LSG vs RR Target: అదరగొట్టిన పంత్ సేన.. చేజింగ్ ఈజీ కాదు
ABN , Publish Date - Apr 19 , 2025 | 09:43 PM
Indian Premier League: రాజస్థాన్‌తో జరుగుతున్న మ్యాచ్‌లో లక్నో సూపర్ జెయింట్స్ అదరగొట్టింది. నిలకడైన బ్యాటింగ్‌తో మంచి లక్ష్యాన్ని సెట్ చేసింది. మరి.. లక్నో బ్యాటింగ్ ఎలా సాగిందో ఇప్పుడు చూద్దాం..

రాజస్థాన్ రాయల్స్‌తో మ్యాచ్‌లో లక్నో సూపర్ జెయింట్స్ బ్యాటర్లు అదరగొట్టారు. ఆరంభంలో తడబడినా ఆ తర్వాత కోలుకున్నారు ఎల్‌ఎస్‌జీ బ్యాటర్లు. ఒక దశలో 54 పరుగులకే ముగ్గురు పెవిలియన్ చేరడంతో లక్నో ఇన్నింగ్స్ కుదుపునకు లోనైంది. కానీ ఎయిడెన్ మార్క్రమ్ (45 బంతుల్లో 66), ఆయుష్ బదోని (34 బంతుల్లో 50) టీమ్‌ను ఆదుకున్నారు. ఇద్దరూ కలసి నాలుగో వికెట్‌కు 76 పరుగులు జోడించారు. మార్క్రమ్ సిక్సులతో విజృంభిస్తే.. బదోని బౌండరీల మోత మోగించాడు. ఆఖర్లో అబ్దుల్ సమద్ (10 బంతుల్లో 30) హిట్టింగ్‌కు దిగడంతో 20 ఓవర్లలో 180 పరుగులు చేసింది లక్నో.
ఈజీ కాదు
సవాయ్ మాన్‌సింగ్ స్టేడియంలో 180 మంచి స్కోరే. బౌలింగ్ బాగా చేసి, ఆరంభంలో వికెట్లు తీయగలిగితే మ్యాచ్‌పై పట్టు బిగించొచ్చు. అయితే అందుకు లక్నో బౌలర్లంతా కలసికట్టుగా రాణించాలి. శార్దూల్ ఠాకూర్‌కు తోడుగా ఆవేశ్ ఖాన్, ప్రిన్స్ యాదవ్, దిగ్వేష్ రాఠి, రవి బిష్ణోయ్ బౌలింగ్‌లో అదరగొట్టాలి. జైస్వాల్‌తో పాటు రియాన్ పరాగ్, ధృవ్ జురెల్, హిట్మెయిర్‌ను టార్గెట్ చేసి వెనక్కి పంపాలి. టాప్ బ్యాటర్లను ఔట్ చేస్తే మ్యాచ్ లక్నోదే. కానీ కొట్టిన పిండి లాంటి సవాయ్ మాన్‌సింగ్ పిచ్‌పై రాజస్థాన్‌ను పంత్ సేన ఎంతవరకు నిరోధించగలదు అనేది చూడాలి.
ఇవీ చదవండి:
జీటీ దెబ్బకు పాయింట్స్ టేబుల్ షేక్
మరిన్ని క్రీడా, తెలుగు వార్తల కోసం క్లిక్ చేయండి