Share News

IPL 2025 Dot Balls: ఐపీఎల్ డాట్ డాల్స్.. వీటితో ఒక అడవినే సృష్టించొచ్చు

ABN , Publish Date - Apr 16 , 2025 | 05:37 PM

IPL Tree Saplings: ఐపీఎల్‌లో రికార్డు స్థాయిలో డాట్ బాల్స్‌ వేస్తున్నారు బౌలర్లు. ఈ డాట్ బాల్స్ అన్నింటినీ కలిపితే ఓ అడవినే సృష్టించొచ్చు. దీని గురించి మరింతగా తెలుసుకుందాం..

IPL 2025 Dot Balls: ఐపీఎల్ డాట్ డాల్స్.. వీటితో ఒక అడవినే సృష్టించొచ్చు
IPL 2025 Dot Balls

ఐపీఎల్ మ్యాచుల స్ట్రీమింగ్ సమయంలో ఓవర్ల స్ట్రిప్‌లో మొక్కల సింబల్స్‌ను గమనించే ఉంటారు. బౌలర్లు డాట్ బాల్స్ వేసిన ప్రతిసారి ఒక మొక్క అదనంగా అక్కడ యాడ్ అవుతుంది. దీంతో అసలు ఈ మొక్కల గోల ఏంటి.. అని చాలా మంది ఆలోచనల్లో పడ్డారు. అయితే దీని వెనుక మంచి ఆలోచన దాగి ఉంది. క్యాష్ రిచ్ లీగ్‌లో పడే ప్రతి డాట్‌ బాల్‌కు బీసీసీఐ-టాటా గ్రూప్ కలసి 18 మొక్కలు నాటుతాయి. ఇలా ఇప్పటిదాకా వేసిన డాట్ బాల్స్‌తో మొక్కల కౌంట్ ఎంతవరకు చేరిందో ఇప్పుడు చూద్దాం..


ఎక్కువ మొక్కలు నాటించింది ఎవరంటే..

క్యాష్ రిచ్ లీగ్ తాజా సీజన్‌లో సీఎస్‌కే పేసర్ ఖలీల్ అహ్మద్ ఏకంగా 78 డాట్స్ వేశాడు. ప్రతి డాట్ బాల్‌కు 18 మొక్కల చొప్పున చూసుకుంటే.. 78 డాట్స్‌కు కలిపి ఏకంగా 1404 మొక్కలు అవుతాయి. స్టన్నింగ్ బౌలింగ్‌తో అటు జట్టు గెలుపుతో పాటు ఇటు పర్యావరణ పరిరక్షణకు కూడా ఖలీల్ అద్భుతంగా కాంట్రిబ్యూట్ చేస్తున్నాడనే చెప్పాలి. గుజరాత్ టైటాన్స్ పేసర్ మహ్మద్ సిరాజ్ (78 డాట్స్) కూడా ఈ విషయంలో ముందున్నాడు. 78 డాట్స్ వేసిన సిరాజ్.. మొత్తంగా 1314 మొక్కలు నాటేలా చేశాడు.


వీళ్లూ తక్కువేమీ కాదు

కోల్‌కతా నైట్ రైడర్స్ స్పిన్నర్ వరుణ్ చక్రవర్తి 70 డాట్స్ బాల్స్‌తో 1260 మొక్కలు నాటించడంలో దోహదపడ్డాడు. గుజరాత్ టైటాన్స్ పేసర్ ప్రసిద్ధ్ కృష్ణ 65 డాట్స్‌తో 1170 మొక్కలు, కేకేఆర్ స్పీడ్‌స్టర్ హర్షిత్ రాణా 64 మొక్కలతో 1152 మొక్కలు నాటడంలో కీలక పాత్ర పోషించారు. ఇలా టాప్-10 బౌలర్లతో పాటు ఇతర బౌలర్లు నాటించిన మొక్కలన్నింటినీ కలుపుకుంటే కృత్రిమంగా ఒక కొత్త అడవినే సృష్టించొచ్చని సోషల్ మీడియాలో నెటిజన్స్ అంటున్నారు. భారత బోర్డుతో పాటు ఆటగాళ్లంతా తమ పెర్ఫార్మెన్స్‌తో మొక్కలు నాటడంలో చేస్తున్న కృషిని మెచ్చుకుంటున్నారు.


ఇవీ చదవండి:

పరువు తీసుకున్న కేకేఆర్

ఈ బుడతడి తండ్రి.. బ్యాటర్లకు మొగుడు

కాటేరమ్మ కొడుకు అనే నేను..

మరిన్ని క్రీడా, తెలుగు వార్తల కోసం క్లిక్ చేయండి

Updated Date - Apr 16 , 2025 | 06:02 PM