Share News

Jasprit Bumrah: బ్యాటర్లకు నిద్రలేకుండా చేస్తున్నాడు.. కమ్‌బ్యాక్ అంటే ఇది!

ABN , Publish Date - May 31 , 2025 | 09:01 PM

ఈ సీజన్‌లో ముంబై ఇండియన్స్ సక్సెస్‌లో కీలకపాత్ర పోషిస్తున్నాడు పేసర్ జస్‌ప్రీత్ బుమ్రా. వికెట్ల మీద వికెట్లు తీస్తూ ప్రత్యర్థి బ్యాటర్లను గడగడలాడిస్తున్నాడు.

Jasprit Bumrah: బ్యాటర్లకు నిద్రలేకుండా చేస్తున్నాడు.. కమ్‌బ్యాక్ అంటే ఇది!
Jasprit Bumrah

జస్‌ప్రీత్ బుమ్రా.. ఇప్పుడు ఇదే పేరును జపిస్తున్నారు ముంబై ఇండియన్స్ అభిమానులు. ముంచినా, తేల్చినా అతడేనని అంటున్నారు. ఇంకో కప్పు అందించమని కోరుతున్నారు. దీనికి కారణం.. ఐపీఎల్-2025లో బుమ్రా ఆటతీరు అనే చెప్పాలి. ఈ సీజన్ ఆరంభంలో ముంబై వరుస పరాభవాలతో డీలాపడింది. అయితే వెన్నుగాయం నుంచి కోలుకొని బుమ్రా రీఎంట్రీ ఇవ్వడంతో ఆ జట్టు రాతే మారిపోయింది. వరుస విజయాలతో ట్రాక్ ఎక్కిన ఎంఐ.. అదే ఊపులో ప్లేఆఫ్స్‌కు అర్హత సాధించింది. ఎలిమినేటర్‌లో గుజరాత్ టైటాన్స్‌ను ఓడించిన హార్దిక్ సేన.. ఇప్పుడు పంజాబ్ కింగ్స్‌తో క్వాలిఫయర్-2 పోరు కోసం సన్నద్ధం అవుతోంది. అయితే అక్కడా బుమ్రానే నమ్ముకుంటున్నారు ఫ్యాన్స్.


ఫైనల్ బెర్త్ పక్కా!

ఈ ఐపీఎల్‌లో బుమ్రా కళ్లుచెదిరే బౌలింగ్‌తో ప్రత్యర్థులను వణికిస్తున్నాడు. ఇప్పటివరకు 11 మ్యాచుల్లో 18 వికెట్లు తీశాడు పేస్ గన్. గాయం నుంచి రీఎంట్రీ ఇచ్చినా అతడి పేస్, లైన్ అండ్ లెంగ్త్, వేరియేషన్స్‌లో ఇసుమంత కూడా మార్పు రాలేదు. బ్యాటర్ల బలహీనతలను లక్ష్యంగా చేసుకొని ముప్పుతిప్పలు పెడుతున్నాడు. ఊహించని బంతులతో వికెట్లు చెల్లాచెదురు చేస్తున్నాడు. బ్యాటర్లకు పీడకలలు ఎలా ఉంటాయో చూపిస్తున్నాడు. నిన్న గుజరాత్‌తో మ్యాచ్‌లో వాషింగ్టన్ సుందర్ (48)ను స్టన్నింగ్ యార్కర్‌తో క్లీన్‌బౌల్డ్ చేశాడు బుమ్రా. ఎంత తోపు బ్యాటర్ అయినా ఈ బాల్‌ను ఎదుర్కోవడం అంత సులువు కాదు. అతడు గనుక ఇదే ఫామ్‌లో ఉంటే పంజాబ్ కింగ్స్‌కు దబిడిదిబిడేనని చెప్పాలి. రోహిత్ శర్మ, సూర్యకుమార్ యాదవ్, జానీ బెయిర్‌స్టో, హార్దిక్ పాండ్యా లాంటి బ్యాటర్లకు తోడుగా బుమ్రా బౌలింగ్‌లో అదరగొడితే ముంబైని ఫైనల్ వెళ్లకుండా ఆపడం కష్టమేనని నెటిజన్స్ అంటున్నారు. కమ్‌బ్యాక్ అదిరింది బాస్ అని పేసుగుర్రాన్ని మెచ్చుకుంటున్నారు.


ఇవీ చదవండి:

హార్దిక్‌తో గొడవపై తేల్చేసిన గిల్!

తిట్టిన నోళ్లే పొగుడుతున్నాయి!

మరిన్ని క్రీడా, తెలుగు వార్తల కోసం క్లిక్ చేయండి

Updated Date - May 31 , 2025 | 09:01 PM