Share News

Jasprit Bumrah Honours Board: సచిన్ వల్ల కానిది బుమ్రా సాధించాడు.. ఫ్యాన్స్ కాలర్ ఎగరేసే ఫీట్!

ABN , Publish Date - Jul 12 , 2025 | 11:08 AM

టీమిండియా పేసుగుర్రం జస్‌ప్రీత్ బుమ్రా అరుదైన ఘనత సాధించాడు. బ్యాటింగ్ దిగ్గజం సచిన్ టెండూల్కర్ వల్ల కానిది బుమ్రా చేసి చూపించాడు. అదేంటో ఇప్పుడు చూద్దాం..

Jasprit Bumrah Honours Board: సచిన్ వల్ల కానిది బుమ్రా సాధించాడు.. ఫ్యాన్స్ కాలర్ ఎగరేసే ఫీట్!
Jasprit Bumrah

క్రికెట్‌కు పుట్టినిల్లు లాంటి లార్డ్స్‌లో జరిగే టెస్టుల్లో ఏ క్రికెటర్‌ అయినా అదరగొట్టాలనే అనుకుంటారు. రెగ్యులర్ పెర్ఫార్మెన్స్ కంటే కూడా ఇక్కడ మరింతగా రాణించాలని చూస్తారు. సుదీర్ఘ చరిత్ర ఉన్న ఈ స్టేడియంలోని హానర్స్ బోర్డులో తమ పేరు చూసి మురిసిపోవాలని చాలా మంది ప్లేయర్లు కలలు కంటారు. కానీ కొందరు మాత్రమే దీన్ని సాధించగలరు. ఎన్నో రికార్డులకు పాతర పెట్టిన మాస్టర్ బ్లాస్టర్ సచిన్ టెండూల్కర్.. లార్డ్స్‌లో మాత్రం సెంచరీ బాదలేదు. అందుకే హానర్స్ బోర్డులో అతడి పేరు లేదు. అలాంటిది టీమిండియా పేసుగుర్రం జస్‌ప్రీత్ బుమ్రా ఇది చేసి చూపించాడు. సచిన్ వల్ల కానిది బుమ్రా సాధించాడు.


వాటే ఫీట్..

ఐదు టెస్టుల సిరీస్‌లో భాగంగా ఇంగ్లండ్‌తో లార్డ్స్ వేదికగా జరుగుతున్న మూడో టెస్టులో 5 వికెట్లు పడగొట్టాడు బుమ్రా. సెంచరీ హీరో జో రూట్ (104), హ్యారీ బ్రూక్‌ (11), కెప్టెన్ బెన్ స్టోక్స్ (44)తో పాటు క్రిస్ వోక్స్ (0), జోఫ్రా ఆర్చర్ (4)ను ఔట్ చేశాడు బుమ్రా. 5 వికెట్ హాల్ పూర్తవడంతో లార్డ్స్ హానర్ బోర్డులో భారత పేసర్ పేరును చేర్చారు. ప్రస్తుతానికి తాత్కాలికంగా అతడి పేరును బోర్డుపై రాశారు. త్వరలో అతడి పేరును అధికారికంగా చేరుస్తారు. ఈ విషయం తెలిసి బుమ్రా అభిమానులతో పాటు టీమిండియా ఫ్యాన్స్ సంతోషంలో మునిగిపోయారు. వాటే ఫీట్ అంటూ అతడ్ని ప్రశంసల్లో ముంచెత్తుతున్నారు.

Jasprit Bumrah 5 Wicket Haul


దిగ్గజాల సరసన..

లార్డ్స్‌లో జరిగే టెస్టు మ్యాచుల్లో సెంచరీ కొట్టినా, 5 వికెట్లు పడగొట్టినా హానర్స్ బోర్డులో వారి పేర్లను చేరుస్తారు. భారత జట్టు నుంచి వినూ మన్కడ్, దిలీప్ వెంగ్‌సర్కార్, గుండప్ప విశ్వనాథ్, మోహిందర్ అమర్‌నాథ్, సౌరవ్ గంగూలీ, అజిత్ అగార్కర్, రాహుల్ ద్రవిడ్, అజింక్యా రహానె, కేఎల్ రాహుల్, రవిశాస్త్రి హానర్స్ బోర్డులో చోటు దక్కించుకున్నారు. టీమిండియా నుంచి బౌలర్ల విషయానికి వస్తే.. మహ్మద్ నిస్సార్, లాధా అమర్ సింగ్, లాలా అమర్‌నాథ్, వినూ మన్కడ్, రమాకాంత్ దేశాయ్, బిషన్ సింగ్ బేడీ, కపిల్ దేవ్, చేతన్ శర్మ, వెంకటేశ్ ప్రసాద్, ఆర్పీ సింగ్, ప్రవీణ్ కుమార్, భువనేశ్వర్ కుమార్, ఇషాంత్ శర్మ హానర్స్ బోర్డులో స్థానం సంపాదించారు. మొత్తంగా భారత్ నుంచి 14 మంది బౌలర్లు, 10 మంది బ్యాటర్లు ఈ అరుదైన ఘనత సాధించారు. ఇప్పుడు వీళ్ల సరసన బుమ్రా చేరాడు.


ఇవీ చదవండి:

గిల్ క్రేజీ రికార్డ్!

డబ్బుల కోసమే ఇలా చేస్తున్నారు!

విహార యాత్ర కోసం రాలేదు

మరిన్ని క్రీడా వార్తల కోసం క్లిక్ చేయండి

Updated Date - Jul 12 , 2025 | 11:12 AM