SRH Playoffs Scenario: ప్లేఆఫ్స్ కంటే అదే ముఖ్యం.. ఎస్‌ఆర్‌హెచ్‌కు ఇంత ఓవర్ కాన్ఫిడెన్స్ ఎందుకో..
ABN , Publish Date - Apr 25 , 2025 | 03:09 PM
Indian Premier League: ఈ ఐపీఎల్ సీజన్‌లో సన్‌రైజర్స్ హైదరాబాద్ అంచనాలను అందుకోలేకపోతోంది. వరుస విజయాలతో చెలరేగుతుందని భావిస్తే.. ఓటములతో ప్లేఆఫ్స్ అవకాశాలను సంక్లిష్టం చేసుకుంది. ఈ నేపథ్యంలో ఆ టీమ్ స్టార్ బ్యాటర్ హెన్రిక్ క్లాసెన్ ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేశాడు. ఇంతకీ అతడేం అన్నాడంటే..

ఐపీఎల్-2025ను ఫేవరెట్స్‌గా స్టార్ట్ చేసింది సన్‌రైజర్స్ హైదరాబాద్. గత సీజన్‌లో రన్నరప్‌గా నిలిచిన కాటేరమ్మ కొడుకులు.. ఈసారీ అదే జోష్‌తో ఆడతారని అంతా భావించారు. కానీ అంతా రివర్స్ అయింది. ఇప్పటివరకు ఆడిన 8 మ్యాచుల్లో ఆరింట ఓడి 4 పాయింట్లతో ఎనిమిదో స్థానంలో కొనసాగుతోంది కమిన్స్ సేన. ప్లేఆఫ్స్‌కు చేరాలంటే ఇకపై ఆడే ప్రతి మ్యాచ్‌లోనూ బిగ్ మార్జిన్‌తో నెగ్గాల్సిన పరిస్థితి. ఈ తరుణంలో జట్టు స్టార్ బ్యాటర్ హెన్రిక్ క్లాసెన్ చేసిన వ్యాఖ్యలు వివాదాస్పదంగా మారాయి. ఇంతకీ క్లాసెన్ ఏమన్నాడో ఇప్పుడు చూద్దాం..
అలాగే ఆడతాం
చెన్నై సూపర్ కింగ్స్‌తో చెపాక్ వేదికగా కీలక మ్యాచ్‌కు సిద్ధమవుతోంది సన్‌రైజర్స్. ఈ నేపథ్యంలో క్లాసెన్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. తాము ఒక రకమైన బ్రాండ్ క్రికెట్ ఆడాలని అనుకుంటున్నామని అన్నాడు. ఇంకా దానికే తాము కట్టుబడి ఉన్నామని చెప్పాడు. దీని వల్ల కొన్ని ఓటములు ఎదురైన మాట వాస్తవమేనని.. అయినా తాము అదే ప్లాన్‌ను నమ్ముకొని ముందుకు వెళ్తామని క్లాసెన్ స్పష్టం చేశాడు. ప్లేఆఫ్స్‌కు వెళ్లేందుకు ప్రతి గేమ్‌లో గెలవాల్సిన అవసరం ఉందన్నాడు. బౌలర్లు-బ్యాటర్లు గతంలో చేసిన తప్పుల్ని రిపీట్ కాకుండా చూసుకోవడం, ప్రతి మ్యాచ్‌లోనూ మెరుగవుతూ పోవడం తమకు ముఖ్యమని పేర్కొన్నాడు క్లాసెన్.
ఇలాగైతే కష్టమే..
క్లాసెన్ వ్యాఖ్యలపై సోషల్ మీడియాలో భిన్నాభిప్రాయాలు వ్యక్తం అవుతున్నాయి. కొందరు నెటిజన్స్ అతడ్ని సమర్థిస్తే.. మరికొందరు వ్యతిరేకిస్తున్నారు. దంచుడే దంచుడు అనే అప్రోచ్ అన్ని గ్రౌండ్స్‌లో వర్కౌట్ కాదని అంటున్నారు. అందుకే బౌలింగ్ పిచెస్‌ను తయారు చేసి ఆరెంజ్ ఆర్మీకి ప్రత్యర్థులు చెక్ పెడుతున్నారని నెటిజన్స్ గుర్తుచేస్తున్నారు. క్లాసెన్ అండ్ కోకు ఇంత ఓవర్ కాన్ఫిడెన్స్ అవసరం లేదని సూచిస్తున్నారు. ఇకనైనా బ్యాంగ్ బ్యాంగ్ అప్రోచ్‌ను పక్కనబెట్టి.. మ్యాచ్ సిచ్యువేషన్స్, కండీషన్స్, పిచ్ ప్రవర్తించే తీరును బట్టి గేర్లు మార్చుకుంటూ ఆడాలని సజెషన్ ఇస్తున్నారు. ఓడినా, గెలిచినా ఒకేలా ఆడతామని అనుకుంటే సన్‌రైజర్స్ ప్లేఆఫ్స్ అవకాశాలు గల్లంతయ్యే ప్రమాదం ఉందని హెచ్చరిస్తున్నారు నెటిజన్స్.
ఇవీ చదవండి:
ఐసీసీ టోర్నీల్లో ఇండో-పాక్ ఫైట్ కష్టమే
ప్లేఆఫ్స్ చేరాలంటే ఎవరెన్ని నెగ్గాలి
పాక్ అథ్లెట్‌కు ఆహ్వానం పంపడంపై విమర్శలు
మరిన్ని క్రీడా, తెలుగు వార్తల కోసం క్లిక్ చేయండి