Bumrah-Sanjana: నా కొడుకు జోలికొస్తే వదలను.. బుమ్రా భార్య వార్నింగ్
ABN , Publish Date - Apr 28 , 2025 | 02:52 PM
Mumbai Indians: ముంబై ఇండియన్స్ పేసుగుర్రం జస్‌ప్రీత్ బుమ్రా ఐపీఎల్‌లో అదరగొడుతున్నాడు. గాయం కారణంగా ఈ సీజన్ ఆరంభంలో కొన్ని మ్యాచులకు దూరమయ్యాడు బుమ్రా. అయితే లేట్‌గా ఎంట్రీ ఇచ్చినా ప్రత్యర్థి బ్యాటర్లకు పోయిస్తున్నాడు. ఈ తరుణంలో అతడి ఫ్యామిలీ ట్రోలింగ్‌కు గురవడం చర్చనీయాంశంగా మారింది.

సెలెబ్రిటీల మీద ట్రోలింగ్ ఈ రోజుల్లో కామన్ అయిపోయింది. అయితే స్టార్ల కెరీర్ మీదే గాక వాళ్ల పర్సనల్ లైఫ్ పైన, అలాగే ఫ్యామిలీస్‌ను కూడా కొందరు టార్గెట్ చేసుకొని నెగెటివ్ కామెంట్స్ చేయడం పెరిగిపోతోంది. టీమిండియా పేసుగుర్రం జస్‌ప్రీత్ బుమ్రా ఫ్యామిలీ కూడా ఇలాగే ట్రోలింగ్ బారిన పడింది. బుమ్రా-సంజనాల ముద్దుల తనయుడు అంగద్‌ను లక్ష్యంగా చేసుకొని సోషల్ మీడియాలో కొందరు భారీగా ట్రోల్ చేశారు. దీనిపై సంజన సీరియస్ అయింది. తన కొడుకు జోలికొస్తే ఊరుకోనని మాస్ వార్నింగ్ ఇచ్చింది. అసలు ఏమైందో ఇప్పుడు చూద్దాం..
స్ట్రాంగ్ రియాక్షన్
లక్నో సూపర్ జెయింట్స్-ముంబై ఇండియన్స్ మధ్య వాంఖడే వేదికగా ఏప్రిల్ 27న మ్యాచ్ జరిగింది. ఇందులో 54 పరుగుల తేడాతో నెగ్గింది ముంబై. 4 వికెట్లు పడగొట్టిన బుమ్రా.. తన టీమ్ విజయంలో కీలక పాత్ర పోషించాడు. అయితే ఈ మ్యాచ్‌కు హాజరైన అతడి సతీమణి సంజన, కొడుకు అంగద్‌పై కెమెరాలు ఎక్కువగా ఫోకస్ చేశాయి. వాళ్లిద్దరి ఫొటోలు సోషల్ మీడియాలో బాగా వైరల్ అయ్యాయి. అంగద్‌ను లక్ష్యంగా చేసుకొని కొందరు నెటిజన్స్ నెగెటివ్ కామెంట్స్, ట్రోల్స్ చేయడం మొదలుపెట్టారు. దీంతో హర్ట్ అయిన సంజనా గణేషన్ ఇన్‌స్టాగ్రామ్‌లో ఈ విషయంపై ఘాటుగా రియాక్ట్ అయింది. నా కొడుకు ఉన్నది మిమ్మల్ని ఎంటర్‌టైన్ చేయడానికి కాదంటూ ట్రోలర్స్‌కు గట్టిగా ఇచ్చిపడేసింది బుమ్రా సతీమణి.
మీకేం తెలుసు..
అంగద్‌ను సోషల్ మీడియాకు దూరంగా ఉంచేందుకు బుమ్రాతో కలసి తాను చాలా ప్రయత్నిస్తున్నానని సంజన తెలిపింది. సోషల్ మీడియా అంతా చెత్తతో నిండిపోయిందని సీరియస్ అయింది. కొడుకును తీసుకొని స్టేడియానికి వస్తే కెమెరాల ఫోకస్ తమ మీదే ఉంటుందని తెలుసునని.. కానీ బుమ్రాకు సపోర్ట్ చేయాల్సిన అవసరం ఉందని అర్థం చేసుకోవాలని కోరింది. అంతేగానీ సోషల్ మీడియాలో వైరల్ కంటెంట్‌గా మారే ఉద్దేశం తమకు లేదని కుండబద్దలు కొట్టింది సంజన. అంగద్ గురించి కామెంట్స్ చేసేవారికి అతడి గురించి ఏమీ తెలియదని స్పష్టం చేసింది.
ఇవీ చదవండి:
ఆ విషయాన్ని మర్చిపోతున్నారు:కోహ్లీ
మరిన్ని క్రీడా, తెలుగు వార్తల కోసం క్లిక్ చేయండి