లో మ్యాచ్ జరిగితే నేను పెద్దగా చేయడానికేమీ ఉండదు. అక్కడ కూర్చొని ఉండటం తప్పితే ఏమీ చేయను. అహ్మదాబాద్, చెన్నై లేదా ఏ ఇతర వేదికల్లో మ్యాచ్ జరిగితే నేను దూరంగా ఎక్కడో బాక్స్‌లో కూర్చుంటా. అయినా కెమెరామెన్ నన్ను వదలడు. ఎలాగోలా కనిపెట్టి కెమెరాలో బంధిస్తాడు. అలా నేను ఎక్కడ ఉన్నా, ఏం చేసినా మీమ్స్ రూపంలో బయటకు వస్తున్నాయి’ అని కావ్యా మారన్ చెప్పుకొచ్చింది.
ఫ్యాన్ గర్ల్..
సన్‌రైజర్స్ మ్యాచ్ ఉంటే తాను ఎంతో ఉద్వేగానికి గురవుతానని తెలిపింది కావ్యా పాప. జట్టు అంటే తనకు వల్లమాలిన అభిమానమని పేర్కొంది. టీమ్ బాగు కోసం ఏం చేయడానికైనా తాను సిద్ధమని స్పష్టం చేసింది కావ్యా మారన్. జట్టు గెలుపు కోసం అహర్నిషలు శ్రమిస్తామని.. అందుకే సన్‌రైజర్స్ గెలుపోటములు తనను తీవ్ర భావోద్వేగానికి గురిచేస్తాయంటూ ఎమోషనల్ అయిపోయింది కో-ఓనర్. ఈ మాటలు విన్న నెటిజన్స్.. టీమ్ మీద ఇంత ప్రేమ ఉండటం, జట్టుతో ఇంతగా అటాచ్ అవడం గొప్ప విషయమని మెచ్చుకుంటున్నారు. మీమ్స్ లాంటివి వచ్చినా సరదాగా తీసుకుంటూ, ఎస్‌ఆర్‌హెచ్ ఆడే ప్రతి మ్యాచ్‌కు హాజరవుతూ, ఆటగాళ్లను వెన్నుతట్టే ఇలాంటి యజమాని ఉండటం సూపర్ అని ప్రశంసిస్తున్నారు. కావ్యా మారన్ సన్‌రైజర్స్‌కు ఓనర్ మాత్రమే కాదని.. ఆ జట్టుకు ఆమె బిగ్ ఫ్యాన్ గర్ల్ అని మరికొందరు నెటిజన్స్ కామెంట్స్ చేస్తున్నారు.
ఇవీ చదవండి:
ట్రేడ్‌మార్క్‌గా కెప్టెన్ కూల్
మరిన్ని క్రీడా వార్తల కోసం క్లిక్ చేయండి