Share News

Jasprit Bumrah: బుమ్రా లేకుండానే బరిలోకి.. ఒక్క సెషన్‌తో ఫుల్ క్లారిటీ!

ABN , Publish Date - Jun 27 , 2025 | 07:28 PM

టీమిండియా ఏస్ పేసర్ జస్‌ప్రీత్ బుమ్రా ఎడ్జ్‌బాస్టన్ టెస్ట్‌లో ఆడతాడా? లేదా? అని భారీగా చర్చలు జరుగుతున్నాయి. ఎట్టకేలకు దీనిపై ఓ క్లారిటీ వచ్చేసింది.

Jasprit Bumrah: బుమ్రా లేకుండానే బరిలోకి.. ఒక్క సెషన్‌తో ఫుల్ క్లారిటీ!
Jasprit Bumrah

లీడ్స్ టెస్ట్‌లో భారత జట్టు ఓటమి అభిమానులను తీవ్రంగా నిరాశపర్చింది. ఒకటి, రెండు కాదు.. టీమిండియా నుంచి ఏకంగా 5 సెంచరీలు నమోదయ్యాయి. అయినా ఆ పోరులో గిల్ సేనకు పరాజయం తప్పలేదు. దీంతో ఈ సిరీస్ పోయినట్లేనా అనే అనుమానాలు వస్తున్నాయి. ఇంత బాగా ఆడినా గెలవకపోతే ఎలా అనే కామెంట్స్ వినిపిస్తున్నాయి. ఇదే తరుణంలో ఎడ్జ్‌బాస్టన్ వేదికగా జరిగే రెండో టెస్ట్‌లో పేసుగుర్రం జస్‌ప్రీత్‌ బుమ్రాను ఆడిస్తారా? లేదా? అనే ప్రశ్నలు తలెత్తుతున్నాయి. జోరుగా సాగుతున్న ఈ చర్చపై ఎట్టకేలకు కొంత స్పష్టత వచ్చింది. అసలేం జరిగిందంటే..


ఇద్దరూ డుమ్మా..

గాయం నుంచి కోలుకొని ఇటీవలే రీఎంట్రీ ఇచ్చిన బుమ్రా.. ఇంగ్లండ్‌తో పూర్తి సిరీస్ ఆడలేనని ముందే చెప్పేశాడు. సెలెక్టర్లు, టీమ్ మేనేజ్‌మెంట్ అతడ్ని జాగ్రత్తగా వాడుకుంటామని మాట ఇచ్చాయి. కానీ తొలి టెస్ట్‌లో బుమ్రాతో దాదాపుగా 50 ఓవర్లు బౌలింగ్ చేయించారు. దీంతో ఎడ్జ్‌బాస్టన్ టెస్ట్‌లో అతడ్ని ఆడిస్తారా? విశ్రాంతి ఇస్తారా? అనే ప్రశ్నలు తలెత్తుతున్నాయి. ఒకవేళ బుమ్రా ఆడకపోతే అతడి స్థానంలో ఎవర్ని రీప్లేస్ చేస్తారనే చర్చలు ఊపందుకున్నాయి. అయితే మొదటి మ్యాచ్‌లో ఓడినందున బుమ్రాను తప్పక ఆడిస్తారనే కామెంట్స్ కూడా వినిపిస్తున్నాయి. ఈ తరుణంలో శుక్రవారం జరిగిన భారత ప్రాక్టీస్ సెషన్‌లో బుమ్రా పాల్గొనకపోవడం హాట్ టాపిక్‌గా మారింది. అతడితో పాటు మరో పేసర్ ప్రసిద్ధ్ కృష్ణ కూడా నెట్ సెషన్‌కు రాకపోవడం కొత్త చర్చకు దారితీసింది.


బ్యాట్ పట్టి..

రెండో టెస్ట్‌కు ముందు నిర్వహించిన ప్రాక్టీస్ సెషన్‌లో బుమ్రా-ప్రసిద్ధ్ పాల్గొనలేదని తెలుస్తోంది. వీళ్లిద్దరూ తప్ప మిగతా జట్టు మొత్తం నెట్ సెషన్‌లో చెమటలు చిందించారట. స్పీడ్‌స్టర్ మహ్మద్ సిరాజ్ బౌలింగ్ ప్రాక్టీస్ చేయడమే గాక చాలా సేపు బ్యాటింగ్ సాధన కూడా చేశాడట. పేసర్లు అర్ష్‌దీప్ సింగ్, ఆకాశ్‌దీప్‌తో కోచ్ గంభీర్ ఎక్కువగా బౌలింగ్ చేయించాడట. వీళ్లతో బంతులు వేయించడమే గాక గౌతీ-గిల్ మాట్లాడుతూ కనిపించారని సమాచారం. దీంతో రెండో టెస్ట్‌లో సిరాజ్ ప్రధాన పేసర్‌గా బాధ్యతలు చేపడతాడని.. అర్ష్‌దీప్-ఆకాశ్‌దీప్ టీమ్‌లోకి ఎంట్రీ ఇవ్వడం ఖాయమని వినిపిస్తోంది. ఒక్క ప్రాక్టీస్ సెషన్‌తో బుమ్రా ఆడడనే విషయం చెప్పకనే చెప్పేశారని నెటిజన్స్ అంటున్నారు.


ఇవీ చదవండి:

లక్నో స్టార్‌పై సంచలన ఆరోపణలు

టీమిండియా తిరుగులేని స్కెచ్

ఇది బీచా.. క్రికెట్ స్టేడియమా?

మరిన్ని క్రీడా వార్తల కోసం క్లిక్ చేయండి

Updated Date - Jun 27 , 2025 | 07:33 PM